సంజీవని

చెవులు ఎందుకు దిబ్బిళ్లు వేస్తాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెవిలో మూడు భాగాలని అందరికీ తెలుసు. అవి- బయటి చెవి, మధ్య చెవి, లోపలి చెవి.
మధ్యచెవిలోని గాలి ఒత్తిడి, బయటి వాతావరణంలోని గాలి ఒత్తిడి సమం కానప్పుడు చెవులు దిబ్బిళ్ళు వేసి సరిగా వినిపించవు. మామూలుగా ముక్కు వెనుక భాగాన్ని, మధ్యచెవిని కలిపే యూస్టేచియన్ ట్యూబ్ ‘ఇయర్ డ్రమ్’కి రెండు వైపులా ఒత్తిడి సమంగా వుండేట్లు చూస్తుంటుంది. మధ్య చెవిలో గాలి తగ్గినపుడు- అంటే, అక్కడి గాలిని చెవి లోపలి పొర పీల్చేసినపుడు- యూస్టేచియన్ ట్యూబ్ సాయం చేస్తుంది. అలాంటి ట్యూబ్ బ్లాక్ అయితే- వాక్యూమ్ ఏర్పడి- ఇయర్ డ్రమ్‌ని లోపలకు లాగుతుంది. ఒక్కోసారి ఇది చాలా నొప్పిని కూడా కలిగిస్తుంది.
ఇయర్ డ్రమ్‌కు వుండే వైబ్రేషన్ కెపాసిటీని బట్టి శబ్ద తరంగాల్ని తీసుకోవడం తగ్గిపోతుంది. దాంతో వినిపించడం తగ్గుతుంది. శబ్దాలు బాగా మఫుల్డ్‌గా, వినీ వినిపించనట్లుగా మంద్రంగా వినిపిస్తాయి. దాంతో మన చుట్టూ వున్న గాలి, ఒత్తిడి మారిపోతుంది. యూస్టేచియన్ ట్యూబ్ బయటి గాలి ఒత్తిడిని, మధ్య చెవిలోని గాలి ఒత్తిడిని త్వరగా సమం చేసి చెవిలో బ్లాక్ పోయేటట్లు చేయడం జరుగుతుంది. సమయాన్ని బట్టి మనం సమస్యని ఫీల్ అవుతుంటాము. చటుక్కున అడ్డంకి తొలగి వినికిడి మామూలౌతుంటుంది.
నమలడం, ఆవులించడం, మింగడం, లోపలికి గాలి పీల్చడంతో కండరాలు మామూలై యూస్టేచియన్ ట్యూబ్ తెరచుకుంటుంది. ముక్కుని పట్టుకుని సున్నితంగా చీదడంవల్ల కూడా దిబ్బెడ తొలగించవచ్చు. చెవిలోనికి నీళ్ళు పోకుండా చూసుకుంటుండాలి. సబ్బు నీళ్ళు అయితే అసలు పోకూడదు. చెవిలో నూనె వేయకూడదు. చెవిలో పిన్నీసులు, పుల్లలతోనూ శుభ్రం చేయడానికి ప్రయత్నించకూడదు. లోపలి చెవిని శుభ్రం చేయాలంటే, నాటు వ్యక్తుల్ని కాక ఇఎన్‌టి వైద్యుడ్ని కలవడం మంచిది.

-డా మోహన్‌రెడ్డి.. నోవా ఇఎన్‌టి క్లినిక్, పంజగుట్ట, హైదరాబాద్.. 9963555244

-డా మోహన్‌రెడ్డి..