సంజీవని

మధుమేహ రోగులూ జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా ఏటా మిలియన్‌కు పైగా తమ కాలిని తొలగించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రతి ముప్పై సెకండ్లకు ఒకరు ఈ ప్రమాదం బారిన పడుతున్నారు.
-శరీరంలో ఒక భాగం తొలగింపు అంటే అంగవైకల్యం, ఉద్యోగంలేని స్థితి, పెద్దఎత్తున ఆస్పత్రి ఖర్చులు భరించాల్సి రావడం, చక్కని జీవితాన్ని ఆస్వాదించే అవకాశాన్ని కోల్పోవడం వంటిదే.
-అంగవైకల్యంతో జీవించే వారిలో వాస్కులర్ వ్యాధులు (54శాతం), తోపాటు మధుమేహం వ్యాధిగ్రస్తులలోపాటు ట్రామా (45 శాతం), కాన్సర్ వ్యాధులతో కోల్పోతున్న వారు 2 శాతం ఉన్నారు.
-నరాల సమస్యను ఎదుర్కొంటున్న వారు సదరు ఇబ్బంది ఎదుర్కొన్న తర్వాత ఐదేండ్లలో మరణించే అవకాశం వుంటుంది. బ్రెస్ట్ కాన్సర్, ఎముకల కాన్సర్, గర్భకోశ కాన్సర్ వల్ల మరణిస్తున్న వారికంటె ఈ సంఖ్య ఎక్కువ.
-మధుమేహం వల్ల ఎదురయ్యే వాటిలో మధుమేహంవల్ల కాలు నష్టపోవాల్సిన పరిస్థితి రావడం ఒకటి. భారతదేశం ఈ విషయంలో ప్రపంచంలో అగ్రస్థానంలో వుండడం గమనార్హం.
-అంతర్జాతీయ డయాబెటిక్ ఫెడరేషన్(ఐడిఎఫ్) అంచనా ప్రకారం 2030 వరకు ప్రస్తుతం ఉన్న 285 మిలియన్ బాధితులు 435 మిలియన్లకు చేరనున్నారు.
-అంతర్జాతీయ డయాబెటిక్ ఫెడరేషన్ గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే 40.9 మిలియన్‌ల మధుమేహ వ్యాథిగ్రస్తుల సంఖ్యలో భారతదేశం మిగతావారికంటె పెద్దఎత్తున వ్యాదిగ్రస్తులను కలిగి ఉంది.
-మధుమేహం వల్ల కాలును తొలగించుకోవాల్సిన పరిస్థితి వచ్చిన వారు ఆ వెంటనే 2-3 ఏళ్లలో తిరిగి కాలు అమర్చుకోవడం తప్పనిసరి.
-కాలిని తొలగించుకునే పరిస్థితి దాదాపు 60 శాతం ఉదంతాల్లో ముందస్తు జాగ్రత్తతో తప్పించుకోవచ్చు.
-సమగ్ర వైద్య చర్యల్లో భాగంగా డాక్టర్లను నిరంతరం సంప్రదించడం, తగు జాగ్రత్తలు తీసుకోవడంవల్ల చక్కెర వ్యాధితో ఎదురయ్యే అంగం తొలగించుకోవడమనే సమస్యను 80 శాతం వరకు అధిగమించవచ్చు.
-చక్కెర వ్యాధివల్ల అంగవైకల్యం తొలగించే పరిస్థితిని ఎదుర్కొనేందుకు వున్న మూడు మార్గాల్లో 1. పేషంట్లలో అవగాహన పెంచడం, 2. వైద్యుల ఆరోగ్య సలహాలను నిరంతరం పొందడం, 3. సరైన పాదరక్షణ చర్యలు చేపట్టడం.
-్ధమపానం చేయనివారికంటె పొగతాగే అలవాటు వున్న వారిలో అంగం తొలగించే ప్రమాదం 25 శాతం ఎక్కువగా వుంటుంది.
-శరీర భాగాలను తొలగించే ప్రమాదాన్ని ఎదుర్కోవడం సమస్యను పసిగట్టడంలో భాగంగా ముందుగా నరాల సమస్యను అధిగమించడం ప్రధానమైంది.
