సంజీవని

ఫొగబెట్టొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్ననే యాంటీ టుబాకో డేని జరుపుకున్నాం. ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవంలో ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నామా? తీసుకోకపోతే ఇలాంటి అవగాహనా దినోత్సవాలు జరుపుకుని లాభమేమిటి? అందుకే మరోసారి పునరాలోచించండి- మీకు ఏ విధంగా పొగాకు పదార్థాల్ని వాడే అలవాటున్నా.
నాకు చాలా సంవత్సరాలనుంచి పొగ త్రాగే అలవాటుంది. ఇప్పుడు మానివేసినా ముందు ముందు ఆరోగ్యపరంగా ఏమైనా లాభముండవచ్చా అని చాలామంది సందేహపడుతుంటారు. ఏ క్షణాన ఈ పొగ త్రాగడం మానేసినా మనకు లబ్ధి కలుగుతుంది. ఎనే్నళ్లనుంచి అలవాటున్నా మాని చూడండి.. మీరు తిన్న ఆహారపు రుచిని మీరు బాగా తెలుసుకోగలరు. శ్వాస మెరుగవుతుంది. పొడి దగ్గు తగ్గుతుంది. గుండె ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగవుతుంది. కొన్ని రకాల కాన్సర్‌లు వచ్చే రిస్క్ తగ్గుతుంది. అల్సర్సూ మానతాయి. మీరు పొగ త్రాగడం మానివేసి ఒక్కో సంవత్సరం పెరుగుతున్నకొద్దీ తీవ్ర అనారోగ్యాల రిస్క్ తగ్గుతుంటుంది. మీ ఊపిరితిత్తులకి మీరు పొగ త్రాగే అలవాటు కాకముందు ఆరోగ్యం రాకపోయినా ఊపిరితిత్తులకు జరుగుతున్న అపకారం కొంతవరకూ తగ్గుతుంది. ఇంకా దెబ్బతినడం అరికట్టబడుతుంది.
నాకు ఒక అలవాటుని మానాలనే ఉంది. ఇంతకుముందు ఒకటి రెండు సార్లు అందుకు ప్రయత్నించినా ఫెయిలై మళ్లీ తాగడం మొదలుపెట్టాం అంటారా? మానడం కష్టమే. కానీ నిర్ణయం గట్టిగా తీసుకుంటే మానగలరు. తర్వాత కొంతమందికి ఈ అలవాటు మానివేస్తే బరువు పెరుగుతుందని అనుమానం. ఇది తప్పు. మీరు తీసుకునే ఆహారం మీదా ధూమపాన ప్రభావముంటుంది. మానివేసిన తర్వాత ఆహారం సరిగా తీసుకోగలుగుతారు. కాబట్టి రెండు మూడు కిలోల బరువు పెరగవచ్చు.
తార్, నికొటిన్ తక్కువున్న సిగరెట్లు మంచివనుకుంటారు కొందరు. ఏ రకంగా ధూమపానం చేసినా ఊపిరితిత్తులు, గుండెకి ప్రమాదం తప్పదు.
కొంతమంది నేను సిగరెట్లు తాగుతాను. కానీ పొగను లోపలకు పీల్చనంటారు. మీరు పొగని లోపలకు పీల్చకపోయినా, నోటిలోకి తీసుకుంటారుగా, అది చాలదా- నోటి కాన్సర్, మెడ- తల సమస్యలు రావడానికి. అంతేకాదు, మీకు తెలీకుండానే కొంత గాలి లోపలకు వెళ్తుంది. తప్పదు. అది చాలదా ఆహార నాళం, రక్తనాళాల ఇబ్బందులు పెరగడానికి.
మీరు తాగుతుంటే ప్రక్కనున్నవాళ్లకి.. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు, అలాగే మీ ప్రక్కవాళ్ళు పొగ తాగుతుంటే మీకు నష్టాలు తప్పవు. అందుకని మీరు పొగ త్రాగడం మానడమే కాదు, మీ చుట్టుప్రక్కల ఎవ్వరూ పొగ తాగకుండా చూడండి.
ఇంకొందరు నేను పొగ తాగను గాని తంబాకు నోట్లో పెట్టుకుంటా, గుట్కాలు అలవాటుంది అంటారు. పొగాకు పదార్థాల్ని ఏ రూపంలో తీసుకున్నా మంచిది కాదు. మరికొంతమంది ముక్కుపొడుం పీలుస్తారు. ఇవన్నీ మంచి అలవాట్లు కావు. వెంటనే వాటికి చెక్ పెట్టండి. లేకపోతే అవి మీ ఆరోగ్యనికి చెక్ పెడతాయి. ఇలాంటి అలవాటు మానాలని నిర్ణయించుకోవాలే గానీ అందుకు రేపు లేదు, ఈ రోజే ఆ గట్టినిర్ణయాన్ని తీసుకోండి.

-డా.బి.ఎస్.ఆర్.మూర్తి
జనరల్ సర్జన్, గజపతినగరం, 9866685439

-డా.బి.ఎస్.ఆర్.మూర్తి