వరంగల్

శుభ కార్యానికి వెళ్లి వస్తూ.. అనంతలోకాలకు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భార్యాభర్తలతో పాటు సమీప బంధువు మృతి
జనగామ , నవంబర్ 29: అప్పటి వరకు బంధువులతో శుభకార్యంలో సంతోషంగా గడిపిన కుటుంబసభ్యులు స్వగ్రామానికి తిరిగి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అసువులు బాసి అనంతలోకాలకు వెళ్లిన దుర్ఘటన వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్థనగిరి స్టేజి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష్యసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ పట్టణం మట్టెవాడకు చెందిన వాచ్‌కో దుకాణం యజమాని బారెడు ప్రభాకర్(57), అతని భార్య విజయ(47), వారి సమీప బంధువు పద్మావతి(60)తో పాటు అతని ఆరు సంవత్సరాల కూతురు బింద్రు, నాలుగు సంవత్సరాల కుమారుడు బిట్టులు, అలాగే మరో ఇద్దరు బంధువులు కలిసి తన కారులో నల్గొండ జిల్లా భువనగిరిలో శుభాకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. ప్రభాకర్ కారును నడుపుతూ వరంగల్ వైపు వెళ్తుండగా తన వాహనం ముందు వేరొక వాహనం టైరులో గాలి తక్కువగా ఉన్న కారణంగా నెమ్మదిగా వెళ్తుంది. అతివేగంగా డ్రైవ్ చేస్తూ ప్రభాకర్ ముందున్న కారులో ఢీకొట్టడంతో తన కారు కుడివైపు దూసుకెళ్లింది. అదే సమయంలో వరంగల్ డిపోకు చెందిన ఎపి 36 జడ్ 0276 నెంబర్‌గల ఎక్స్‌ప్రెస్ బస్సు హైద్రాబాద్‌కు వెళ్తూ కారును ఢీకొట్టింది. కారు ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవింగ్ చేస్తున్న ప్రభాకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో చిక్కిపోయిన అతని భార్య విజయ, బంధువు పద్మావతిలను స్థానికులు బయటకు తీసి 108 వాహనంలో జిల్లా కేంద్రం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. కాగా చిన్నారులు బిట్టు, బింద్రులు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు. మిగతా ఇద్దరు మహిళలకు స్వల్వగాయాలయ్యాయి. ఈ సంఘటనపై జనగామ రూరల్ సిఐ వాసాల సతీష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.