విజయవాడ

ఎవరి సమస్యలు వారివే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, ఫిబ్రవరి 22: ‘నా భార్యను నాకు అప్పగించండి... లేకుంటే ఆత్మహత్య చేసుకుంటా’ అని కొత్తపేత పోలీసు స్టేషన్ ముందు ఓ యువకుడి వీరంగం. ‘నేను 3నెలల గర్భవతిని నా ప్రియుడు నన్ను ఛీకొడుతున్నాడు నాకు చావే శరణ్యం’ అంటూ భవానీపురం పోలీసుస్టేషన్‌లో ఓ యువతి ఆక్రందన. ‘వివాహమై 2 నెలల్లోనే విడిపోయాం. పెద్దల పంతాలు మా జీవితాలను నాశనం చేస్తున్నాయి’ అంటూ వన్‌టౌన్ పోలీసులకు ఓ అభాగ్యురాలి మొర. విజయవాడ వెస్ట్‌జోన్ పరిధిలోని మూడు పోలీసు స్టేషన్‌లలో మూడు జంటలు, భిన్నమైన సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఊర్మిళానగర్‌కి చెందిన ఓ యువకుడు, ఓ యువతి ప్రేమాయణం సాగించారు. కలిసి మెలిసి తిరిగారు. ఫలితంగా ఆ యువతి 3నెలల గర్భవతి. పెళ్లి ప్రస్తావన రాగానే కులాలు అడ్డొచ్చాయి. యువకుని కుటుంబ సభ్యులు సంప్రదాయాలు, కులాలు కట్టుబాట్లు వివరించి ఆ అతని మనస్సు మార్చారు. అంతే ప్రేమికురాలిని వివాహం చేసుకోనని అడ్డం తిరిగాడు. బుధవారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా గురువారం వైద్యపరీక్షలు నిర్వహించి కేసు నమోదు చేశారు. కేసును స్వయంగా ఏసీపీ జీ రామకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వివాహం చేసుకుంటే కథ సుఖాంతం లేకుంటే నిందితుని అరెస్ట్ చేస్తామని ఏసీపీ తెలిపారు. వించిపేటకు చెందిన ఓ యువకుడు ఆ ప్రాంతంలోని ఓ ధనిక కుటుంబానికి చెందిన యువతితో ప్రేమాయణం సాగించాడు. చివరకు ఇద్దరూ పెళ్లి చేసుకుని కొత్తపేట పోలీసులను ఆశ్రయించగా అమ్మాయి తాలూకు తల్లిదండ్రులు, బంధువులు తమకు కొంత గడువు ఇవ్వాలని అబ్బాయి తరుపువారిని పంపించి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తరువాత తల్లిదండ్రులతో కలిసిపోయింది. దీంతో గురువారం ఉదయం ఆ యువకుడు పోలీసు కమిషనర్‌ని కలుసుకుని తన భార్యని తనకు అప్పగించాలని వేడుకోగా కేసును పరిశీలించమని కొత్తపేట పోలీసు స్టేషన్‌కి పంపారు. స్టేషన్ వద్దకు వచ్చిన యువకుడు తన భార్యని తనతో పంపించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని పోలీసుస్టేషన్ వద్ద వీరంగం చేశాడు. దీనితో ఆ యువతి పట్టపగలే అతనికి చుక్కలు చూపించింది. తాను ‘మాయ’లో నుండి బయటపడ్డానని ఆ యువకుడితో వెళ్లనని తల్లిదండ్రుల వద్ద ఉంటానని తేల్చి చెప్పడంతో ఆ యువకుని హైడ్రామా నీరుగారిపోయింది. ఎవరింటికి వారు వెళ్లిపోయారు. ఆ యువతి మేజరైనందున ఆమె అభిప్రాయం ప్రకారం తల్లిదండ్రులకు అప్పగించామని సీఐ జీ మురళీకృష్ణ తెలిపారు. వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని మల్లకార్జునపేటకు చెందిన ఓ యువతికి, విశాఖపట్నానికి చెందిన ఓ యువకునికి గతేడాది పెద్దల అంగీకారంతో వివాహం జరిగింది. కేవలం 2నెలల మాత్రమే ఆ దంపతులు కాపురం చేశారు. అనంతరం వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. విడిపోయి ఎవరింట్లో వారు ఉంటున్నారు. ఇరువర్గాల మధ్య పెద్దల పంతాలు ఎక్కువై ఆ జంటను కలవనీయడం లేదు. పైగా ఆ యువతి తల్లిదండ్రులు, భర్త మాటల మధ్య మానసిక వేదనకు గురవుతూ చావే శరణ్యం అంటోంది. అటు నుండి ఆ యువకుడు కూడా తన భార్య వెళ్లిపోయిందని సమాజం తనని చిన్నచూపు చూస్తోందని తనకు చావే శరణ్యమంటూ పోలీసుల ముందు వాపోతున్నాడు. ఇరువైపు పెద్దలను పిలిపించి వారి కాపురాన్ని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నానని వన్‌టౌన్ సీఐ కాశీవిశ్వనాథ్ తెలిపారు.