సంజీవని

బ్యూబ్రో- లింఫ్ గ్రంథుల ఇన్‌ఫ్లమేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తున్నప్పుడు కొంత ప్లాస్మా, క్యాపిలరీల గోడల గుండా బయటకు వెళ్తుంది. అలా రక్తనాళాల గోడలు గుండె ప్రవహించే ద్రావకాన్ని లింఫ్ అంటారు. ప్రొటీన్లు, రక్తకణాలు- క్యాపిటలరీల గోడల గుండా బయటకు రాలేవు కాబట్టి లింఫ్‌తో ప్రొటీన్లు గానీ ఎర్ర రక్త కణాలు గానీ ఉండవు. తెల్ల రక్తకణాలు మాత్రమే క్యాపిలరీల గోడల గుండా దూరి బయటకు వస్తాయి. జీవకణ కార్యాలవల్ల ఏర్పడే వ్యర్థాల్ని లింఫ్ స్వీకరించి, లింఫ్ నాళాలగుండా తీసుకుపోతుంది. అవన్నీ చివరికి పెద్ద వెయిన్‌లో అంతమవుతాయి.
ప్రమాదకరాలైన బాక్టీరియా ఇతర పదార్థాల్ని వడకట్టడానికి లింఫ్ నాళాల్లో జల్లెడలు వుంటాయి. ఈ లింఫ్ గ్రంథులు కొన్ని తెల్లరక్తకణాల్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ లింఫ్ గ్రంథులు వివిధ శరీర భాగాలలో గుంపులు గుంపులుగా ఉంటాయి. గజ్జలలో, చంకల్లో, మెడలో, ఊపిరి తిత్తులలో, కడుపులో ఉంటాయి. క్రిమి దోషాలతో ఈ లింఫ్ గ్రంథులు వాచి ఇబ్బంది పెడతాయి. ఇలా ఇన్‌ఫ్లేమ్ అవడాన్ని బ్యూబ్రో అంటారు.