సంజీవని

తరచూ ఒళ్ళునొప్పులు (మీకు మీరే డాక్టర్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: ప్రతిరోజూ వొళ్ళంతా నొప్పులుగా వుంటుంది. ఒక చోటని కాదు, ఒళ్ళంతా నొప్పులే. నివారణ చెప్పగలరు?
-్భర్గవ రామారావు.పి., సికిందరాబాద్
వొళ్ళు నొప్పులు కొంతమందిని తీవ్రంగా బాధిస్తాయి. వీటిని కండరాల నొప్పులని కూడా పిలుస్తారు. నొప్పుల్లేకుండా ఎవరూ ఉండరు. అది పదే పదే తిరగబెట్టి వదలకుండా బాధిస్తేనే వ్యాధి. అది ఏదైనా ఒక శరీర భాగంలో వచ్చిన నొప్పి అయినా సరే, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నా సరే కండరాలవలనే ఈ నొప్పులు వస్తున్నాయి.
శరీరంలో మారుమూల ప్రాంతానిక్కూడా కండరాలు వ్యాపించి ఉంటాయి. కండ ఉన్నంత మేర, కండరాల నొప్పులు వస్తాయి. మయాల్జియా వ్యాధి లక్షణం ఇది. కండరం మీద పని ఒత్తిడి (మజిల్ టెన్షన్) ఎక్కువ అవటం, శక్తికి మించిన శ్రమ, పని ఒత్తిడి, ఉద్వేగాలు కూడా కండనొప్పులకు కారణం కావచ్చు. ఫ్లూ జ్వరంలో విపరీతంగా ఒళ్ళు నొప్పులుంటాయి. బి విటమిన్లూ, డి విటమినూ, ఇనుము లోపాలవలన కూడా ఒళ్ళు నొప్పులు రావచ్చు. మితిమీరిన శ్రమవలన కండరం గాయపడే (మజిల్ స్ట్రైన్) ప్రమాదం వుంది. ఫైబ్రో మయాల్జియా లాంటి కండర వ్యాధులు కూడా ఇందుకు కారణం కావచ్చు.
నొప్పి పట్టిన కండరానికి తగిన విశ్రాంతి ఇవ్వటం మొదటి చికిత్స. సాధ్యమైతే గట్టిగా క్రీప్ బ్యాండేజ్‌తో బిగించి కడితే కండరం విశ్రాంతి పొంది నొప్పి తగ్గుతుంది. నొప్పి బిళ్ళను పరిమిత మోతాదులో తీసుకోవచ్చు. పట్టేసిన కండరం మీద ఐసుతో కాపడం పెట్టుకోవచ్చు. 2-3 రోజులపాటు ఇలా చేసినా నొప్పి దారికి రాకపోతే వేడి చూపించవచ్చని వైద్యులు (ఎన్‌ఐహెచ్, 2011) సూచిస్తున్నారు. పట్టేసిన కండరాన్ని నెమ్మదిగా చాచి వదులుతూ దానికి తగిన మృదు వ్యాయామం ఇవ్వాలి. కండరాన్ని సవర్దీయాలి. నొప్పి వచ్చాక కూడా ఆ కండరం మీద ఒత్తిడి కొనసాగితే కండరం గాయపడుతుంది. కండరానికి విశ్రాంతి అవసరం. విశ్రాంతి ఇస్తే రెండు మూడు రోజుల్లో తగ్గిపోవాలి. తగ్గకుండా నొప్పి నానాటికీ పెరుగుతుంటే వైద్యుని సంప్రదించటం మంచిది. కండరం మీద వాపు, ఎర్రగా పొక్కిపోవటంలాంటివి కనిపిస్తే అందుకు కారణం వెదకవలసి వుంటుంది. తేలు కుట్టినంతగా కండరాల నొప్పిని సోర్ మజిల్ అంటారు. ఇలాంటప్పుడు తగిన ఔషధాల కోసం వైద్యుని సంప్రదించవలసి ఉంటుంది.
