రవిశంకర్ చల్ చల్ గుర్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రాజరథం’ నుండి ముచ్చటగా మూడో పాట ‘చల్ చల్ గుర్రం’ విడుదలైంది. చిత్రానికి పనిచేసే వారిని ఆకట్టుకునే నైపుణ్యంతో, ఉన్నత ప్రమాణాలతో ఆకర్షిస్తున్న ‘రాజరథం’ ఈ పాటతో మరోసారి ఆశ్చర్యపరచనుంది. ఎన్నో సినిమాలకి, ఎంతో మందికి డబ్బింగ్ చెప్పిన ప్రముఖ నటుడు రవిశంకర్ మొట్టమొదటిసారి ‘రాజరథం’లో తాను పోషిస్తున్న ‘అంకుల్’ పాత్ర కోసం ‘చల్ చల్ గుర్రం’ పాట పాడారు. ఈ పాటని మహేబలేశ్వర్, పూణేలోని మాల్షెజ్ ఘాట్ వంటి అందమైన ప్రదేశాలలో కనువిందుగా చిత్రీకరించారు. దర్శకుడు అనూప్ భండారీ సహజమైన మంచు కోసం మాల్షెజ్ ఘాట్ ఎంచుకున్నారు. ఒకోసారి మంచు తీవ్రత తగ్గేవరకూ ఆగి షూటింగ్ చేసుకోవాల్సి వచ్చేది. రాజరథం కోసం దిలీప్‌రాజ్ ప్రత్యేకంగా డిజైన్ చేసి తయారు చేసిన పాతకాలపు సైడ్ కార్ ఉండే స్కూటర్ ఈ పాటకి అదనపు ఆకర్షణ. ఈ స్కూటర్ మనల్ని పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లడం ఖాయం. ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటల ట్యూన్లతో సరిపోయేలా ఉండే ఈ ‘చల్ చల్ గుర్రం’ సాహిత్యంలో చాలా అరుదైన తెలుగు పదాలని సినిమా కథకి సరిపోయేలా ఉపయోగించారు. రామజోగయ్య శాస్ర్తీ పదాల అల్లిక, అనూప్ భండారి స్వరపరిచిన బాణీ వలన ఈ పాట వీనుల విందుగా ఉంటూ సాహిత్యపరంగా ప్రత్యేకతని చాటుకుంది. నృత్య దర్శకులు బోస్కో సీజర్ పర్యవేక్షణలో కనువిందు చేసేలా రూపొందిన ఈ పాటలో స్థానిక పల్లెజనాలు కూడా పాలు పంచుకున్నారు. నిరూప్ భండారీ, అవంతిక శెట్టి, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించి, అనూప్ భండారీ దర్శకత్వంలో, జాలీ హిట్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘రాజరథం’ ప్రపంచవ్యాప్తంగా ఈనెల 23న విడుదల కానుంది.