సంజీవని

ప్రమాదానికి తొలి ‘అడుగు’ (మధుమేహంతో పాదాలకు ముప్పు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుమేహం ఉన్నవాళ్లు పాదాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మధుమేహం అంటే డయాబెటిస్ ఉన్నవాళ్లకి జీవితకాలంలో 25 శాతం మంది పాదాల మీద పుళ్లతో బాధపడుతుంటారు. వీటి కారణాన పాదాలను తీసివేసే ప్రమాదం ఉంది. ఈ డయాబెటీక్ ఫుట్ వల్ల ప్రపంచవ్యాపితంగా ప్రతి 30 సెకన్లకొక పాదాన్ని తొలగిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. డయాబెటిక్ ఫుట్‌లో కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్తలు తోడ్పడతాయి. మామూలుగా చర్మం ఎండిపోవడం, ఆనెలు, చర్మం చిట్లిపోవడం, చర్మం మీద పొలుసుల్లా రావడం, పుళ్లు ఏర్పడటం, గట్టి చర్మం రాపిడి ఉండే ప్రదేశంలో బొటనవేలు ఒకవైపు వంగిపోయినట్లున్నా జాగ్రత్తలు పడాలి.
చాలా కాలంగా డయాబెటిస్‌తో బాధపడుతుంటే క్రమంగా, నరాలు, రక్తనాళాల వ్యవస్థ దెబ్బతినవచ్చు. దీంతో డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి లేక ఫెరిఫెరల్ వాస్కులోపతి రావచ్చు. మన శరీరంలో పొడవాటి నరాలు, రక్తనాళాలు ఎక్కడుంటాయి? పాదాలలో ! కాబట్టి ముందవి దెబ్బతినడం ప్రారంభిస్తాయి. న్యూరోపతిలో పాదాల పటుత్వం, నొప్పిలాంటివి దెబ్బతిని నడకలో ప్రత్యేక ఇబ్బందులొస్తాయి. ముందు స్పర్శ మరీ ఎక్కువగా ఉండవచ్చు. క్రమంగా పూర్తిగా లేకుండా ఉండవచ్చు. అందుకని ఎప్పుడు మెత్తటి కుషన్ చెప్పుల్ని వాడడం మంచిది. పాదాల్ని మరీ బిగుతుగా పట్టివుంచే పాదరక్షల్ని వేసుకున్నా ఇబ్బంది కలుగుతుంది. న్యూరోపతిలో కండరాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి పాదాలలో కొన్ని ప్రాంతాల మీద బరువు ఎక్కువ పడి పుళ్ళు ఏర్పడుతుంటాయి. వాస్క్యులోపతి వల్ల దెబ్బతిన్న ప్రాంతాలకి రక్తం సరఫరా సరిగా లేకపోవడం వల్ల గాయం ఓ పట్టాన మానదు. డయాబెటిస్ అదుపులో లేకపోవటంతో గాయం మానక విస్తరించి, పాదాన్ని లేక కాలుని తొలగించాల్సిన దుస్థితి కలుగవచ్చు.
కాబట్టి డయాబెటిస్ వున్నవాళ్లు పాదాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ల పాదాల్ని వాళ్లే ఎలా పరిరక్షించుకోవాలి ప్రాథమిక స్థాయిలోనే ఇబ్బందుల్ని ఎలా తెలుసుకోగలగాలి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? తెలుసుకోవడం చాలా అవసరం.
రోజు మీ పాదాల్ని పరిరక్షించుకోండి. ఎంత చిన్న దెబ్బ తగిలినా జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. కాలులో ఎలాంటి నొప్పి వచ్చినా, ఎర్రదనం వచ్చినా, దురద వచ్చినా, కాలు ప్రాంతంలో వేడిగా ఉంటున్నా-ఇన్‌ఫెక్షన్స్ ఏమైనా వచ్చాయేమోనని జాగ్రత్తపడాలి. ఏ మాత్రం భిన్నంగా అనిపించినా వైద్యుణ్ణి కలవడం మంచిది.
