సంజీవని

హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్‌కు వాక్సిన్లతో చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెచ్.బి.వి. వైరస్‌తో ప్రపంచ వ్యాపితంగా 350 బిలియన్ల మంది ఇబ్బంది పడుతున్నారు.
హెపటైటిస్-బివల్ల ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ లేక క్రానిక్ కారియేజ్ స్థితి కలుగుతుంది. హెచ్.బి.వి. కారియర్స్ అధికంగా వుంటే ‘లివర్ సిర్రోసిస్’ కలగవచ్చు. లివర్ కాన్సర్ రావచ్చు. 15 నుంచి 40 శాతం మందికి మాత్రమే ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. మనలో ప్రతీ వందమందిలో నలుగురు నుంచి ఆరుగురుదాకా హెపటైటిస్ ‘బి’ బారిన పడుతున్నారు. పళ్ళు, గాయాల ద్వారా ఎక్కువగా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది.
ఈ హెచ్.బి.వి. ఇన్‌ఫెక్షన్ తల్లినుంచి అప్పుడే పుట్టిన పిల్లలకు రావచ్చు. ఏ కారణాన్నైనా రోగ నిరోధక శక్తి తగ్గిన వారికి ఈ ఇన్‌ఫెక్షన్ రావచ్చు. ఎక్కువ మందితో సంబంధమున్న స్ర్తితో రతివల్ల, ఒకరికి వాడిన ఇంజెక్షన్ సూదినే మరొకరికి వాడడంవల్ల ఎక్కువమంది స్ర్తిలతో సెక్స్ సంబంధాలుండడంవల్ల, స్వలింగ సంపర్కంలో, హెచ్.సి.వి. లేక హెచ్.ఐ.వి వుండటంవల్ల, మూత్రపిండాలకి డయాలసిస్ చేయించుకునే వాళ్ళల్లో గర్భిణీ స్ర్తిలో, రోగ నిరోధక శక్తి తగ్గించుకుని చికిత్సలు చేయించుకు నేవాళ్ళల్లో హెచ్.బి.వి. ఇన్‌ఫెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువ.
వాక్సినేషన్ చేయించుకోవాలి. ఇన్‌ఫెక్షన్ వున్నవాళ్ళు సురక్షిత కండోమ్ వాడకుండా సెక్స్‌లో పాల్గోవద్దు. ఒకరి టూత్‌బ్రష్‌లు, రేజర్లు మరొకరు వాడకూడదు. గాయాలు, కోతలుంటే వాటికి కట్లు కట్టాలి. రక్తం చిందకుండా చూసుకోవాలి. రక్తం, అవయవాలు, స్పెర్మ్‌లని దానం చేయకుండా హెపటైటిస్ ‘బి’ ఇన్‌ఫెక్షన్ వున్నవాళ్ళు అన్ని యాక్టివిటీస్‌లో పాల్గొనవచ్చు. వీరిని దూరంగా ఉంచనక్కరలేదు. వారి వాడుతున్న పాత్రలని ఇతరులూ వాడవచ్చు.
హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్ ఉన్న వాళ్ళందరికీ మిగతా వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో చెప్పాలి. ఆహార నియమాలేవీ ఉండవు. ఆల్కహాల్ తాగడం మంచిది కాదు. సిర్రోసిస్ రావచ్చు. ఇంట్లో వాళ్ళని.. ముఖ్యంగా సెక్స్ పార్ట్‌నర్ని కౌన్సిల్ చేయాలి.
పాఠశాలల్లో చదువుకునేప్పుడే హెపటైటిస్ ‘బి’ వాక్సిన్ మొదటి డోస్ ఇవ్వాలి. మరో నెలకి రెండో డోస్ ఇవ్వాలి. ఆరో నెలలో మూడో డోస్ ఇవ్వడంతో వాక్సినేషన్ పూర్తవుతుంది.
హెచ్.బి.వి. ఇన్‌ఫెక్షన్ ఒకసారి వస్తే జీవితాంతం వుంటుంది.
అలాగని భయపడవద్దు. సలహా కోసం గాస్ట్రో ఎంటెరాలజిస్ట్‌ని కలవండి.
ఇన్‌ఫెక్షన్ వున్నదీ లేనిదీ కొన్ని పరీక్షలు చేసి నిర్థారిస్తారు. ఏ స్థాయిలో ఉన్నదీ కూడా పరీక్షల్లో తేలుతుంది. వైరస్ స్థితిని బట్టి ఎటువంటి చికిత్స ఇవ్వాలనేది నిర్ణయిస్తారు.
కేవలం హెపటైటిస్ ‘బి’ వున్నంత మాత్రాన చికిత్స అక్కర్లేదు. కాకపోతే జీవితాంతం ఫాలో అప్ వుండాలి. అతని లేక ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా పరీక్షలు చేయించుకోవడం అవసరం.
ఈ ఇన్‌ఫెక్షన్‌ని తగ్గించడానికి మంచి మందులున్నాయి. భయపడాల్సిన పనిలేదు.