సంజీవని

వ్యాధి నిర్థారణే అసలు పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్య స్థితి తెలియాలన్న, అనారోగ్య తీవ్రత తెలియాలన్నా పరీక్షలు అవసరం. రక్తపరీక్షలు రోగ నిర్థారణకే కాదు నివారణకు కూడా ఉపయోగం. అంతేకాదు రోగ నిర్ణయం జరిగాక, చికిత్సా ప్రయోజనం కూడా తెలుసుకోవచ్చు. అందువల్ల రక్త పరీక్షలనేవి అవసరం. వాటి అవగాహన అన్నిటికన్నా ముఖ్యం.
పరీక్షలు ఎన్ని రకాలు? రోగికి తెలుసుకోవలసిన అవసరం వుందా? లేదా డాక్టరు రాసినవి ఎంతవరకు సబబు అని ఆలోచించుకోవాలా? ఏదైనా తెలిసి చేయడం, చేయించుకోవడం గురించి సాధారణ జ్ఞానం కలిగి వుండాలి ఎవరైనా, అందునా ప్రస్తుత పరిస్థితుల్లో. ఇది సాధారణంగా జరగదు, పేషెంటూ పట్టించుకోడు. డాక్టరుగారు ఎన్ని పరీక్షలు రాస్తే అంత మంచిది. రోగిని కూలంకషంగా చూస్తామన్న తృప్తి. చాలామందిలో ఒక బలమైన వాదన వున్నది. అవసరం వున్నా లేకపోయినా చాలా టెస్ట్‌లు రాస్తారని, పైగా రోగితో గడిపే సమయం కన్నా ఈ టెస్టులు రాసే సమయమే ఎక్కువ అని. అది అపోహేనని చెప్పడం చాలా కష్టం. కారణం రోగుల సంఖ్య ఎక్కువ. డాక్టర్లలో సహనం, సమయం తక్కువ. రెండింటివల్ల చాలా ఇబ్బందే.
ఏమైనా వైద్యుని ప్రాథమిక పరీక్ష, రోగితో మాట్లాడటం, ఆ తర్వాత వ్యాధి యొక్క గుణగణాలను బట్టి ఏ వ్యాధో అనే దిశ నిర్ణయించడం కద్దు. దాని ప్రకారమే అన్ని రకముల పరీక్షల నిర్థారణ, రక్తపరీక్షలు, ఎక్స్‌రేలు, స్కాన్‌లు- అన్నీ వ్యాధి నిర్ణయానికి అవసరమైనవే. అన్ని ఫలితాల యొక్క సమగ్ర విచారణపై అంతిమ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అపుడే సరియైన విధి విధానాలు నిర్దేశిస్తారు. రక్త, మల, మూత్ర పరీక్షలు అన్నీ ఒక లేబొరేటరీలో చేస్తారు. అందులో వివిధ విభాగాలు వుంటాయి. అవే క్లినికల్ కెమిస్ట్రీ హెమటాలజీ, మైక్రోబయాలజీ, ఇమ్యూనాలజీ, హిస్టోపెథాలజీ, సైటాలజీ మొదలైనవి.
వందలాది పరీక్షలలో ఒక అవయవానికి, ధాతువుకి సంబంధించినవి ఒక గ్రూపు లేదా ప్రొఫైల్ అని పరిగణిస్తారు. ఉదాహరణకి, కాలేయానికి సంబంధిత పరీక్షలని లివర్ ఫంక్షన్ టెస్టులు అంటారు. ఆ తర్వాత హృద్రోగానికి అంచనా వేయడానికి, లిపిడ్ ప్రొఫైల్ అని, అలాగే మూత్రపిండాలకి, జీర్ణకోశవ్యాధులకి వాటి వాటి పరీక్షలు వుంటాయి. ఏ ఒక్క పరీక్షతోనే అంతా క్షుణ్ణంగా తెలియదు. రెండు మూడు కలిపి చూసుకోవాలి. ఇదంతా రసాయనిక శాస్త్రానికి సంబంధించినది కాబట్టి క్లినికల్ కెమిస్ట్రే అనే విభాగంలో జరుగుతుంది.
రక్తబలహీనత, రక్తకణాల సంఖ్యలో మార్పులు తెలుసుకునే విభాగం హెమటాలజీ. ఇందులో హిమోగ్లోబిక్, ఎర్ర, తెల్ల రక్తకణాల విశే్లషణ మొదలైనవి వుంటాయి. ఈ విభాగంలోనే రక్తస్రావానికి సంబంధిత మరియు బ్లడ్ కాన్సర్ లాంటి వ్యాధులను కూడా నిర్ణయించడం జరుగుతుంది.
శరీరం పైభాగంలో గాని, అంతర్భాగాలలోగాని కణతులు, వాపులు వుంటే అవి సూక్ష్మక్రిములవలనగాని, కాన్సర్‌వల్లగాని కావచ్చు. అందుకోసం ఒక సూదితో లేదా పూర్తిగా తీసివేసిగాని మైక్రోస్కోపులో టిష్యూస్ అంటే తీసిన కణాన్ని, ధాతువులను పరీక్ష చేసి, వ్యాధి నిర్ణయం జరుగుతుంది. దీనినే బయాప్సీ అంటారు. ఇది హిస్టోఫెథాలజీ అనే విభాగంలో జరుగుతుంది.
సగటున 50 నుండి 60 శాతం వరకు వ్యాధులు సూక్ష్మక్రిముల వల్ల సంభవిస్తాయి. వాటిని కనుగొని, ఏ మందు వాడితే ఆ క్రిమి నిర్మూలన జరుగుతుంది అని నిర్థారించే శాఖ పేరు మైక్రోబయాలజీ. శరీరంలో ఏ భాగంలోనుంచైనా ధాతువులు, ద్రవములు, రక్తము, మూత్రము, కళ్ళె- అన్నీ ఈ పరీక్షలకు ఉపయోగిస్తారు. వీటిని కల్చర్ సెన్సిటివిటీ అంటారు. కాని వైరస్ లాంటి వ్యాధులకు రక్తంలోని సంబంధిత క్రిమి యొక్క లక్షణాలు రియాక్షన్ రూపంలో వుంటాయి. వాటిని ఏంటీబాడీస్ అంటారు. తీవ్రతకి తగిన పరిమాణంలో ఫలితాలు కనిపిస్తాయి.
ఇలా చాలా రకాల పరీక్షలు లాబరేటరీస్‌లో జరుగుతుంటాయి. అంతేకాకుండా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ఇంతవరకూ అంతుబట్టని వ్యాధులను తెలుసుకోవడం జరుగుతున్నది. చివరకు జన్యు పరీక్షలవరకూ నేడు మనము రోగ నిర్థారణకి, తీవ్రతకి కొలమానం చెయ్యగలుగుతున్నాము.
మనం అడిగిన వస్తువు అంగడిలో లేకపోతే పక్క షాపులోంచి తెప్పిచ్చి ఇస్తాడు యజమాని. అలాగే అన్ని లేబరీటరీల్లో, అన్నీ చెయ్యడం అసాధ్యమైన పని. ఇది కేవలం పరికరాల సౌలభ్యం కాదు, ఆ ఉన్నత శ్రేణి పరీక్షల నిర్థారణ చేసే నైపుణ్యంగల శాస్తజ్ఞ్రులు తక్కువగా, అరుదుగా ఉండడం మూలాన.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రి
యోగి వేమన విశ్వవిద్యాలయం.. 98492 16278

డా.కె.వలీపాషా