విజయవాడ

దుర్గగుడి అభివృద్ధి పనుల్లో దాతలను చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 22: అమ్మవారి సన్నిధిలో తలపెట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేసేందుకు సాధ్యమైన వరకు దాతల సహకారం తీసుకోవాలని అందుకు ధర్మకర్తలు, సిబ్బంది అవసరమైన ప్రణాళికలు రూపొదించుకోవాలని దుర్గగుడి ఈవో ఎం పద్మ పేర్కొన్నారు. పాతబస్తీ బ్రాహ్మణ వీధిలోని దుర్గగుడి పరిపాలన కార్యాలయంలో గురువారం ఈవో ఎం పద్మ దేవస్థానం ట్రస్ట్‌బోర్డు కమిటీ, సహాయ ఈవోలు, ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలో చేపట్టిన అన్నిపనులను సాధ్యమైనంత వరకు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం, పరిసరాల ప్రాంతాల్లో మిగిలిన అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికపై ఇంజనీరింగ్ సిబ్బంది పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే ముందు ప్రకటించిన విధంగా ఈనెల 26నుండి శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయాన్ని పునఃప్రారంభించి భక్తులకు స్వామిని దర్శించుకునే భాగ్యం కల్పించే అవకాశం లభిస్తోందన్నారు. రాయబార మండపం వద్ద జమ్మిదొడ్డి వైపు ఉన్న మెట్ల మార్గాన్ని సాధ్యమైన వరకు తెరచి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఇంజనీరింగ్ అధికారులు పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బంది, అర్చకులు ఏవిధంగా విధులు నిర్వహించాలనే అంశాలకు సంబంధించి సహాయ ఈవోలు ముందుగానే ఒక ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. అమ్మవారి నివేదనశాలలో నిత్యం అమ్మవారికి నివేదన సక్రమంగా అమలు, నివేదనలు తయారు చేసేందుకు అవసరమైన ముడి సరుకులు సకాలంలో అందుతున్నాయా లేవా అనే విషయాలను స్వయంగా పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక అర్చక స్వామిని నియమించాలని దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్‌కు ఆదేశాలు జారీ చేశారు. సామాన్య భక్తులు సైతం అమ్మవారికి చీరను సమర్పించేలా, త్వరలో రూ.150కే చీరను విక్రయించేలా చర్యలు చేపట్టనున్నట్లు ఈవో తెలిపారు. ప్రతి శుక్రవారం అమ్మవారి చీరల కౌంటర్‌లో ట్రస్ట్‌బోర్డు తరుపున ఇద్దరు మహిళా ధర్మకర్తలు, దేవస్థానం తరుపున ఇద్దరు మహిళా ఉద్యోగులు మొత్తం నలుగురు మహిళలు ఒక టీమ్‌గా ఏర్మడి దేవస్థానం కౌంటర్‌లో ఈవారానికి వచ్చిన చీరలకు సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాలని ఈవో పేర్కొన్నారు. ఈ సమావేశంలో దేవస్థానం ట్రస్ట్‌బోర్డు కమిటీ చైర్మన్ వై గౌరంగబాబు, ధర్మకర్తలు వెలగపూడి శంకరబాబు, పద్మశేఖర్, బడేటి ధర్మారావు, సూర్యలత, సాంబ సుశీల, పాప, సహాయ ఈవోలు శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు, ఎం తిరుమలరావు, సాయిబాబా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ భాస్కర్, దేవస్థానం స్థానాచార్యుడు విష్ణు బొట్ల శివప్రసాద్, వివిధ సెక్షన్ల అధికారులు పాల్గొన్నారు.