సంజీవని

మెడ నొప్పులకు సరైన మందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రస్టాక్స్: నొప్పి ఉదయం నిద్ర లేచిన మొదటి కదలికలో అధికంగా ఉండి తరువాత కదలికలో నొప్పి తీవ్రత తగ్గుతూ ఉండటం గమనించదగిన ముఖ్య లక్షణం. వీరికి రాత్రి పూట బాధలు ఎక్కువగా వుంటాయి. చల్లటి, తేమతో కూడిన వాతావరణం వీరికి సరిపడదు. అనుకోకుండా బెణకటంవలన వచ్చే నడుము, మెడ నొప్పికి ఈ మందు బాగా పనిచేస్తుంది. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక వాడుకోదగినది.
హైపరికం: నొప్పి మెడ, భుజ కండరాలలో తీవ్ర స్థాయిలో ఉంటుంది. కదలికలు కష్టంగా మారుతుంది. వెన్నుపూసల మధ్య సులువుగా కదిలేందుకు ఉపయోగపడే కార్టిలేజ్‌లో వచ్చే మార్పులవలన నాడులు ఒత్తిడికి గురై వచ్చే నడుము నొప్పికి, అలాగే ఎడమ కాలు లేదా కుడి కాలుకు వ్యాపించి బాధించే కండరాల నొప్పికి ఈ మందు ప్రయోజనకారి.
ఆర్నికా: పడటం వలన నడుము, మెడ ప్రాంతంలో కముకు దెబ్బలు తగలటం, బెణకటం వలన నొప్పి ఉంటే ఈ మందు వాడుకోదగినది. అలాగే శారీరక శ్రమ అనంతరం నొప్పి వేధిస్తుంటే ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
కోనియం: మెడ నొప్పితోపాటు కళ్లు తిరిగినట్లుగా అనిపిస్తుంది. మెడ అటు ఇటు త్రిప్పినపుడు వస్తువులు గుండ్రముగా తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. వృద్ధులలో వచ్చే మెడ నొప్పికి ఈ మందు తప్పక వాడదగినది.