ఎక్కువసేపు కదలకుండా కూర్చుని పనిచేసేవారిక్కూడా కండరాల నొప్పులు రావచ్చు. వ్యాయామ లోపంవలన వచ్చే నొప్పులివి. ఇలాంటి వృత్తుల్లో ఉన్నవారు కనీసం గంటకోసారి లేచి ఒళ్ళు విదుల్చుకోవాలి, కండరాలు కదల్చటానికి ప్రయత్నం చేస్తుండాలి. లేకపోతే కండలు పట్టేసి నొప్పులొస్తాయి.
అకస్మాత్తుగా ఒళ్ళు నొప్పులు, ఇక పనిచేయలేననిపించటం, తలనొప్పి, మెడనొప్పి రావటానికి జలుబు లేదా ఫ్లూ జ్వరాలలు కూడా కారణం కావచ్చు. ఒళ్ళు నొప్పులు వచ్చినపుడు జ్వరం చూసుకోవటం మంచిది. జలుబులో జ్వరం లేకుండా కూడా నొప్పులు రావచ్చు. మూత్రంలో చీము (యూరినరీ ఇన్‌ఫెక్షన్స్) ఏర్పడితే జ్వరమూ, చలి, ఒళ్ళు నొప్పులూ రావచ్చు. వాంతులు, మూత్రంలో మంట, ఆకలి లేకపోవటం లాంటి బాధలు కూడా కలగవచ్చు.
ఇవన్నీ కాకుండా ఆధునికంగా వేడి చేసే ఆహార పదార్థాలను లేదా, వాతం చేసే పదార్థాలను తిన్నప్పుడు కూడా ఒళ్ళు నొప్పులు రావచ్చు. పులుపు పదార్థాలు, నూనె పదార్థాలు, పిజ్జాలు హోటళ్ళలో తిళ్ళు తిన్నప్పుడు వాతమూ వేడి పెరిగి ఒళ్ళు నొప్పులు కలగవచ్చు. వేడి శరీర తత్వం ఉన్నవారికి ఒళ్ళు నొప్పులు పిలిస్తే పలుకుతాయి. ఇలాంటివారు నొప్పులొస్తే నొప్పి బిళ్ళలు వేసుకోవచ్చులెమ్మని అశ్రద్ధ చేయకూడదు. వాతమూ వేడి ఎక్కువగా ఉండేవారు తేలికగా అరిగేవీ, చలవ చేసేవీ తీసుకుంటూ వుంటే నొప్పులు రాకుండా ఉంటాయి. కష్టంగా అరిగే బిరియానీల్లాంటివన్నీ వాతమూ, వేడి పెంచేవే! ఆయా శరీర తత్వాలను బట్టి కొద్దిపాటి దానికే ఎక్కువ హడావిడి చేయవచ్చు. ‘‘పెరుగన్నంలో గోరంత గోంగూర పచ్చడి నంజుకున్నానంతే, తెల్లారేసరికి ఒళ్ళంతా పట్టేసింది’’ అంటుంటారు కొంతమంది. శరీరంలో వాతమూ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిపాటిదే ఎక్కువగా హడావిడి చేయవచ్చు. తరచూ వొళ్ళు నొప్పులతో బాధపడేవారు వైద్యుని సలహామీద మందులు వాడుకుంటూ, చలవ చేసే ఆహార పదార్థాలను, తేలికగా అరిగేవాటినీ, పోషక విలువలు కలిగిన నాణ్యమైన ఆహారాన్ని తీసుకుంటూ వుంటే నొప్పులు అదుపులోకి వస్తాయి. ప్రొద్దున్నపూట మనం తినే టిఫిన్లు, వాటిలో నంజుకుంటూ తినే చట్నీలు, కారప్పొడులు, సాంబారులూ ఒళ్ళు నొప్పుల్ని పెంచేవే! వాటికి బదులుగా ప్రొద్దునపూట మజ్జిగ అన్నంలో కేరట్, బీట్‌రూట్, ముల్లంగి, ఉల్లి, సొరకాయ, లేతబూడిద గుమ్మడికాయ, కొత్తిమీర లాంటి కూరగాయల ముక్కలు కలుపుకుని కమ్మగా తాలింపు పెట్టుకున్న దద్యోదనం (కర్డ్ రైస్)లోకి మారి చూడండి. వేడి చేసే వాటిని సాధ్యమైనంతవరకూ మానండి. నొప్పులు తగ్గుతాయి.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్:
9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు