డైలీ సీరియల్

యాజ్ఞసేని 56

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజసూయయాగం పరిసమాప్తమయిన తరువాత వ్యాసమహర్షి తన శిష్యులతో కలిసి ధర్మరాజు వద్దకు వచ్చాడు. పాండవులందరూ ఎదురేగి పాద్యం, ఆసనం సమర్పించి తాతాగారిని పూజించారు. మహర్షిని సువర్ణ సింహాసనంమీద ఆసీనునిగావించారు. అంత మహర్షి సోదరులతో కూడి కూర్చున్న యుధిష్ఠిరునితో
‘కౌంతేయా దుర్లభమైన సామ్రాజ్యాన్ని పొంది అదృష్టం కొద్ది వృద్ధి పొందుతున్నావు. కౌరవులందరినీ నీవు వృద్ధి పొందిస్తున్నావు. రాజా! నీవు నన్ను పూజించావు. ఇక నేను వెళతాను. నీ అనుమతి కోరుచున్నాము’’ అని పల్కిన మహర్షికి నమస్కరించి పాదాలు పట్టుకొని ధర్మరాజు తాతగారితో-
పురుషోత్తమా! నాకు గొప్ప సంశయం ఒకటి కలిగింది. ద్విజశ్రేష్ఠా! నీవు దప్ప దానికి సమాధానము చెప్పగలవారు వేరొకరు లేరు. పితామహా! ఉత్పాతాలు దివ్యాలని, అంతరిక్షాలని, పార్థివాలని, మూడు రకాలుగా వుంటాయనీ నారద మహర్షులవారు చెప్పారు. శిశుపాలుని మరణంతో ఈ ఉత్పాతాలు ఏమయినా శాంతించాయా? అని అడిగాడు. అందుకు మహర్షి-
‘‘రాజా! మహోత్పాతాల ఫలితం పదమూడేళ్లు తరువాత కనిపిస్తుంది. సర్వక్షత్రియ నాశనం జరుగుతుంది. భరతశ్రేష్ఠా! సమయంకానే నీ కారణంగా, దుర్యోధనుని అపరాధంవలన, భీమార్జునుల పరాక్రమం ద్వారా భూమిమీది రాజులందరూ కలిసి పరస్పర యుద్ధంలో నాశవౌతారు. కాలము దాటరానిది. నీకు శుభమగుగాక! నేను కైలాసానికి వెళ్ళుచున్నాను. నీవు ఇంద్రియ నిగ్రహంకలిగి అప్రమత్తంగా యుంటూ భూమిని పాలింపుము’’ అని చెప్పి శిష్యులతోకలిసి కైలాస పర్వతానికి వెళ్లిపోయాడు.
32
ధర్మరాజు రాజసూయయాగానంతరం వ్యాసమహర్షి చెప్పిన విషయాలకు కలత చెందాడు.
పదే పదే నిట్టూర్పులు విడుస్తున్నాడు. ‘‘పౌరుషంతో దైవాన్ని అడ్డుకోవటం ఎలా శక్యవౌతుంది. మహర్షి చెప్పింది తప్పకుండా జరిగి తీరుతుంది’’ అని అనుకోసాగాడు.
తమ్ములను చూచి ‘‘తమ్ములారా! వ్యాసమహర్షి నాతో చెప్పినది మీరు కూడా విన్నారు గదా? సర్వక్షత్రియ నాశనానికి విధి ననే్న కారణంగా చేయదలచుకుంటే నేను జీవించియుండటం ప్రయోజనమేమిటి? అని అన్నాడు. అన్న మాటలకు అర్జునుడు - ‘‘రాజా! పాప భూయిష్టమైన, ఘోరమైన మోసాన్ని పొందకు. ధైర్యం వహించి ఏది మేలో దానిని ఆచరించుము’ అని అన్నాడు.
‘‘నేను నేటినుండి సోదరులతోగాని, ఇతరులతోగాని పరుషంగా మాట్లాడను. జ్ఞాతుల ఆజ్ఞ పాటిస్తూ వారు అడిగినవన్నీ ఇవ్వడంలో నిమగ్నవౌతాను. నాకు ఎవరిపట్ల భేదభావం రాకుండునటుల ఆ భగవంతుని కోరుచున్నాను’’ అని ప్రతిజ్ఞ పూర్వకంగా అన్నాడు ధర్మరాజు.
అయితే దుర్యోధనుడు మాత్రము శకునితో కలిసి ఇద్దరూ రమణీయమయిన ఆ సభాభవనంలో ఉండిపోయారు.
33
మయసభా భవనంలో దుర్యోధనుని భంగపాటు
దుర్యోధనుడు యజ్ఞానంతరం శకునితో కలిసి మయసభా భవనాన్ని పరిశీలించసాగాడు. హస్తినలో తానెప్పుడూ చూడని దివ్యమైన దృశ్యాలను చూస్తూ సంప్రీతి పొందసాగాడు.
ఆ సభాభవనంలోని చతురస్ర స్థలాన్ని చేరుకొని అక్కడ నీరున్నదనే సందేహంతో తన కట్టుబట్టును పైకెత్తి పట్టుకొన్నాడు. అక్కడ నీరు లేదని తెలిసికొని తన బుద్ధి పొరపడినందులకు మనసులో విచారిస్తాడు. అనంతరం నేలపై పడిపోయాడు.
పిదప స్ఫటిక మణులవలె స్వచ్ఛమైన జలంతో, స్ఫటికమణిమయ పద్మాలతో అలరారే కొలనును చూసి అది స్థలం అనుకొని కట్టుబట్టలతో నీటిలో పడిపోయాడు. అలా నీళ్ళలో పడిన దుర్యోధనుని చూచి భీమసేనుడు నవ్వుతాడు. అక్కడనున్న పరిచారికలు కూడా నవ్వుతారు.
ఆ పరిస్థితిలోనున్న దుర్యోధనుని చూచిన అర్జున నకుల సహదేవులు కూడా నవ్వుతారు.

..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము