విజయవాడ

26న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 24: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా ఈ నెల 26న అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించాలని సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ రాష్ట్ర కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈమేరకు తీర్మానించినట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణం స్పందించి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదికతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించకపోతే వీరికి మద్దతుగా రాష్టవ్య్రాప్తంగా ప్రతిరోజూ ఆందోళనలు చేస్తామని చెప్పారు. ఈక్రమంలో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, వేతనాలు పెంచుతామని తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, ఆ ప్రకారం రెగ్యులరైజ్ చేస్తుందని మూడున్నరేళ్లుగా ఆశతో ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు నిరాశే మిగిల్చిందని విమర్శించారు. ఇప్పటికైనా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని గఫూర్ డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ప్రమోషన్లు కల్పించండి
* మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల డిమాండ్
పటమట, ఫిబ్రవరి 24: ఇతర ప్రభుత్వ శాఖల నుండి వచ్చిన అధికారులకు మహిళా, శిశు సంక్షేమ శాఖలో ప్రమోషన్లను కల్పిస్తూ మాతృసంస్థ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని నిరసిస్తూ శనివారం సాయంత్రం పటమట నిర్మలా కానె్వంటు దగ్గరలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈసందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షరాలు మనోరంజని మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఎంతోమంది సీనియర్ అధికారులకు ప్రమోషన్లకు అర్హత ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు వారికి మొండిచేయి చూపిస్తూ రెవెన్యూ, పంచాయతీరాజ్, కో-ఆపరేటివ్ శాఖల నుండి తీసుకొచ్చిన వారికి ప్రమోషన్లు ఇవ్వటం దారుణమన్నారు. ఏడేళ్ల నుండి మహిళా, శిశు సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించకుండా ఉన్నతాధికారులు ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఇతర శాఖల నుండి డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారుల నియమాకాలను రద్దు చేయాలని అమె డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు ఆర్ అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.