సంజీవని

వేళ్లు తెగితే... వేదనొద్దు ..అందుబాటులోకి ఆధునిక శస్త్ర చికిత్సలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన ఓ పెట్రోకెమికల్స్ ఫ్యాక్టరీలో సాంకేతిక నిపుణుడు. రెండు సంవత్సరాల క్రితం ఆయన కుడి చేతి వేలు, మధ్య వేలు తెగిపోయాయి. బొటనవేలు పైభాగం కూడా నలిగిపోయింది. దాంతో ఆ వేలిని తీసివేయాల్సి వచ్చింది. దాంతో కుడి చేయి పనితీరే దెబ్బతింది.
దాంతో ఆయనను ప్లాస్టిక్ సర్జరీ సలహా కోసం తీసుకువచ్చారు.
వేళ్ళని బట్టి చేతిపని తీరు ఉంటుంది. ఇది అందం కోసం చేసే శస్తచ్రికిత్స కాదు. అవసరం కోసం చేసే శస్తచ్రికిత్స. కుడి చేతి పని తీరు మెరుగుపడాలంటే బొటనవేలు పునర్నిర్మాణం జరగాలి. చేతితో ఏ పని చేయాలన్నా బొటనవేలు ఒక్కటే ఒకపక్కనుంటుంది. మిగతా వేళ్ళన్నీ రెండో ప్రక్కనుంటాయి. అందుకోవడం, పట్టుకోవడం లాంటి ఏ పని చేయాలన్నా బొటనవేలు ముఖ్యం.
కానీ కాలిబొటనవేలు చేతికి చాలా పెద్దదవుతుంది. అందుకని కాలి బొటనవేలు పక్క వేలుని తీసి కుడి చేతి బొటనవేలుగా మార్చాలనుకున్నా మైక్రోవాస్క్యులార్ సర్జరి అవసరమవుతుంది.
ముందు క్షుణ్ణంగా ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించి ప్లాస్టిక్ సర్జరీ ప్రారంభించారు. 15 గంటలు పట్టింది. ఆ తర్వాత గాయాలూ తేలికగా నయమయ్యాయి.
వేలు మామూలుగా కనిపించడానికి కొంత కాస్మొటిక్ చికిత్స అవసరమయింది. ఇది మన దేశంలోనే చాలా తక్కువ కేంద్రాలలో నిర్వహిస్తున్న ప్లాస్టిక్ సర్జరీ. చాలా పనితనంతో కూడిన శస్తచ్రికిత్స.
నెల తర్వాత ఆయన వేళ్ళని కదిలించసాగాడు. ఆ తర్వాత ఫిజియోథెరపీ అవసరం. దానితో వేళ్ళ పని తీరు పూర్తిగా మెరుగైంది. ఇప్పుడాయన ఆ చేతి వేళ్ళతో ఆయన తన పని చేసుకుంటున్నారు.
రక్తనాళాలు, నరాలతో కాలి రెండో వేలుని తీస్తారు. తెగిన చేతి రక్తనాళాలు, నరాల్ని కాలి వేలు అమర్చే ముందు సిద్ధం చేస్తారు. కాలి నుంచి తీసిన వేలుని తెగిన వేలు స్థానంలో కలపడానికి వీలుగా మారుస్తారు. తెగిన కాలు ఎముక, టెండాన్స్‌ని అక్కడుంచబోయే కాలి వేలు ఎముక, టెండాన్స్‌కి జాగ్రత్తగా కలుపుతారు. అప్పుడు రెండు ప్రక్కలా నరాలు, రక్తనాళాలు కలుపుతారు.
ఈ శస్తచ్రికిత్స జరగాలంటే రోగికి రక్తనాళాల సమస్యలుండకూడదు. ఇంకా ఏ పెద్ద జబ్బులూ ఉండకూడదు. మానసిక జబ్బులూ ఉండకూడదు. కాలికి గాయమై ఉండకూడదు. కాలి వేలిని తీయాలంటే, వయసుతో వచ్చే ఆర్టిరియోస్ల్కీరోసిస్ కూడా ఉండకూడదు.
చేతి వేళ్ళు తెగిపోయినప్పుడు కాలి వేలుని మార్చడమే ఉత్తమమైన మార్గం. ఆ వేలు తెగిన చేతి బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలు స్థానంలో చక్కగా పనిచేస్తుంది.

-డా.శశికాంత్ మద్దు ప్లాస్టిక్ సర్జన్, యశోద సూపర్ స్పెషాలిటీ 9581258179