మనోజ్‌నందన్ ‘మనసైనోడు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోజ్ నందన్, ప్రియాసింగ్ హీరోహీరోయిన్లుగా హెచ్.పిక్చర్స్ పతాకంపై హసీబుద్దీన్ నిర్మాతగా, సత్యవరపువెంకటేశ్వరరావుని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘మనసైనోడు’ ఇటీవల ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17న విడుదల చేస్తున్నారు. యువతీ యువకులు స్నేహంలో ఉన్నప్పుడు, ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ల మధ్య జరిగే భావోద్వేగాలను కథలో జోడించి, మంచి మెసేజ్‌తో పాటు యువకుల్లో దేశభక్తికలిగే విధంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘మనసైనోడు’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దామనిదర్శకుడు తెలియజేశారు. ఇంకా ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, రఘుబాబు, గిరిబాబు, కేదార్ శంకర్, గుర్రాజు, వేణుగోపాల్, అనంత్, చైతన్య, శశాంక, సంగీత, మధుమని, జ్యోతి, దివ్యశ్రీ గౌడ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేంద్రరెడ్డి, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం: సుభాష్ ఆనంద్, పాటలు: డా.సి.నారాయణ రెడ్డి, భాస్కరభట్ల, గోపాల రాంబాబు, పూర్ణచారి, నిర్మాత: హసీబుద్దీన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్యవరపు వెంకటేశ్వరరావు.