సంజీవని

ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కి ఇదీ మందు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహారం ఫైబర్
100 గ్రాములలో
గోధుమలు 24.7
ఉడకబెట్టిన ఓట్స్ 8.8
గ్రెయిన్ బ్రెడ్ 7.4
ఒక స్లయిస్ 1.5
కార్న్‌ఫ్లెక్స్ 6.1
బటానీ 7.5
బ్రాడ్‌బీన్స్ 6.4
వండిన బీన్స్ 4.2
గ్రీన్ బీన్స్ 1.9
పుట్టగొడుగులు 3.8
కారట్ 2.1
యాపిల్ 1.7
పొటాటో 1.3
చెర్రీస్ 1.3
ద్రాక్ష 0.6

ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ - గురించి మనం ఎక్కువగా వింటుంటాం. ఆహారనాళ ఇబ్బందులలో దీనిని ప్రధానంగా చెప్పుకోవాలి. ప్రేగులలో కదలికలు ఒక పద్ధతి ప్రకారం జరుగుతూంటాయి. ఆ కదలికల క్రమంలో మార్పొస్తుంది. దీంతో ప్రేగులలో ఆహారం, వ్యర్థాలూ కూడా పద్ధతి లేకుండా కదులుతుంటాయి. దీనినే ‘ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అంటారు. కొలైటిస్‌కి దీనికి తేడా వుంది. ‘కొలైటిస్’ ఇన్‌ఫ్లమేటరి డిసీజ్.
ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్‌వల్ల కడుపు నొప్పి, విరేచనాలు, మలబద్ధకం మారి మారి వస్తుంటుంది. కడుపుబ్బరించినట్లుంటుంది. ఆడవాళ్ళు, తక్కువ వయస్సున్నవాళ్ళు, ఎక్కువ వయస్సున్నవాళ్ళందరిలో రావచ్చు. కొన్ని వారాలు, నెలలు ఇబ్బంది పెట్టి హఠాత్తుగా కొన్ని నెలలు మాయం కావచ్చు. మళ్లీ రావచ్చు.
ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ మరికొన్ని జీర్ణకోశ వ్యాధులని పోలి వుండడంతో దీని నిర్థారణ చేయడం కష్టం. ఎక్స్‌రే, ఎండోస్కోపి, మల పరీక్షలాంటివి చేయాలి. లాక్టోజ్ (మిల్క్ సుగర్)ని జీర్ణం చేసుకోలేని స్థితా కూడా నిర్థారణ చేసుకోవాలి.
మానసిక ఉద్రేకాలు ఐ.బి.ఎస్‌కి కారణమని చాలామంది అభిప్రాయం. ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడే ఇది కనిపిస్తుంది కాబట్టి అలా అనుకునే అవకాశం వుంది. కొన్నిసార్లు సైకలాజికల్ కౌనె్సలింగ్ అవసరమవుతుంది. ఆహార పదార్థాలలో కొన్నింటిని తినకూడదు.
మలబద్ధక ముంటే లాక్సేటివ్స్‌వల్ల మలాన్ని మెత్తపరచవచ్చు. బాగా ఫైబరున్న ఆహారాన్ని తీసుకోవాలి. విరేచనాలు అయ్యేప్పుడు కట్టే మందులు తోడ్పడతాయి. కొన్ని కండరాల రిలాక్సెంట్ మందుల్ని వాడడంవల్ల నొప్పి తగ్గుతుంది.
దీనికి కచ్చితమైన చికిత్స లేదు. పూర్తిగా నయమయ్యే వరకూ ఇలా రకరకాల మందుల్ని వాడాల్సి రావచ్చు.
ఫైబర్ ఎక్కువగా వున్న ఆహారం తీసుకోవడం మంచిది. కొవ్వు తక్కువగా వుండి ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండాలి. తొక్క తియ్యని పళ్ళు, ధాన్యాలు, కూరల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రకరకాల ఆహారం నుంచి ఫైబర్ తీసుకుంటుంటే రకరకాల ఫైబర్ లభిస్తుంది.

-డా.గోవింద్ ఆర్.వర్మ
గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, పేస్ హాస్పిటల్స్, 8885095601

-డా.గోవింద్ ఆర్.వర్మ