ఆంధ్రప్రదేశ్‌

సోనియా, ఒమర్‌లకు రాజ్‌నాథ్ ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:కాశ్మీర్‌లో తాజా పరిస్థితులపై ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాశ్మీర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లాలతో హోంమంత్రి చర్చించారు. సోమవారం మధ్యాహ్నం ఆ ఇద్దరితో రాజ్‌నాథ్ ఫోన్‌లో మాట్లాడారు. కాశ్మీర్‌లో బుర్హాన్ ఎన్‌కౌంటర్ దరిమిలా ఏర్పడిన పరిస్థితులు, ఎన్‌కౌంటర్ ప్రాధాన్యం, దేశభద్రత అంశాలపై కీలక విషయాలను వారికి హోంమంత్రి వివరించినట్లు తెలిసింది. కాగా కాశ్మీర్ సంఘటనలపై కేంద్రాన్ని విమర్శించడం మానుకోవాలని సోనియా నిర్ణయించారు. దేశభద్రతకు సంబందించిన విషయంలో కేంద్రానికి బాసటగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ పేర్కొంది. కాగా రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి తమ పార్టీ అన్నివిధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు. అయితే సైన్యం, భద్రతాబలగాలు సంయమనంతో వ్యవహరిస్తేనే పరిస్థితులు చక్కబడతాయని ఆయన సూచించారు.