విజయవాడ

న్యాయవాది కేసులో నిర్లక్ష్యం చూపిన సీఐ, ఏసీపీపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 22: న్యాయవాదిపై దాడి కేసులో పోలీసుల నిర్లక్ష్య వైఖరిని బెజవాడ బార్ అసోసియేషన్ తీవ్రంగా తప్పుపట్టింది. తనపై దాడి చేశారంటూ లాయర్ ఫిర్యాదు చేసినా స్పందించని భవానీపురం సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీబీఏ డిమాండ్ చేసింది. సకాలంలో అందుబాటులో లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వెస్ట్ ఏసీపీపై కూడా చర్యలు తీసుకోవాలని న్యాయవాదుల బృందం నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. అంతకుముందు నగరంలో 200 మంది న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో 4రోజులుగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరిస్తూ వస్తున్నారు. తొలుత బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సోము కృష్ణమూర్తి నేతృత్వంలో న్యాయవాదులు కోర్టుల వద్ద నుంచి ప్రదర్శనగా బయలుదేరి గురువారం సాయంత్రం పోలీసు కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. కమిషనర్ ఛాంబర్‌లో సీపీ సవాంగ్‌తో పాటు జాయింట్ సీపీ రమణకుమార్, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. న్యాయవాది ఫిర్యాదును తొలుత స్వీకరించని భవానీపురం పోలీసులు ఆ తర్వాత తమ ఒత్తిడితో కేసు నమోదు చేసినా సరిగా స్పందించడం లేదని, ఈ వ్యవహారంలో సీఐ రాజాజీ వైఖరి అభ్యంతరకరంగా ఉందని, అదేవిధంగా వెస్ట్ ఏసీపీ గుణ్ణం రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లినా ఆయన కూడా ఏమాత్రం స్పందించలేదని సీపీకి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీఐ, ఏసీపీపై చర్యలు తీసుకోవడంతోపాటు న్యాయవాదిపై నమోదు చేసిన అక్రమ కేసును వెనక్కు తీసుకోవాలని డిమాండు చేశారు. దీంతో స్పందించిన సీపీ పరిశీలిస్తామని చెప్పారు. సుమారు 2 గంటల పాటు చర్చలు కొనసాగాయి.