సంజీవని

కీళ్లు విరగడం, బెణకడం వీటి మధ్య తేడా ఏంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- బెణకడం అనేది వెనె్నముకలోనూ, మడమలోనూ, మోకాలులోనూ ఎక్కువగా జరుగుతుంది. అధికంగా శ్రమ చేసినప్పుడు, అడ్డదిడ్డంగా వంగినప్పుడు కీలుకి సంబంధించిన లిగ్మెంట్లకు, కీలు పరిసరాల్లో వున్న ధాతువులకు ఏర్పడే ఇబ్బందిని ‘బెణకడం’ అంటారు. ఆటగాళ్లల్లోనూ, పహిల్వాన్లలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. బెణికినప్పుడు ఎముక కూడా విరిగిందేమోనని, ఎక్స్‌రే తీయించి చూస్తారు. బెణికిన చోట గుడ్డ మడతపెట్టి కట్టుకట్టాలి. బాధ ఎక్కువగా వుంటే ప్లాస్టర్ వేయాలి. తల ఎత్తి దువ్వు కుంటున్నప్పుడు, గడ్డం చేసుకునేటప్పుడు ‘కీళ్లు’, నవ్వుతున్నప్పుడు, ఆవులిస్తున్నప్పుడు దవడ ఎముకలకి స్థానచలనం కలగవచ్చు. అప్పుడు నోరు మూసుకోవడం కష్టం కావచ్చు. నోరు మూసుకో లేకపోవచ్చు. మింగలేకపోవచ్చు. మాట్లాడలేని ఈ స్థితిని వెంటనే సవరించాలి. ఇక విరిగిన ఎముకల విషయానికి వస్తే వాటంతట అవి అతుక్కుంటున్నా వాటిని సరైన పొజిషన్లలో ఉంచి కట్టుకట్టాలి.

-డా.సాయికృష్ణ