సంజీవని

హార్మోన్ లోపం... కురులకు శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరైన పోషకాహారం తీసుకోకపోవడం, డెబిలిటేటింగ్ డిసీజ్ లేకపోతే, కొన్ని రకాల మందులను వాడడంవల్ల హార్మోన్ సమతుల్యం దెబ్బతిని జుట్టు ఎదుగుదల దెబ్బతింటుంది. హార్మోన్ సమతుల్యం దెబ్బతినడం లాంటివి మనకి తెలియకుండానే జరిగిపోతుంటాయి. జీన్స్‌లోనూ సమస్యలుండవు.
మామూలుగా జుట్టు ఒక నెలలో ఒక సెం.మీ దాగా పెరగవచ్చు. రెండు నుంచి 6 సంవత్సరాలలో జుట్టు పెరగడం ఆగిపోతుంటాయి. రాలిపోయిన వెంట్రుకల స్థానంలో కొత్త వెంట్రుకలు మొలుస్తుంటాయి. ఇలాంటి ఆవృత్తాలు వరుసగా జరిగిపోతుంటాయి. ఎప్పుడూ కనీసం 85 శాతం జుట్టు వుంటుంది. 30 సెం.మీ కన్నా సాధారణంగా జుట్టు పెరగదు. ఎక్కువ కాలం జుట్టు రాలిపోకుండా వుంటే ఒక మీటరు దాకా పొడవు పెరగవచ్చు.
కొంతమంది జుట్టు సూర్యకాంతివల్ల పొడారిపోయి, రంగు దెబ్బతింటుంటుంది. క్లోరిన్ కలిసిన నీటిలో ఈదడంవల్ల సాల్ట్‌తో కూడా జుట్టు రంగు సమస్యలు వస్తుంటాయి. ఈ రెండింటి బారినుంచి కాపాడుకోవడానికి ఆ సందర్భాలలో ఎంత ఎక్కువగా జుట్టును కవర్ చేసుకుంటే అంత మంచిది. ఈత కొట్టేటప్పుడు జుట్టు తడిస్తే వెంటనే మంచినీటితో జుట్టు కడగడం మంచిది.
దెబ్బతిన్న వెంట్రుకల చివరలు కత్తిరించడం మంచిది. అలా చేయలేకపోతే జుట్టు నాణ్యతని పెంచడానికి ఎన్నో కండీషనర్స్ షాంపూలు వున్నాయి. తలను తుడుచుకుని దువ్వేప్పుడు మెత్తటి దువ్వెన లేక బ్రష్‌తో దువ్వాలి. చివరలు దెబ్బతిన్న జుట్టు బాగవడానికి మార్కెట్లో ప్రొటీన్ కండిషనర్లు దొరుకుతున్నాయి. ఇవి చీలిన వెంట్రుకల చివరలు తాత్కాలికంగా అతుక్కోవడానికి తోడ్పడతాయి. హెయిర్ డ్రయ్యర్, కర్లింగ్ ఐరన్స్ వల్ల కూడా జుట్టు చివరలు దెబ్బతింటాయి.
షాంపూను వాడడంవల్ల జుట్టు ఊడిపోదు. కాకపోతే పొడారిపోవచ్చు. రంగు వెలిసిపోయినట్లు కనిపించవచ్చు. బాగా ఎక్కువగా జుట్టుని షాంపూలతో కడగడంవల్ల చివరలు దెబ్బతినవచ్చు.
జుట్టుకి రంగు విషయంలోకి వస్తే కొందరికి కొన్ని రసాయనాలు పడవు. ఎలర్జీ వస్తుంది. జుట్టుకి రంగు వేసుకునేముందు ఆ రంగుతో స్కిన్‌ప్యాచ్ పరీక్ష చేసుకుని పడితేనే ఆ రంగుని జుట్టుకు వేసుకోవాలి. కంటి ప్రాంతంలో మాత్రం ఎటువంటి రసాయనాలు వాడకూడదు. ఆ జాగ్రత్త తీసుకోకపోతే కంటిచూపు దెబ్బతినవచ్చు.
వెంట్రుకలలో మెలనిన్ తగ్గడంవల్ల రంగు పోతుంటుంది. బాల మెరుపు వంశపారంపర్య లక్షణం. జుట్టు తెల్లబడిపోవడంవల్ల పెద్దవాళ్ళమైపోతున్నామని భయపడిపోకూడదు. చర్మంలో పిగ్మెంట్ తగ్గడంవల్ల త్వరగా వెంట్రుకలు నెరిసిపోవచ్చు.
కొన్ని రకాల కాటుకలవల్ల కనురెప్పల వెంట్రుకలు రాలిపోవచ్చు. కాటుకలోకి కొన్ని రకాల సూక్ష్మజీవులు ప్రవేశించడంవల్ల కన్ను లేక చర్మం కందిపోవచ్చు. నెలలకొద్దీ సరైన మూత లేకుండా వున్న భరిణెలలోని కాటుకను వాడవద్దు.

-డా.శశికాంత్ మద్దు
ప్లాస్టిక్ సర్జన్, యశోద సూపర్ స్పెషాలిటీ
9581258179

-డా.శశికాంత్ మద్దు