సంజీవని

మూత్రంలో మంట (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర:తరచూ మూత్రం మంటగా అవుతోంది. ఎలా తగ్గించుకోవాలో వివరించగలరు?
పోతురాజు రంగయ్య, కాకుమాను
జ: మీరు వ్రాసిన వివరాలను బట్టి మీ శరీరంలో వేడి ఎక్కువగా వుంటోందని అర్థం అవుతోంది. శరీరంలో ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉండటంవలన మూత్రంలో మంట కలగవచ్చు. ఆమ్లానికి వ్యతిరేకమైన మృదుక్షారాలను వాడితే మంట తగ్గుతుంది. తీక్షణమైన క్షారాలు తీసుకున్నపుడు కూడా మూత్రంలో మంట రావచ్చు. కాల్షియం ఆగ్జలేట్ రాళ్ళు మూత్రపిండాల్లో ఏర్పడటానికి కారణం ఇదే! శరీరంలో ఆమ్ల క్షార గుణాల సమతుల్యత ఉన్నపుడు ఏ ఇబ్బందీ రాదు. నీరు ఎక్కువగా త్రాగే అలవాటు చేసుకోండి. మజ్జిగ మీద తేరుకున్న నీటిని తాగితే ఇంకా మంచిది.
-ఒక ముల్లంగి దుంప, ఒక క్యారెట్ దుంప, ఒక యాపిల్ పండు... ఈ మూడింటినీ మిక్సీ పట్టి, ఆ రసంలో ఓ పది నిమిషాలసేపు సబ్జా గింజల్ని నాననిచ్చి తాగండి.. తరచూ వేడి చేసే స్వభావం ఉన్నవారు ఈ అలవాటు చేసుకుంటే వేడి, మంట, మూత్రంలో పచ్చదనం తగ్గుతాయి.
-అరటిపండు, కూర, అరటికాయ, అరటి దుంప- వీటిని ఆహార పదార్థాలుగా చేసుకుని తినే అలవాటు వలన మూత్రాశయ వ్యవస్థ శక్తిమంతం అవుతుంది.
-ఆగ్జలేట్ పలుకులు మూత్రంలో ఉన్నప్పుడు ఉలవల వాడకం మేలునిస్తుంది. అతిగా చింతపండు, అల్లం వెల్లుల్లీ కలిసిన ఉలవ వంటకాలు కాకుండా, ఉలవ గుగ్గిళ్ళను తాలింపు పెట్టుకోవటం, పప్పుగానో కట్టుగానో వండుకోవటం మంచిది.
-మూత్రంలో చీము కణాలు ఎక్కువగా ఉండటవలన మూత్ర పచ్చగా, మంటగా వెళ్తున్నవారు నీటిని తప్పనిసరిగా తెర్లేవరకూ మరిగించి చల్లార్చి త్రాగటం అవసరం. మజ్జిగ ఎక్కువగా త్రాగడం మంచిది. పటికగడ్డని దంచి మట్టి మూకుడులో బాగా వేయిస్తే కరిగి వెంటనే భస్మంలా మారుతుంది. ఈ పటిక భస్మం చిటికెడంత తీసుకుని గ్లాసుడు మరిగించి చల్లార్చిననీటిలో కలిపి తాగుతూ ఉంటే మూత్రంలో చీము కూడా తగ్గుతుంది. పచ్చగా మూత్రం వెళ్ళటం ఆగుతుంది.
-గ్లాసు నీళ్లలో చిటికెడంత వాము, పసుపు వేసి మరిగించుకుని మంచినీళ్ళకు బదులుగా ఈ నీళ్ళని తాగుతూ ఉంటే మూత్రంలో ఆమ్ల, క్షార సమతుల్యత సాధ్యం అవుతుంది. మజ్జిగలో వాము, పసుపు కలిపి కూడా తాగవచ్చు. వాము ఆకులు, అల్లంరసం, కర్బూజా పండు ఇలాంటి అందుకు ఉపయోగపడతాయి.
-దర్భగడ్డి వేళ్ళు దొరికితే తెచ్చుకుని శుభప్రరచుకుని, ఎండించి దంచిన పొడిని అర చెంచా మోతాదులో తీసుకుని పెద్ద గ్లాసు నీళ్ళలో వేసి మరిగించి రోజూ తాగుతుంటే మూత్రాశయంలో వచ్చే ప్రమాదకర వ్యాధులన్నింటిలోనూ మంచినిస్తుంది.
-కొండపిండి ఆకుతో కూర, పప్పు, పచ్చడి లాంటివి చేసుకుంటే తోటకూర మాదిరిగానే రుచిగా ఉంటాయి. దీన్ని తరూ తినే అలవాటు వలన మూత్రంలో బాధలు, మూత్రాశయంలో రాళ్ళు, మూత్రపిండాల వ్యాధుల్లో తీవ్రత తగ్గే అవకాశం ఉంది.
-నీరుల్లిపాయలు మూత్రంలో మంటని తగ్గిస్తాయి.
-గోక్షురాది చూర్ణం అనే ఔషధం అన్ని ఆయుర్వేద మందుల షాపుల్లోనూ దొరుకుతుంది. ఈ పొడిని గ్లాసు మజ్జిగలో అరచెంచా చొప్పున కలిపి రోజూ రెండుపూటలా తాగుతుంటే మూత్ర వ్యాధుల్లో చాలా ఉపశమనం కలుగుతుంది. మంట, పచ్చదనం తగ్గుతాయి.
మూత్రవ్యాధులు రావటానికి అపరిశుభ్రత ఆహారం తీసుకోవటం, సీసం లాంటి ఖనిజాల కల్తీ జరిగిన వాటిని తినటం, అనేక ఇతర వ్యాధులకు అదేపనిగా మందులు వాడటం, నీరు తక్కువగా తాగటం, వేళాపాళా లేని ఆహార అలవాట్లు, అతిగా ప్రయాణాలూ ఇవన్నీ కారణాలే! వాటిని సరిచేసుకోవటంవలన ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642,

డా జి.వి.పూర్ణచందు