సంజీవని

నోరు ఎండిపోతుంటే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన నోటిలో లాలాజల గ్రంథులు కావలసినంత లాలాజలాన్ని ఉత్పత్తి చేయలేకపోతే నోరు ఎండిపోతుంటుంది. ఈ స్థితిని ‘జీరోస్టోమియా’ అంటారు. అది వచ్చే కారణాన్ని బట్టి తాత్కాలికంగా లేక శాశ్వత ఇబ్బంది అవుతుంది. కారణాలు- షాక్ లేక దెబ్బతగలడం లాలాజల గ్రంథులకు ఆటో ఇమ్యూన్ డిసీజ్, నోటి ద్వారా గాలి పీల్చడం, గ్రంథుల డిజార్డర్, ఒత్తిడి, అధిక రక్తపోటు, కొన్ని మందులు. లాలాజల గ్రంథులకు స్ఫూర్తినిచ్చేవి లూబ్రికెంట్స్, కృత్రిమ లాలాజల గ్రంథులు ఈ ఇబ్బందిని తొలగించడానికి తోడ్పడతాయి. నోరు ఎండిపోవడంతో వచ్చే ఇబ్బందితో పళ్ళు దెబ్బతినకుండా ఫ్లోరైడ్ టూత్‌పేస్టుని వాడాలి. ఎక్కువగా ద్రావకాలు తీసుకోవడం, పంచదార లేని గమ్స్‌ని నములుతూ ఈ ఇబ్బందిని తొలగించుకోవచ్చు. నోరు ఎండిపోతున్న ఇబ్బంది వున్నవాళ్ళు మసాలాలను తినకూడదు. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకూడదు. వాటివల్ల నోటిలోని మెత్తటి కణాలు ఇరిటేట్ అవుతాయి. ఈ ఇబ్బందితో నోటిలో పుళ్ళు రావచ్చు.

డా.సుధీర్
డెంటిస్ట్, సూపర్ స్పెషాలిటీ హస్పిటల్, అమీర్‌పేట, 9885012444

డా.సుధీర్