రచ్చ బండ

జల జగడం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మ హారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన బాట పట్టారు. మంగళవారం ఒకవైపు ఫడ్నవీస్‌తో మూడు ప్రాజెక్టులపై ఒప్పందం కుదుర్చుకోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. గాంధీ భవన్ నుంచి టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి సారథ్యంలో నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేశారు. టిఆర్‌ఎస్ అధికారం చేపట్టి రెండేళ్ళు పూర్తయ్యింది కాబట్టి ఇక ప్రభుత్వంపై పోరాటాలను ఉధృ తం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇం దులో భాగంగానే ‘మహా’ ఒప్పందంపై ఉద్య మం దిశగా అడుగులు వేస్తున్నది. ఈ అంశం రాజకీయంగా ఏ మేరకు ఉపకరిస్తుందనే సం దేహాలు సొంత పార్టీలోనే లేకపోలేదు. ఎం దుకంటే వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసిన వారు, పలు పార్టీల నేతలూ ఒప్పందా న్ని సమర్థిస్తున్నారు. గత ప్రభుత్వాల హ యాంలో గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మా ణం తెలంగాణ ప్రాంతానికి తగినంత అనుకూలంగా జరగలేదన్న భావన ఉంది.
గతంలో తెలంగాణలో గోదావరిపై ప్రతిపాదించిన ప్రాజెక్టులు కూడా అంతర్ రాష్ట్ర వి వాదం, అటవీ, పర్యావరణ, సిడబ్ల్యుసి అనుమతులు లభించలేదు. గత ప్రభుత్వాలు ప్రా జెక్టుల నిర్మాణానికి అడుగు వేసినప్పుడు పొ రుగు రాష్ట్రాల నుంచి పలు అభ్యంతరాలు రావడంతో అవి అటకెక్కడం పరిపాటయ్యిం ది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని చివరి పదేళ్ళు పాలించిన కాంగ్రెస్ తమ్మిడి హట్టి దగ్గర 152 ఎత్తులో ప్రాణహిత- చేవెళ్ళ పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఈ ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభు త్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. అంతేకా దు తమ అభ్యంతరాలను తోసిపుచ్చి నిర్మిస్తే నిధులు నిష్ప్రయోజనం అవుతాయని, నీళ్ళు రావని హెచ్చరించింది. అప్పట్లో ముఖ్యమంత్రులెవ్వరూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒ ప్పందాలు చేసుకున్నట్లు అప్పట్లో పాలకులు ప్రకటించినా, అవి ఏవీ ఆచరణకు నోచుకోలేదు. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు అంత ముఖ్యం కాదని ఎన్నికలకు ముందే కెసిఆర్ చెప్పారు. అధికారం చేపట్టిన తర్వాత నీటి పారుదల ప్రాజెక్టులకు రీ-డిజైన్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తమ్మిడిహట్టి వద్ద ఎత్తు తగ్గించి బ్యారేజీ నిర్మించి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్, అసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనుకున్నారు. గోదావరి నదిపై వంద మీటర్ల ఎత్తులో 16.17 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మించి కాళేశ్వరం ప్రాజెక్టు కింద కరీంనగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 18.19 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడంతో పాటు మరో 19 లక్షల ఎకరాలకు స్థీరీకరణ చేయాలని ప్రతిపాదించారు. పెన్‌గంగపై చెనాకా- కొరాటా బ్యారేజీ, ఆదిలాబాద్ జిల్లాలో తాం సి, జైనథ్‌బేలా మండలాల్లో 50 వేల ఎకరా ల్లో సాగు నీరు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులపై మహారాష్టత్రో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకే చారిత్రక ఒప్పందంగా అభివర్ణించక తప్పదు. ఈ రీ-డిజైన్‌తో ప్రాణహిత-చేవెళ్ళ అస్థిత్వం కోల్పోయినట్లే.
ఇక ఇందులో కాంగ్రెస్ అభ్యంతరాలు ఏమిటంటే 152 మీటర్ల ఎత్తును తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదిస్తే, ముఖ్యమంత్రి కెసిఆర్ 148 మీటర్ల ఎత్తుకు తగ్గించ డం అన్యాయమని, పైగా అంచనా వ్యయాన్ని పెంచి, అవినీతికి బార్లా తలుపులు తెరిచారని ఆరోపిస్తున్నది. గోదావరి నదిపై మేడిగడ్డ, చనాకా-కొరాటా గురించి మాట్లాడడం లేదు. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు ప్రతిపాదించి చాలా ఏళ్ళు గడిచాయి. దీంతో అన్ని ధరలు పెరిగి ప్రాజెక్టు అంచనాలు భారీగా పెరగడం, అదనంగా తమ్మిడి హట్టి నిర్మిస్తూనే కాళేశ్వ రం, చనాకా-కొరాటా ప్రాజెక్టులను నిర్మిస్తూ మొత్తం ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయడమే కాకుండా నల్లగొండ వరకూ నీటిని పారించే బృహత్తర ప్రణాళిక రూపొందించడం వల్ల అంచనాలు సహజంగానే పెరుగుతాయి. కాబట్టి దీనిని అవినీతి అంటే ఎలా అని టిఆర్‌ఎస్ ఎదురు దాడి చేస్తున్నది. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును ఎందుకు సకాలంలో నిర్మించలేదని ప్రశ్నిస్తోంది.
నాడు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెబితే పదేళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎందుకు ఒప్పించలేకపోయిందన్నది అధికార పక్షం ప్రశ్న. పైగా అప్పుడు కేంద్రంలో, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు మహారాష్టల్రో కూడా కాంగ్రెస్సే అధికారంలో ఉంది. దీనికి కాంగ్రెస్ వద్ద జవాబు లేదు. 152 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించేందుకు ఒప్పించారా? సంబురాలు చేసుకోవడానికి? అని టిపిసిసి నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 152 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించేందుకు మహా ఒప్పందం చేసుకోవాలని ప్రభు త్వ నీటి పారుదల రంగ నిపుణులే నివేదిక సమర్పించారని ఆయన ప్రకటించారు. దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ విమానాశ్రయం సమీపంలోనే తనకు స్వాగతం పలికేందుకు వచ్చి న కార్యకర్తలను, ప్రజలనుద్దేశించి ప్రసంగి స్తూ ఉత్తమ్‌కు సవాల్ విసిరారు. ఆ పత్రాలు ఉంటే విమానాశ్రయం వద్దకు వచ్చి చూపిస్తే, తాను ఇక్కడి నుంచే రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌కు రాజీనామా సమర్పించి, రాజకీయ స న్యాసం తీసుకుంటానని చెప్పారు. అందుకు ఉత్తమ్ వెంటనే స్పందిస్తూ గురువారం కుట్ర ను బహిర్గతం చేస్తానని తెలిపారు.
మరోవైపు టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి కూడా చిర్రుబుర్రులాడారు. మ హా ఒప్పందం కాదు, మహాదగా అని, దీంతో రాష్ట్ర ప్రజలపై 50 వేల కోట్ల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అధికార, ప్రతిపక్షాల మధ్య జల జగడం నడుస్తున్నది. ఈ జగడం రాష్ట్భ్రావృద్ధికి ఏ మాత్రం మంచి ది కాదు.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి