23న ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలని ప్రతి ఒక్కరి మనసులోను ఉంటుంది. జీవితంలో మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. కాలేజీలో, క్యాంపస్‌లో సరదాగా గడిపే క్షణాలు మాత్రం ఆనందానికి కేరాఫ్ అడ్రస్‌లు. ఓవైపు చదువు అనే బాధ్యత ఉన్నా.. భవిష్యత్తు గురించి ఆలోచనలు వెంటాడుతున్నా.. చుట్టూ స్నేహితులు, అందమైన ఆనందాల లోకంలో విహరింపచేస్తాయి. అలా ప్రతి ఒక్కరూ తమ కాలేజ్ డేస్‌లో ఆస్వాదించిన ఆనందాన్ని మరలా ఓసారి తెరమీద చూపించడానికి సన్నాహాలు చేస్తున్నారు సుఖీభవ మూవీస్ అధినేత ఎత్తరి గురురాజ్. మలయాళంలో సూపర్‌డూపర్ హిట్ అయిన ‘ఆనందం’ చిత్రాన్ని అదే పేరుతో ఆయన తెలుగు ప్రేక్షకులకు ఈ నెల 23న అందించనున్నారు. మలయాళ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ చిత్రానికి గణేష్‌రాజ్ దర్శకత్వం వహించారు. కేరళ టాప్ హీరో ‘ప్రేమమ్’ ఫేమ్ నివిన్‌పాల్ ఇందులో గెస్ట్ రోల్ చేశారు. మిగిలిన నటీనటులందరూ దాదాపుగా కొత్తవారే. తెలుగులో అనువాదమవుతోన్న ‘ఆనందం’ చిత్రానికి వీరా వెంకటేశ్వరరావు (పెదబాబు), విఆర్‌బి రాజు, రవి వర్మ చిలువూరి సహ నిర్మాతలు. సీనియర్ నిర్మాత ఆర్.సీతారామరాజు సమర్పిస్తున్నారు. చిత్ర నిర్మాత ఎత్తరి గురురాజ్ మాట్లాడుతూ మా ‘ఆనందం’ అనువాద పనులు దాదాపుగా పూర్తయ్యాయి. తుది మెరుగులు దిద్దుతున్నాం. ఈ నెల 17న పాటల వేడుకను గ్రాండ్‌గా నిర్వహిస్తాం. కేరళలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన సచిన్ వారియర్ స్వరాలకు వనమాలి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ‘హ్యాపీడేస్’ పాటల తరహాలోనే మా పాటలు కూడా తప్పకుండా హిట్ అవుతాయి. యువత చెవుల్లో మార్మోగుతాయని కచ్చితంగా చెప్పగలను. ఈ నెల 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. కేరళలో నిర్మాతలు పెట్టిన ఖర్చుకు ఐదింతలు మొత్తాన్ని బాక్సాఫీస్ దగ్గర రాబట్టగలిగిందంటేనే ఈ కథకున్న పవర్‌ని అర్థం చేసుకోవచ్చు. తెలుగులోనూ అందుకు ధీటుగా ఆడుతుందనే నమ్మకం ఉంది. పలువురు ఈ సినిమాను రీమేక్ చేస్తామని, రైట్స్ ఇవ్వమని అడిగినప్పటికీ ఆ నమ్మకంతోనే మేం అనువాదం చేస్తున్నాం. ఎక్కడా మలయాళ సినిమా అనిపించదు. కాలేజీ అనుభవాలు అనేవి ప్రపంచంలో ఎక్కడైనా ఒకే రకంగా ఉంటాయి. మనసు పొరల్లో పదిలంగా జ్ఞాపకాలుగా మిగిలి ఉంటాయి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ చదువుకునే రోజులు గుర్తుకొస్తాయి. ఒక ఇండస్ట్రీయల్ టూర్ నాలుగు రోజులు జరిగితే అక్కడ మూడు ప్రేమ జంటల కథే మా సినిమా. తప్పకుండా ప్రతి గుండెనూ తడుతుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఎం.రాజశేఖర్‌రెడ్డి, పాటలు: వనమాలి, సంగీతం: సచిన్ వారియర్, కెమెరా: ఆనంద్, ఇ.చంద్రన్, సహ నిర్మాతలు: వీరా వెంకటేశ్వరరావు (పెదబాబు), విఆర్‌బి రాజు,రవివర్మ చిలువూరి, దర్శకత్వం: గణేశ్‌రాజ్, సమర్పణ: ఆర్.సీతారామరాజు.