విజయవాడ

జూన్ నాటికల్లా జీ ప్లస్ త్రీ గృహాల నిర్మాణాలను పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 22: రాబోయే జూన్ నాటికల్లా జీ ప్లస్ త్రీ పక్కాగృహాల నిర్మాణాల పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వీఎంసీ కమిషనర్ జే నివాస్ పేర్కొన్నారు. నగర పర్యటనలో భాగంగా గురువారం ఉదయం సింగ్‌నగర్‌లో నిర్మితమవుతున్న పక్కాగృహాల నిర్మాణ పనులను పరిశీలించిన నివాస్ అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రస్తుతం చేపట్టిన 3136 గృహాలను రాబోయే జూన్ నాటికి పూర్తి చేయడంతోపాటు అక్కడ అవసరమైన వౌలిక సదుపాయాల కల్పన పనులను కూడా వేగవంతం చేయాలన్నారు. యూజీడీ,విద్యుత్, మంచిటి సరఫరా రోడ్లు, తదితర వాటిని సిద్ధం చేసి పూర్తిస్థాయిలో గృహాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. తదుపరి గవర్నర్‌పేట సీవీఆర్ ఎంసీ స్కూల్ లో 10వ తరగతి వివిధ సబ్జెట్‌లలో వెనుకబడిన విద్యార్థులకు నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ క్యాంప్‌ను పరిశీలించిన కమిషనర్ నివాస్ టీచర్లకు, విద్యార్థులకు పలు సూచనలుచేశారు. రాబోయే 10వ తరగతి పరీక్షలలో నూరుశాతం ఫలితాలతోపాటు ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఈ జేవీ రామకృష్ణ, హౌసింగ్ ఈఈ మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.