సంజీవని

కాలేయం బిగుసుకుపోతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన శరీరంలో అతిపెద్ద అవయవం, ఎక్కువ పనులు చేసే అవయవం లివర్. తెలుగులో కాలేయం అంటారు. పెద్ద రసాయన కర్మాగారం. కాలేయం ఉత్పత్తిచేసే అన్ని రసాయనాలు బయట తయారు చేయించాలంటే ఎకరానికి పైగా స్థలం కావాల్సి వస్తుంది. ఇది రెండేసి ఫ్లాట్స్ - ఒక్కో ఫ్లోర్‌లో ఉన్న నాలుగు ఫ్లోరున ఫ్యాట్స్‌లాంటిది. ఏ ఫ్లోర్‌కాఫ్లోర్ డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలుంటాయి. అలాగే కాలేయంలో ఉన్న ఎనిమిది లోబ్స్‌కి రక్తప్రసరణం వేరుగా ఉంది. అందుకే ఏ లోబ్‌ని కత్తిరించినా, కాలేయానికి ఇబ్బంది ఉండదు. అందుకే తమ రక్త సంబంధీకులెవ్వరికైనా కాలేయం దెబ్బతింటే మ్యాచ్ అయిన వాళ్ల కాలేయం దెబ్బతిన్నవాళ్లకు అమరుస్తారు. రెండు, మూడు నెలల్లో ఇద్దరి కాలేయాలు పూర్తిస్థాయికి పెరుగుతాయి.
అటువంటి పునరుత్పత్తిగల కాలేయంలో దెబ్బతిన్న భాగాన్ని తొలగిస్తే అది కొన్ని నెలల్లో పూర్తిస్థాయికి పెరుగుతుంది. అటువంటి కాలేయం గడ్డకట్టుకుని బిగుసుకుపోయి, ఎటువంటి రసాయనాల్ని ఉత్పత్తి చేయలేని స్థితికి తీసుకువెళ్తున్నారు కొందరు. ఫాటీ లివర్ అబ్‌స్ట్రక్షన్ వల్ల కాలేయాన్ని బిగుసుకుపోయేటట్లు చేస్తున్నారు. దీనినే సిరోసిస్ అంటారు. సిర్రోసిస్ వస్తే కాలేయమార్పిడి ఒక్కటే మార్గం.
మిగతా అవయవాలకొచ్చినట్టుగానే కాలేయానికి క్యాన్సర్ రావచ్చు. కాలేయ క్యాన్సర్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటిది హైపటైటిస్ బి.సి వైరస్‌లు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. హెపటైటిస్-బి రాకుండా ఇప్పుడు టీకా ఉంది. దాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఇది పిల్లలకు పెద్దలకు కూడా ముఖ్యం. హెపటైటిస్-సికి టీకాలు (వ్యాక్సినేషన్)లేవు. ఎవరితోబడితే వారితో శారీరకంగా కలువకుండాను, ఏ మందులు పడితే ఆ మందులు వాడకుండా ఉంటే హెపటైటిస్-సిని కొంతదూరంలో ఉండవచ్చు. మామూలు హెల్త్‌చెకప్‌లు చేయించేటప్పుడే హెపటైటిస్-బి,సిలని పసిగట్టే పరీక్షలు చేయించుకోవడం మంచిది.
హెపటైటిస్ -బి ఉన్నట్లు నిర్థారణైతే యాంటివైరల్ థెరపీ చేయించుకోవాలి. కాలేయ క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. 80 మందిలో ఈ వైరస్‌తో బాటు హెపటైటిస్-సిని నివారించవచ్చు. హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్ సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్, క్యాన్సర్స్‌కి దారితీయవచ్చు. కాలేయకంతులు ప్రారంభ దశలో ఉంటే శస్త్ర చికిత్స ద్వారా దానిని తొలగించవచ్చు. క్యాన్సర్ బాగా వ్యాపించడం వల్లగాని, కాలేయం బాగా దెబ్బతిని ఉండడం వల్లగానీ కొన్ని సందర్భాలలో శస్తచ్రికిత్స చేయలేని స్థితిలో ఉండవచ్చు. అటువంటి వాళ్లకు కొత్త చికిత్సా విధానాలు ఉన్నాయి. రేడియోఫ్రీక్వెన్సి, ఎబ్లియేషన్, కీమో ఎంబొలైజేషన్, రేడియో ఎంబొలైజేషన్ విధానాలు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కాలేయమార్పిడి చేయాల్సి వస్తుంది.