సంజీవని

బరువు తెచ్చే బాధలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఆధునిక యుగంలో ప్రపంచ వ్యాప్తంగా మనుషుల్లో అధిక బరువు, స్థూలకాయం ప్రధాన ఆరోగ్య సమస్యలుగా ఉన్నాయి. అధిక బరువున్నవారు 1.2 బిలియన్లుండగా, వారిలో 300 మిలియన్లు మంది స్థూలకాయులుగా వున్నారు. ఈ సమస్య ప్రమాదకరమైన అనారోగ్యాలకు దారితీస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం-ప్రస్తుతం నివారించదగిన పది అనారోగ్య కారణాలలో స్థూలకాయం ఒకటి. దాదాపు 13 శాతంమంది పిల్లలు, యువకులు స్థూలకాయంతో బాధపడుతూ ప్రమాదకరమైన వ్యాధులకు గురవుతున్నారు. ఈ శాతం గత పదేళ్లకన్నా రెండింతలు ఎక్కువైందని అంచనా!
ఇవాళ టీవీలు, కంప్యూటర్ గేమ్స్, ఆటస్థలాలు కరువైపోవడం, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ కేలరీలు మిగిలిన చిరుతిళ్ళు, ఆహార విషయంలో అవగాహన లేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా పరిశీలకులు భావిస్తున్నారు.
శరీరానికి అవసరమైన శ్రమ లేకుండా తింటూపోతే కొవ్వు అధికంగా చేరుతుంది. ఎక్కువగా పిండి పదార్థాలు, వేపుళ్ళు, నూనె, నెయ్యి, కొవ్వు పదార్థాలు తినడంతో శరీరానికి కావలసిన దానికంటే కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవడం... ఇవాళ ఎన్నో సౌకర్యాలు ఎక్కువైపోయాయి. ఏ మాత్రం శ్రమలేని సుఖమయమైన జీవనశైలి, దురలవాట్లు స్థూలకాయానికి కారణమవుతున్నాయి.
స్థూలకాయం కారణంగా పరిణమించే ముఖ్యమైన వ్యాధులు - గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, సంతాన సమస్యలు, కీళ్ళ జబ్బులు, కేన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, గాల్‌బ్లాడర్‌లో రాళ్ళు, అల్సర్లు, గ్యాస్టిక్ ట్రబుల్ మొదలైనవి.
బరువు ఏ వయసులో ఎలా పెరుగుతుంది?
మన శరీరంలో క్రొవ్వు ఎక్కువగా చేరితే అధిక బరువవుతాం. దీనినే ఊబకాయం అంటాం. ప్రపంచం మొత్తంలో ఈ అధిక బరువువల్ల ఎంతోమంది ఎన్నో విధాలుగా బాధపడుతున్నారు. కాబట్టి మనం బరువు పెరగకుండా చూసుకోవడం చాలా అవసరం. అందుకు అవగాహన ముఖ్యం. ముందుగా బరువు పెరగడానికి కారణాల్ని చూద్దాం...
ముఖ్యంగా మధ్య వయసులో ఎక్కువ మంది బరువు పెరుగుతుంటారు. కొందరు చిన్నపాటి నుంచి అధిక బరువుతో వుండవచ్చు. ఏ వయసులోనైనా బరువు ఎక్కువగా కనిపించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థికంగా తక్కువ స్థాయిలో వున్నవాళ్ళల్లో ఈ అధిక బరువు తక్కువగా కనిపిస్తుంది.
వంశపారంపర్యంగా కూడా అధిక బరువు వస్తుంటుంది. తల్లిదండ్రులు ఇద్దరూ అధిక బరువున్నవాళ్ళయితే వాళ్ళ పిల్లల్లో 80 శాతం మందికి జీన్స్ ద్వారా అధిక బరువుండే లక్షణం రావచ్చు.
ఎండోక్రైన్ గ్లాండ్స్ సిక్రీషన్స్ ఇంబాలన్స్‌వల్ల అధిక బరువు కలుగవచ్చు. ఆడవాళ్ళలో అధిక బరువు- పెద్దమనిషైనప్పుడు, గర్భవతులైనపుడు, ముట్లుడిగిన తర్వాత సాధారణంగా కలుగుతుంటుంది. స్టిరాయిడ్స్, నోటి ద్వారా కాంట్రాసెప్టివ్స్, ఇన్సులిన్ లాంటివి తీసుకోవడంవల్ల బరువు పెరగవచ్చు.
అధిక బరువున్నపుడు లావుగా తయారై, మన దైనందిన కార్యక్రమాల్ని నిర్వహించడమే కష్టమవుతుంటుంది. బద్ధకం పెరుగుతుంది. త్వరగా కదలబుద్ధి కాదు. శ్వాసించడం కూడా కష్టమవుతుంటుంది.
అధిక బరువు తెలుసుకోవడం ఎలా?.. బాడీమాస్ ఇండెక్స్ (బి.ఎమ్.ఐ) ద్వారా...
బి.ఎమ్.ఐ = బరువు కిలోలలో / ఎత్తు మీటర్లలో
బాడీమాస్ ఇండెక్స్ 20 నుంచి 25 వరకూ వుంటే సాధారణం. 25 నుండి 30 మధ్య వుండే అధిక బరువు, 30 నుండి 35 వరకూ స్థూలకాయం. 35 నుండి 45 వరకు వుంటే స్థూలకాయం గ్రేడ్-2, 40 కన్నా ఎక్కువ వుంటే స్థూలకాయం గ్రేడ్-3. బి.ఎమ్.ఐ 30కిపైగా వుంటే ఒబేస్ అని, 40కిపైగా వుంటే మార్బ్‌డ్ ఒబేస్ అని అంటారు. కొద్దిపాటి అధిక బరువు వున్నవాళ్ళు వ్యాయామం, ఆహార వ్యవహారాల మార్పుతో బరువు తగ్గించుకోవచ్చు. మార్బ్‌డ్ ఒబేసిటీ వున్నవాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీస్ ద్వారానే బరువు తగ్గించవచ్చు. ఇలాంటి సర్జరీస్‌వల్ల ఇబ్బంది ఇబ్బంది వుండదు. మామూలు జీవితానికి రావచ్చు.