సంజీవని

మీకు మీరే డాక్టర్ సిర్రోసిస్‌కు చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర:వయసులో ఉన్నపుడు చేసుకున్న అలవాట్లవలన లివర్ చెడింది. సిర్రోసిస్ అన్నారు. మార్గం ఏదైనా సూచించండి.
జ: ఆయుర్వేద పరిభాషలో కామలా అనే పదమే తెలుగులో కామెర్లుగా జన వ్యవహారంలో మారింది. కామలిన్ అంటే కామెర్ల వ్యాధితో బాధపడేవాడు అని! ‘కామలికా’ అంటే ఘాటైన మద్యం స్పిరిచ్యువస్ లిక్వర్ అని అర్థం. ఆయుర్వేదం ఈ వ్యాధికి కమలా వ్యాధి అని పేరు పెట్టడంలోనే మద్యపానం వలన కాలేయం చెడి వచ్చే కామెర్లకూ దగ్గర సంబంధం వున్నదని తెలిసిపోతుంది. సిర్రోసిస్ వ్యాధిలో ఏ శాస్త్ర ప్రకారం చికిత్స తీసుకుంటున్నా ఆయుర్వేద చికిత్సని జత చేసుకోవటం మంచిది.
గోంగూర పూవులు, ఆకులూ, గుంటగలగర ఆకులూ ఈ మూడింటినీ సమానంగా తీసుకుని ఆహార పదార్థంగా తీసుకోవటం మంచిది. కుదరనపుడు ఈ మూడింటి రసంలో పంచదారగానీ, తేనె గానీ కలిపి ఒక గ్లాసు మోతాదులో రోజూ ఒకటి రెండుసార్లు త్రాగండి. బొప్పాయి పండు లోపలి గింజలను మిక్సీ పట్టి నిమ్మరసం కలిపి ఒక గ్లాసు చొప్పున తరచూ తాగవచ్చు. కేరట్, ముల్లంగి, టమోటా, యాపిల్ ఈ నాలుగింటినీ కలిపి జ్యూస్ తీసుకొని తాగుతూ ఉంటే మేలు చేస్తుంది.
వెన్న తీసిన మజ్జిగలో ధనియాలు, జీలకర్ర, పసుపు కొమ్ములు దంచిన పొడి ఈ మూడింటినీ సమానంగా కలిపి రోజూ తాగితే చాలా మేలు చేస్తుంది. కమలాలు, యాపిల్, దానిమ్మ నిమ్మరసం వీటిని నేరుగా గానీ జ్యూసు రూపంలోగాని ప్రతిరోజూ తప్పకుండా తీసుకోవాలి. నేల ఉసిరిక మొక్కలు మీ ఇంటి పెరట్లో కూడా తప్పనిసరిగా పెరుగుతాయి. ఉసిరి ఆకుల మాదిరే దీని ఆకులూ ఉంటాయి. దీన్ని వేళ్ళతో సహా తీసుకుని దంచి, నీళ్ళలో వేసి మరిగించి వడగట్టి టీలాగా తాగవచ్చు.
బయట ఆహార పదార్థాలు పూర్తిగా మానేయండి. బాగా చలవ చేసేవి మాత్రమే తినండి. చిలికి వెన్న తీసిన మజ్జిగ వేసవారం పొడిని కలుపుకుని రోజూ రెండు పూటలా తాగండి. ఇంగువ 5 గ్రాములు, నేతితో వేసిన అల్లం ముద్ద 10 గ్రాములు, నేతితో వేయించిన మిరియాల పొడి 20 గ్రాములు, జీలకర్ర 40 గ్రాములు, పసుపు కొమ్ములు దంచిన పొడి 80 గ్రాములు, ధనియాల పొడి 160 గ్రాములు ఈ మోతాదులో తీసుకుని తగినంత ఉప్పు కలిపి ఒక సీసాలో భద్రపరచుకోండి. ఈ పొడిని వేసవారం అంటారు. ఇది లివర్ని సంరక్షిస్తుంది. పేగుల్ని శక్తిమంతం చేస్తుంది. జీర్ణశక్తిని కాపాడుతుంది.
మంచి గంధం చెక్కని రాతిసాన మీద అరగదీసి ఒక చెంచా గంథాన్ని తీసుకోండి. కొబ్బరి ముక్కల్ని మిక్సి పట్టి ఆ గుజ్జుని పిండగా వచ్చిన రసాన్ని కొబ్బరిపాలు అంటారు. ఒక గ్లాసు కొబ్బరిపాలలో ఈ చెంచాడు గంధం, కొద్దిగా తేనె కలుపుకుని తాగండి. ఇవి రెండూ సిర్రోసిస్ రోగులకు ఎడారిలో ఒయాసిస్ లాంటి యోగాలు.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు సెల్: 9440172642, purnachandgv@gmail.com