సంజీవని

నోటిలో ఫుళ్ళు ఎందుకు వస్తాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతీ సంవత్సరం వేసవిలో మా ఆయన పెదాల మీద చిన్న చిన్న పుళ్ళు కనిపిస్తాయి. ఎందుకంటారు? చికిత్స లేదా?
- చాలామందికి మీ భర్తగారికిలా వేసవిలో కోల్డ్ సోర్స్ వస్తుంటాయి. మర్మావయాల దగ్గర హెర్పిస్‌కి కారణమయ్యే వైరస్ కాకుండా మరో రకం వైరస్‌వల్ల ఇలాంటి కోల్డ్‌సోర్స్ వస్తాయి. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిందంటే జీవితాంతం అలాగే ఉండిపోయి అప్పుడప్పుడు ఇలాంటి లక్షణాలతో బయటపడుతుంటుంది. సూర్యుడి వేడి, ఒత్తిడి, ఉద్రేకాల ప్రభావం, బహిష్టు, జ్వరం, ఎలర్జీలాంటివెన్నో ఇలా కోల్డ్‌సోర్స్ బయటపడటానికి కారణాలు. సాధారణంగా ఇవి వెంటనే తగ్గిపోతుంటాయి. తగ్గకపోతే వైద్యుడికి చూపిస్తే యాంటి వైరల్ మందుల్ని వాడతారు. కొన్ని క్రీములు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.