హాలీవుడ్ స్థాయిలో రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* చిత్ర నిర్మాణానికి సన్నాహాలు
* ముందుకొచ్చిన ముగ్గురు యువకులు
ప్రపంచస్థాయిలో ప్రేక్షకులను అలరించిన హాలీవుడ్ సినిమాలు ‘లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్’, ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ తరహాలో భారీ స్థాయిలో భారతీయ పురాణగాధ ‘రామాయణం’ సినిమా నిర్మించాలని ముగ్గురు యువకులు సన్నాహాలు చేస్తున్నారు. హాలీవుడ్, జపాన్, చైనా ప్రేక్షకులతోపాటు భారతీయులను ఆకట్టుకునేలా, వారి అంచనాలకు తగ్గట్టుగా హాలీవుడ్ స్థాయిలో దీనిని రూపొందించాలని తపన పడుతున్నట్లు వారు తెలిపారు. ఆధునిక సాంకేతికత కలబోసి ఆంగ్లభాషలో దీనిని నిర్మిస్తామని వారంటున్నారు. సృజనాత్మక దర్శకులు వినీత్‌సిన్హా, సీన్ గ్రాహమ్, అమెరికాకు చెందిన దర్శకుడు రున్నీ అల్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించి భారతీయ ఇతిహాసాన్ని మిగతా ప్రపంచానికి తెలియజేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. టీవీ చిత్రాలు, సీరియల్స్, కార్టూన్లు, యానిమేషన్ చిత్రాల్లో రామాయణాన్ని ఇప్పటికే పదేపదే ప్రసారం చేసినా హాలీవుడ్ స్థాయిలో, ఆంగ్లంలో రూపొందించాలనుకుంటున్నట్లు తెలిపారు. ‘బాట్‌మాన్’, ‘సూపర్‌మాన్’, ‘స్టార్‌వార్స్’, ‘పోక్‌మాన్’ సినిమాలు ఎలా అయితే ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయో ఆ తరహాలో రామాయణం చిత్రాన్ని త్రీడి, ఐమాక్స్ ఎఫెక్ట్స్‌తో రూపొందిస్తామని వినీత్, గ్రాహమ్ అన్నారు. భారత్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రాలకు 25మిలియన్ యుఎస్ డాలర్లు ఖర్చవుతూంటుందని, దీనికి రెండురెట్లు బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నామని, మా సినిమా అవసరాలకు తగ్గ స్టూడియో అందుబాటులో ఉంటే హాలీవుడ్ స్థాయి సినిమాగా ‘రామాయణం’ చిత్రాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని వారన్నారు. ఎన్నో వేలనాటి రామాయణ కథకు సంబంధించి అప్పటి పరిస్థితులను కళ్లముందుంచేలా డిజైన్లు రూపొందించడం చాలాకష్టంతోకూడుకున్నదని అన్నారు. రామాయణంలో రావణ, హనుమాన్ పాత్రలు ఆసక్తికరమైనవని, హనుమంతుడు తన గదలో రాక్షసులను కొడితే వారు గాలిలోకి ఎగిరిపడే దృశ్యాన్ని ఎలా చిత్రీకరించాలో ఆలోచిస్తేనే రోమాంచితంగా ఉందని వారన్నారు. రావణుడు తెలివైన, హేతుబద్ధమైన, సృజనశీలుడైన, నియమనిష్టలున్న, హాస్య చతురత ఉన్న పాలనాదక్షుడని, ఆయనకు ఉన్న పది తలలు, మనుషుల్లో ఉన్న పది విభిన్న తత్వాల సంకేతమని భావిస్తున్నామని వారన్నారు.