గ్రాఫిక్స్ వల్లే ఆలస్యం ‘తొలికిరణం’ దర్శకుడు జాన్‌బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సువర్ణ క్రియేషన్స్ పతాకంపై జాన్‌బాబు దర్శకత్వంలో సీనియర్ హీరో భానుచందర్ ముఖ్యపాత్ర చేయగా పి.డి.రాజు యేసుక్రీస్తు రోల్ పోషిస్తున్న చిత్రం ‘తొలికిరణం’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడుతూ తొలికిరణం అంటే ‘్ఫస్ట్‌లైట్’ అని అర్థం. యేసుప్రభుకు సంబంధించిన సినిమాలు చాలానే వచ్చాయి కానీ అతని జీవిత కథ ఆధారంగా క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే దాకా ఉన్న కథలు మాత్రమే మనకు తెలుసు. తొలికిరణం అలా కాదు. ఆయన చనిపోయిన 3 రోజుల తరువాత బ్రతికి వచ్చి ఏం చేసాడు, భక్తులకు ఏం బోధించాడు అనే కానె్సప్ట్‌తో వస్తున్న మొదటి సినిమా. ఇజ్రాయిల్ దేశానికి వెళ్లి రీసెర్చి చేసి మరీ తీసిన సినిమా ఇది. ఇక క్రీస్తు పాత్రలో పిడి రాజు ఒదిగిపోయారు. ఆయన్ను చూస్తుంటే అచ్చు క్రీస్తు భగవానుని చూస్తున్నట్టే ఉంది. ఇందులో క్రీస్తుహ్యూమన్ కాదు గాడ్ ఎలా అయ్యాడు అని తెలుసుకోవడానికి వచ్చిన హనుమంత్ యూసుఫ్ పాత్రను పోషించాను. త్వరలో జాన్‌బాబు డైరెక్షన్‌లో మా బాబు జయంత్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నామని ఈ సందర్భంగా మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. డైరెక్టర్ జాన్‌బాబు మాట్లాడుతూ ఈ చిత్రంలో గ్రాఫిక్స్ 45 మినిట్స్ ఉండటం అందుకు లండన్‌లో వర్క్ జరగటం మూలానే సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. లేట్ అయినా క్వాలిటీ అందించాలనే తపనతో జాప్యం జరిగింది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయనున్నాము. నా స్నేహితుడు నిర్మాత సుధాకర్ నాకు చాలా సహకరించారు. నా తదుపరి చిత్రం భానుచందర్‌గారి అబ్బాయి జయంత్‌తో మొదలు కానుంది. ఆ వివరాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. పి.డి. రాజు మాట్లాడుతూ క్రీస్తు పాత్రను పోషిస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.