సంజీవని

చలివేళ వేధించే గొంతు బాధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలం వచ్చిందంటే చాలు.. దాని ప్రభావం ముందు చెవి, గొంతు, ముక్కులమీద ఎక్కువగా కనిపిస్తుంది. టాన్సిల్స్‌తో బాధపడేవాళ్ళకు ఈ కాలం ఇంకా ఇబ్బందికరం. అలాగే గొంతు నొప్పులతో బాధపడేవాళ్ళకు కూడా! గొంతులో గురగుర, గొంతు బొంగురుపోవడం, గొంతు పట్టేయడం, చెవులు- ముక్కు దిబ్బెడవేయడం, తలనొప్పిలతోపాటు ముక్కు నుంచి నీరు కారడం- జలుబు లాంటి వాటితో బాధపడుతుంటారు.
ఈ బాధలవల్ల చిరాకు, నీరసం, ఏ పనీ చేయాలనిపించకపోవడం, శక్తి సన్నగిల్లడం, తినాలనిపించకపోవడం లాంటి ఇబ్బందులంతా కనిపిస్తాయి. ఒక్కోసారి మాట్లాడడానికి ఇబ్బంది కావచ్చు.
సాధారణమైన గొంతు వ్యాధులు మందులతో తగ్గిపోతాయి. పెద్ద ఇబ్బందులకు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడం మంచిది. ఒక్కోసారి గొంతులో చీము వచ్చే ప్రమాదముంది. ఆ సమయంలో తగిన వైద్య పరిక్షలు నిర్వహించి, మందులు వాడాల్సి వుంటుంది. ఈ చల్లటి వాతావరణ పరిస్థితులతోబాటు కలుషిత ఆహారం, నీరు తీసుకోవటంవల్ల గొంతు సంబంధ వ్యాధులు ప్రబలుతున్నాయి. దుమ్ము, ధూళి పడ్డ ఆహారాన్ని తీసుకోవద్దు. వాటి ద్వారా బాక్టీరియా లోపలికి ప్రవేశించి బాధపెడుతుంది.
జలుబుతో గొంతులో మార్పులు వచ్చినా, విపరీతంగా గొంతు నొప్పి వస్తున్నా, తలనొప్పి, ఏకాగ్రత లోపించడం, ముక్కు దిబ్బడ, చెవులు దిబ్బడ, గొంతులో కాయలు ఏర్పడడం లాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తపడాలి. ఇ.ఎన్.టి. వైద్య నిపుణుడికి చూపించి తగు చికిత్స చేయించుకోవాలి.
ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు చల్లని పదార్థాలు తీసుకోవడం, అపరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవడం, తోపుడు బండ్లమీది ఆహారం తీసుకోవడం, శీతల పానీయాలు తాగడం, తినే ముందు చేతులు శుభ్రపరచుకోకపోవడం లాంటి వాటివల్ల ఒకరినుంచి మరొకరికి ఈ వ్యాధి సోకవచ్చు.
అందుకని చలి బారినుంచి శరీరాన్ని కాపాడుకుంటుండాలి. చల్లటి పదార్థాలు తీసుకోవద్దు. దుమ్ముకి, ధూళికి దూరంగా ఉండాలి. అపరిశుభ్ర ఆహారం, నీళ్ళు తీసుకోవద్దు. వేడి ఆహారాన్ని మాత్రమే ఈ కాలంలో తీసుకోవడం మంచిది. ఏ మాత్రం అనుమానమనిపించినా వెంటనే వైద్యుడి సలహా తీసుకోవాలి.

-డా.నళినీకాంత్
ఇ.ఎన్.టి.సర్జన్ .. 9246542464

-డా.నళినీకాంత్ ఇ.ఎన్.టి.సర్జన్