అంతర్జాతీయం

హఫీజ్ సయాద్ ఉగ్రవాదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 13: ముంబయిలో జరిగిన భయానక ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సరుూద్ విషయంలో పాకిస్తాన్ ఎట్టకేలకు దారికొచ్చింది. ముంబయి పేలుళ్లకు సంబంధించి సరుూద్ ప్రమేయాన్ని రుజువు చేసే సాక్ష్యాధారాలను భారత్ అందించినా ఇంతవరకూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. భారత్ అందించిన సాక్ష్యాధారాల ఆధారంగా అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లకు తలొంచి హఫీజ్ సరుూద్‌ను ఓ ఉగ్రవాదిగా ఎట్టకేలకు ప్రకటించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జమాత్-ఉద్-దవా అధినేతగా ఉన్న సరుూద్‌ను కొన్నాళ్లు గృహ నిర్బంధంలో ఉంచిన పాక్ అతడ్ని విడుదల చేసిన నేపథ్యంలో అంతర్జాతీయ ఒత్తిడి మొదలైంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద ఉంచిన బారికేడ్లను పాకిస్తాన్ పోలీసులు తొలగించడంతో అతడ్ని ఉగ్రవాదిగా ప్రకటించే ప్రక్రియ మొదలైంది. గతంలో భద్రత పేరిట ఈ బారికేడ్లను ఏర్పాటు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తామీ నిర్ణయం తీసుకున్నామని లాహోర్ డీఐజీ ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిషేధించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలను టెర్రరిజం నిరోధక పరిధిలోకి తీసుకొస్తూ ఓ ఆర్డినెన్స్‌పై పాకిస్తాన్ అధ్యక్షుడు మామ్నూన్ హుస్సేన్ సంతకం చేసిన నేపథ్యంలో పాక్ మిలిటెంట్ సంస్థలు భారత్‌పై ఉగ్రవాద దాడికి దిగిన విషయం తెలిసిందే. ఓ పక్క అమెరికా నుంచి వస్తున్న ఒత్తిళ్లు, మిత్రదేశమైన చైనా సైతం నిస్సహాయతను వ్యక్తం చేసిన నేపథ్యంలో దేశంలోని ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులను కఠినంగా వ్యవహరించక తప్పని పరిస్థితి పాకిస్తాన్‌కు ఏర్పడింది. పాకిస్తాన్ తాజా నిర్ణయంతో హఫీజ్ సరుూద్, ఆయన సారథ్యంలోని జమాత్-ఉద్-దవాపై పాకిస్తాన్ సందిగ్ధత తొలగిపోయిందని పాక్ పత్రికలే వ్యాఖ్యానిస్తున్నాయి.