సంజీవని

కండర లోపంవల్లే హెర్నియాలు వస్తాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్మం క్రింద, లోపలి అవయవాలకి రక్షణని కూడా కల్పిస్తుంటాయి కండరాలు. ఈ కండరాలు ఎక్కడైనా పలుచనై, అవయవాలు ఉబ్బెత్తుగా ముందుకు తోసుకువస్తే హెర్నియా అంటారు. కడుపు ముందుభాగంలో కండరాలమధ్యనుంచి అవయవాలు చర్మాన్ని ముందుకు తోయడంవల్ల వచ్చే హెర్నియాను ఎక్కువగా వస్తుంటాయి. ఇలా కండరాలు నీరసించడం వంశపారంపర్యంగా రావచ్చు. కండరాలు నీరసించడంవల్ల హెర్నియాలు రావచ్చు.
హెర్నియా వచ్చిన ప్రాంతంలో చర్మం సున్నితం కావచ్చు. కొన్ని హెర్నియాలు బరువుగా కనిపించవచ్చు. మగవారిలో ఇంగ్రినల్ హెర్నియాలు వస్తాయి. గజ్జలపైన కడుపు కండరాలు దెబ్బతినడంవల్ల ఈ హెర్నియాలు వస్తుంటాయి. ఇవి పెద్దవిగా వుంటాయి. ఆడవారిలో కడుపు పెద్దదిగా వుంటే ఫిమోరల్ హెర్నియాలు వస్తుంటాయి. గజ్జలపైన ఆడవారిలో ఈ హెర్నియా వస్తుంది. ఒక్కోసారి వాపులేకుండానూ ఉండవచ్చు. డయాఫ్రమ్‌లో హియాటస్ హెర్నియాలు వస్తాయి.
హెర్నియాలో ఇలా బైటకు పొడుచుకువచ్చినవాటిని అలాగే వదిలేస్తే చర్మం చిట్లి అవయవాలు బైటకు వచ్చి ప్రమాదం కలుగవచ్చు. పొట్టమీది హెర్నియాలని తొలగించడానికి శస్త్ర చికిత్స సరైన మార్గం.
శస్తచ్రికిత్స ద్వారా ఏ ప్రాంతంలో కండరం దెబ్బతిన్నదో అక్కడ కండరాన్ని సరిచేస్తారు. సన్నటి రంధ్రం చేసి వాటి ద్వారా ఈ శస్తచ్రికిత్సని నిర్వహిస్తారు.
కాబట్టి శరీరంలో ఏ భాగంలో కండరాలు దెబ్బతిని అవయవాలు చర్మంలో ముందుకు తోసుకువచ్చినా వెంటనే వైద్యుడికి చూపించడం అవసరం. చర్మం చిట్లడంతో చిన్న సమస్యలూ కోతిపుండు బ్రహ్మరాక్షసిలా తయారై ప్రాణాలు తీస్తాయి. *
-డా.బి.ఎస్.ఆర్.మూర్తి
జనరల్ సర్జన్, గజపతినగరం, 9866685439

-డా.బి.ఎస్.ఆర్.మూర్తి