సంజీవని

రక్తహీనతలోనూ రకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్తహీనతని ‘ఎనీమియా’ అంటారని అంధరికీ తెలుసు. ఎనీమియావల్ల చర్మం, మ్యూకస్‌మెంబ్రేన్ పాలిపోతాయి. ఆ పాలిపోవడాన్ని గోళ్ళలోను, పెదవులలోను, నాలికమీద, కంటిరెప్పలమీద తేలికగా గుర్తించవచ్చు.
ఎనీమియా రోగికి ఆకలి క్షీణిస్తుంది. జవసత్వాలు తగ్గిపోతాయి. త్వరగా అలిసిపోతారు. కాస్త శ్రమపడ్డా ఊపిరి సరిగ్గా అందదు. గుండెల్లో దడ.
ఇనుము, పోలిక్ యాసిడ్, విటమిన్ బి12, ప్రొటీన్లు ఆహారంలో లోపించినప్పుడు ఈ రకం ఎనీమియా ఏర్పడుతుంది. ఇందులో ప్రొటీను, ఇనుము లోపించడం సాధారణంగా జరుగుతుంది. ఆకుకూరలు, ఉల్లిపాయలు, కందమూలాలు, యాపిల్‌లలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. బెల్లంలో కూడా ఇనుము ఎక్కువగా లభిస్తుంది.
పోలిక్ యాసిడ్ ఆకుపచ్చని ఆకు కూరల్లోను, తాజా ఫలాలలోను ఉంటుంది. దీనిలోపంవల్ల కలిగే ఎనీమియా గర్భవతులలో ఎక్కువగా కనిపిస్తుంది.
బి12 పప్పులో ఎక్కువగా ఉంటుంది. అందుకే శాఖాహారుల్ని పప్పు ఎక్కువగా తీసుకొమ్మంటారు. పాలలో, చేపలలో ఉంటుంది బి12.
రక్తనష్టంవల్ల ఎనీమియా వస్తుంది. యాక్సిడెంట్లలో రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంటుంది. రుతుస్రావంవల్ల రక్తాన్ని పీల్చే పురుగులు పేగులలో ఉండడంవల్ల కూడా ఈ ఎనీమియా వస్తుంటుంది. చికిత్స కారణాన్ని బట్టి చేయాలి.
రక్తప్రవాహంలో నెత్తురు విరగడంవల్ల ఎనీమియా కలుగుతుంది. కానీ ఇది చాలా అరుదు.
కొన్ని సందర్భాలలో అసాధారణ రక్తకణాలవల్ల కూడా ఎనీమియా కలుగుతుంటుంది. అటువంటి వ్యాధులలో లుకేమియా ఒకటి. పరిపూర్ణంగా పెరగని తెల్లకణాలు మజ్జా ధాతువులో రక్తంలో ప్రవేశించబడతాయి. ఇలాంటి కణాలు అధిక సంఖ్యలో ఉన్నా రక్షక పనిని సరిగా నిర్వర్తించలేవు. తీవ్ర స్థితిలో వున్నప్పుడు దీనికి చికిత్స లేదు. దీర్ఘస్థితిలో ఉన్నప్పుడు కొన్ని మందులు ఈ వ్యాధిని అదుపులోకి తేగలవు. రక్తపరీక్ష, మజ్జా ధాతు పరీక్ష చేయకుండా ఈ రోగాన్ని గుర్తించలేము.
రక్తం గడ్డకట్టడం ఆలస్యమై నిరంతర రక్తస్రావమవుతుంటుంది.

డా.కె.వలీపాషా
డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రి
యోగి వేమన విశ్వవిద్యాలయం.. 98492 16278

డా.కె.వలీపాషా