పొడిబారిన చర్మానికి నీటితో కూడిన మాయిశ్చర్ని వాడాలి. వేళ్ల మధ్యలో తడి ఉండకుండా జాగ్రత్తపడాలి.
సాక్స్‌ను, కాటన్ సాక్స్‌ను మాత్రమే వాడాలి.
గోళ్లని జాగ్రత్తగా తీసివేస్తుండాలి. కత్తెరతో చిగుళ్లు దెబ్బతినేలా చూడకూడదు. గోరు కిందకు తిరిగేట్టు కదిలించ కూడదు. అలా పెరిగితే లోపలి మెత్తటి కణాలు దెబ్బతింటాయి.
పాద రక్షాలు మెత్తగా సరైన సైజులో పాదాలకు రక్షణ కలిగేలా చూసుకోవాలి. పెడిట్రీషియన్‌ని... అంటే పాదాల వైద్యుణ్ణికలుసుకుని పాదాలకు ప్రిస్కిప్షన్ రాయించుకుని, ఆ ప్రకారం పాదరక్షలతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటిలో పాదాలకు పుళ్లు పడవచ్చు.
ఫ్లాట్‌ఫుత్, వామర్‌టోస్ ఉన్నవాళ్ల పాదరక్షల కోసం ప్రత్యేక ప్రిస్కిప్షన్ ఉండాలి.
పాదం కాళ్లలో ఉన్న ఎముకలు దెబ్బతినకుండా ఎక్స్‌ర్‌సైజ్ చేయడం చాలా అవసరం. రక్త ప్రసరణ కాళ్లలో మెరుగవుతోంది.
పొగాకుని ధూమపానం కోసమే కాదు, ఏ రకంగా వాడే అలవాటున్నా, వెంటనే మానేయాలి. ధూమపానం వల్ల సన్నటి రక్తనాళాలు దెబ్బతిని, కాళ్లలోకి, పాదాల్లోకి రక్తప్రసరణ సరిగ్గారాదు.
కాళ్లలో, పాదాలలో ఏ మాత్రం మార్పు వస్తున్నట్లు అనుమానం కలిగినా, వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి.
పాదాల మీద ఏ చిన్నదెబ్బ తగిలినా నిర్లక్ష్యం చేయకూడదు.
పాదాలు వాస్తున్నా, పస్ ఏర్పడుతున్నా జాగ్రత్తపడాలి.
ఆహారంలో నూనెలు ఎక్కువగా తీసుకోవడం, లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకుంటూ, అదుపులో ఉండేలా చూసుకోవాలి.
డయాబెటిస్‌తో బాధపడేవాళ్లు ప్రతి సంవత్సరం పాదాల్ని పరీక్షింపచేసుకోవాలి. నరాల పనితీరుకి సెన్సిట్ మీటర్, రక్తనాళాల పనితీరుకి డాపర్ పరీక్షలు చేయించుకోవాలి. కాళ్లలో అల్సర్స్ ఉంటే తగిన చికిత్స చేయించుకోవాలి. అవసరాన్ని బట్టి యాంటిబయాటిక్ థెరపీ చేయించుకోవాలి. అల్సర్స్ (పుళ్ళు) మానకపోతే ఆర్డీజియోగ్రఫీ చేయించుకోవాలి. కాలిలోకి రక్తప్రసరణ తక్కువవుంటే పెంచటానికి కొన్ని రకాల శస్తచ్రికిత్సలున్నాయి. ప్రాథమిక దశలో పాదాలు దెబ్బతినకుండా చూసుకుంటూ ఏవైనా ఇబ్బందులనిపిస్తే వెంటనే తగిన చికిత్స చేయించుకుంటే అవయవాల్ని తొలగించకుండా కాపాడుకోవచ్చు.

-డా॥ కె.ఎ.ముకేథ్స్