సంజీవని

దడ మొదలైతే జాగ్రత్త..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండె సంబంధ వ్యాధుల గురించిన అవగాహనలో హృదయ కండరాల సంకోచ, వ్యాకోచాలను విశే్లషించడం ముఖ్యమైనది. గుండె కొట్టుకోవడంలోని వేగం పెరగడం అనేది సహజంగా గుండెపోటుకు సంబంధించిన వాటిలో ప్రాథమిమైన సమస్యగా హృద్రోగ నిపుణులు విశే్లషిస్తుంటారు. గుండె దడ అధ్యయనం చేయడం ద్వారా హానికరమైన పరిణామాలను అంచనా వేయవచ్చు. తద్వారా ప్రాథమిక దశలోనే స్వల్ప మందులు ఇచ్చి వ్యాధిని నివారించవచ్చు. గుండెపోటు సమయంలో సంబంధిత రోగికి తీసిన ఈసీజీ ద్వారా స్పష్టమైన చికిత్స అందించేందుకు వీలు అవుతుంది. ఇందులో భాగంగా కొన్ని నిజ జీవిత ఉదాహరణలు దీన్ని నిజం చేస్తున్నాయి.
కేస్ స్టడీ -1
పీకే అనే 27 ఏళ్ళ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనేక ఏళ్ళుగా గుండె కొట్టుకోవడంలో తేడాను స్పష్టంగా గమనిస్తున్నారు. నా దగ్గరకు చికిత్సకు వచ్చేవరకు ఆమె మెట్లు ఎక్కిన సమయంలో శ్వాస తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి ఇబ్బందికరమైన సమయంలో ఆమెకు ఈసీజీ తీయగా గుండెలోని ఒక భాగంలో అవసరం లేని విద్యుత్ తరంగాల ప్రసారం సాగుతోందని తేలింది. వైద్య పరిభాషలో దీన్ని ‘ప్రీమెచ్యూర్ వెంట్రిక్యూలర్ కాంట్రాక్షన్స్’ లేదా పీవీసీ అంటారు. గుండె బలహీనం అవడంవల్ల రోజులో 30 శాతం ఇలా మార్పులు చోటుచేసుకుంటాయని తేలింది. ఎలక్ట్రో ఫిజియోలాజికల్ విధానంలో 3 డైమెన్షనల్ ఎలక్ట్రికల్ మ్యాపింగ్ చేయడం అనవసర విద్యుత్ ప్రసారం గుండె కుడి భాగం నుంచి అవుతున్నట్లుగా తేలింది. ఈ క్రమంలో రేడియో తరంగాల ద్వారా ఈ సమస్యను తొలగించే ప్రక్రియను సుమారు రెండు గంటలపాటు చేశాం. ఆ మరుసటి రోజు ఆమెను డిశ్చార్జి చేశాం. ఆమె గుండె పనితీరు మెరుగుపడటమే కాకుండా కొద్ది వారాల్లోనే గతంలో ఆమె మానివేసిన జాగింగ్, టెన్నిస్ ఆడటాన్ని తిరిగి కొనసాగించారు.
కేస్ స్టడీ -2.. ఏపీ అనే 55 ఏళ్ల వ్యాపారవేత్త చక్కెర వ్యాధిగ్రస్తుడే కాకుండా పొగ తాగే అలవాటు ఉన్న వ్యక్తి. 5 ఏళ్ళ క్రితం ఆయనకు గుండెపోటు రాగా బైపాస్ సర్జరీ నిర్వహించారు. అయితే గతంలో వచ్చిన గుండెపోటువల్ల గుండెలో రక్తప్రసరణలో తేడా రావడమే కాకుండా గుండె కొట్టుకోవడంలో మార్పులు కనిపించడంతోపాటు పలు సందర్భాల్లో హృదయ స్పందనలు స్తంభించిపోయాయి. ఆయన ఈసీజీ రిపోర్టులో మల్టిపుల్ పీవీసీ ఉన్నట్టుగా తేలింది. దీంతో ఎలక్ట్ఫ్రోజియలాజికల్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించగా జఠరిక విపరీతంగా కొట్టుకోడంతో ప్రమాదకరమైన స్థితికి ఆయన చేరువ అవుతున్నట్లు తేలింది. గుండెపోటుకు గురైన వారిలో ఆ ప్రాంతంలో కొన్ని ఏళ్ల సమయం తర్వాత ఒక మచ్చ ఏర్పడి ప్రమాదకరమైన హృదయ స్పందనలకు కారణంగా మారుతుంది. ఇలాంటి హెచ్చుతగ్గులు హఠాత్తుగా గుండెపోటు వచ్చేందుకు, మరణానికి కూడా కారణం అవుతాయి. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు రోగికి ఇంప్లాంటెబుల్ డిఫిబ్రిలేటర్ (ఐసీడీ) అవసరం పడుతుంది.
కేస్ స్టడీ 3.. ఎం అనే 22 ఏళ్ళ మహిళ గత కొద్ది సంవత్సరాలుగా గుండె దడతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రులు ఎక్కువగా ఎదురయ్యే ఈ సమస్యతో ఆమె అనేక సందర్భాల్లో ఎమర్జెన్సీ విభాగంలో చేరారు. ఈ క్రమంలో సదరు మహిళకు తీసిన ఈసీజీ రిపోర్టుల్లో గుండె వేగం పెరగడానికి సర్వసాధారణ కారణమైన సప్రవెంట్రిక్యులర్ టెకర్డియాగా తేలింది. ఈ సమస్యను స్పష్టంగా గుర్తించడం ద్వారా గుండెదడను పరిష్కరించవచ్చని తేలింది. అంతేకాకుండా తక్కువ మొత్తం ఛార్జి ద్వారా కేవలం ఒక్క రోజు మాత్రమే ఆస్పత్రిలో ఉంటే ఈ సమస్య నుంచి బయటపడేందుకు తగిన చికిత్స పొందవచ్చు.
కేస్ స్టడీ - 4
జీఎం అనే 70 ఏళ్ల వయసుగల వ్యక్తి ఆందోళన పడే మనస్తత్వంవల్ల అనేక సందర్భాల్లో గుండె దడకు లోనయ్యారు. కుర్చీలో కూర్చున్న సమయంలో శరీరంలోని కుడి భాగంలో తీవ్ర బలహీనత కనిపించడాన్ని గమనించారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లుగా వైద్యులు నిర్థారించారు. ఆట్రియల్ ఫ్యాబ్రిల్లేషన్ అనే లక్షణం కారణంగా ఇలా జరుగుతోందని తద్వారా గుండె పైభాగంలో ఇలాంటి అవస్థలు ఎదురవుతాయని వైద్యులు గుర్తించారు. ఈ రకమైన గుండె దడ ద్వారా రక్తం గడ్డ కట్టుకొనిపోయి తద్వారా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఈ వ్యక్తికి తరచుగా వచ్చే గుండెపోటు అనేది ఇందుకు చిహ్నంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో ఆయనకు తీసిన ఈసీజీ ద్వారా ఆట్రియల్ ఫ్యాబ్రిల్లేషన్ లక్షణం స్పష్టంగా కనిపించింది. రక్తంను పలుచగా చేసే అత్యుత్తమ ఔషధాలను నోటి ద్వారా పంపించడం ద్వారా ఈ తరహా ప్రమాదాలను అరికట్టవచ్చును.

-డా.బి.హయగ్రీవరావు
కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్య్