సంజీవని

ఇలా అయతే మేలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తిలకు రుతుస్రావం రుతుస్రావం మధ్య యోనినుంచి రక్తం లేక మరే ద్రావకాలు కారుతున్నా.. మెనోపాజ్ తర్వాత, గర్భం ధరించినప్పుడు రక్తస్రావం అవుతున్నా వెంటనే గైనకాలజిస్ట్‌ని కలవాలి.
* స్ర్తి, పురుషులిద్దరిలోనూ గుదము ద్వారా రక్తస్రావమవుతున్నా వెంటనే గాస్ట్రోఎంటెరాలజిస్ట్‌ని కలవాలి.
* మూత్ర, మల విసర్జనలో గుర్తించాల్సిన మార్పులు వచ్చినా..
* శరీరంమీద పడ్డ పుండు మూడు వారాలవుతున్నా మానకున్నా..
* పుట్టుమచ్చలు పెరుగుతున్నా, చర్మం రంగు మారుతున్నా..
* రొమ్ములలో ఎటువంటి గడ్డలేర్పడ్డా..
* గొంతులో గరగర, నస, దగ్గులాంటివి వరుసగా వస్తున్నా..
* మ్రింగడం కష్టమవుతున్నా, తరచూ అజీర్ణం
* హఠాత్తుగా ఆకలి మందగించడం, బరువు తగ్గడం..
* తరచూ వాంతులవుతున్నా...
* తల, పొట్ట, ఛాతీ- ఎక్కడైనా కారణం తెలీకుండా నొప్పులు వస్తున్నా..
* తరచూ జ్వరం, రాత్రిళ్ళు చెమటలు పోయటం..
* తల తిరుగుతున్నా...
* హఠాత్తుగా చూపులో తేడాలు వచ్చినా..
* ఆయాసం అతిగా కలుగుతున్నా..
* పెదాలు, కనురెప్పలు, గోళ్ళు నీలంగా మారుతున్నా..
* తరచూ మడమలు వాస్తున్నా...
* జాండిస్ వచ్చినా..
* తరచూ ఇబ్బందిగా మూత్రమవుతున్నా.. వెంటనే ఆయా అవయవ వైద్యానికి చెందిన నిపుణులకు చూపించుకోవడం మంచిది.
రెండవ వైద్య సలహాకోసం ఎప్పుడు వెళ్లాలి?
* మీ వైద్యుడు శస్తచ్రికిత్స తప్పనిసరి అన్నాడు. అది అరుదైన శస్త్ర చికిత్స అయినా, ప్రాణాపాయాన్ని కలిగిస్తుందనిపించినా, అనవసరం అనిపించినా మరో వైద్యుణ్ణి కలిసి అతను/ఆమె సలహా తీసుకోవడం మంచిది.
* మీ వైద్యుడు మీరు ఊహించిన జబ్బు మీకుందని చెబితే అనుమాన నివృత్తికోసం మరో వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.
* రోజులు గడుస్తున్నా మీ వైద్యుడు రోగ నిర్థారణ సరిగా చేయలేకపోతున్నా మరొకరి సలహా తీసుకోవడం మంచిది.
* మీ వైద్యుడు అనవసరంగా ఖరీదైన పరీక్షలు చేయమంటున్నాడనిపించినా మరో వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.
* మీ వైద్యుడు చెప్పినట్లు చికిత్స చేయించినా తగ్గకపోయినా..
* మీ వైద్యుడు మీ లేక మీ తాలూకువాళ్ళకి అనారోగ్యాన్ని వివరించడంలో తృప్తి కలిగించకపోయినా.. మీరు మరో వైద్యుడి సలహా తీసుకోవడంలో తప్పులేదు. తీసుకోవాలి కూడా!