మీరు పాదాలకు, కాళ్లకు, గోర్లకు ఎదురయ్యే సమస్యలను తగ్గించుకోవాలని భావిస్తున్నారా? ఇదంతా మీరు కేవలం రక్షణ చర్యలు తీసుకుంటే సరిపోతుంది. మీకు సుదీర్ఘకాలంగా డయాబెటిక్ సమస్య ఉంటే తప్పనిసరిగా వెంటనే నివారణ చర్యలు చేపట్టండి.
పాదాలను రక్షించుకోవడం ఎందుకు ముఖ్యం?
మధుమేహంవల్ల పాదాలు ఇంద్రియ స్పర్శ పరిజ్ఞానాన్ని కోల్పోతాయి. ఈ స్పర్శ పరిజ్ఞానాన్ని కోల్పోయిన తర్వాత కాలిలో రాయి గుచ్చుకున్నా లేదా కాలికి పొక్కు వచ్చినా గుర్తు పట్టలేని పరిస్థితి వస్తుంది. కానీ కాలిలో కోసుకునిపోవడం, శరీరం దెబ్బతినడం జరుగుతుంది. అంతేకాకుండా చక్కెర వ్యాధి వల్ల పాదాల్లో రక్తప్రసరణ తీవ్రంగా మందగిస్తుంది. పాదాలు మొద్దుబారిపోవడం, తక్కువ రక్తప్రసరణ వంటివి ఎదురై పాదాల్లో సమస్యలకు కారణంగా మారతాయి.
డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు పాదాలను రక్షించుకోవడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే...
-కాలిలో నెప్పి లేదా వేలు కోల్పోవడం వంటివి
-కాలి పాదం ఆకృతిలో మార్పు, గోర్లలో తేడా
-పొక్కులు, చీలికలు అల్సర్లు వంటివి నివారణ కలగకుండా ఇబ్బందిని కలిగిస్తాయి.
పాదాలను సరిగా పరీక్షించుకుంటే పాదాలు, కాళ్లు గోర్లను పరిరక్షించుకునేందుకు అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఆరోగ్యం కాపాడుకోవచ్చు.
1. మీ పాదాలను ప్రతిరోజు పరీక్షించుకోండి
మీ పాదాలకు చెందిన కోతలు, గాయాలు, చీముకారడం, ఇన్‌ఫెక్షన్లు వంటివి పరీక్షించుకోండి. మీ పాదాల్లో గాయాలు వున్నప్పటికీ వాటిని మీరు తెలుసుకోలేకపోవచ్చు. మీరు షూలు వదిలే సమయంలో ప్రతిరోజు పాదాలను పరీక్షించుకోండి
మీ పాదాలను చూసుకోవడంలో ఇబ్బందులు ఉంటే అద్దం సహాయం తీసుకోండి. ఈ క్రమంలో మీ కుటుంబ సభ్యుల సహాయం కూడా పొందవచ్చు.
2. మీ పాదాలను రోజు శుభ్రం చేసుకోండి
మీ పాదాలను వేడి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో ప్రతిరోజు శుభ్రం చేసుకోండి. క్రీమ్ లేదా పెట్రోలియం జెల్లీని అద్దండి. ధర్మామీటర్‌తో వేడిని పరీక్షించే అవకాశం ఉంటుంది. టాల్కం పౌడర్‌ను సైతం ఉపయోగించవచ్చు.
3. చర్మాన్ని మృదువుగా, తాజాగా వుంచుకోండి
సుతిమెత్తని బట్టపై లోషన్ లేదా క్రీమ్ లేదా పెట్రోలియం జెల్లీ రాసి పాదాల కింద, మీద రాయండి. కాలి చీలమండల మధ్య జెల్లీని రుద్దకండి. తద్వారా ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.
4. పొక్కులు, ఆనెలు రాకుండా చూడండి.
దళసరిగా మారిన చర్మంతో ఏర్పడే ఆనెలు, పొక్కులు వచ్చే అవకాశం వుంటుంది. ఇలాంటి వాటితో ఇబ్బందులు పడుతుంటే డాక్టర్ని సంప్రదించి తగు నివారణ చర్యలు పొందవచ్చు.
5 మీ పాదాలపై నిరంతరంగా చర్యలు తీసుకోండి
గోళ్లను నిరంతరం శుభ్రంగా వుంచుకోవడం అలవాటు చేసుకోండి. తద్వారా చర్మం దెబ్బతినకుండా చూసుకోవచ్చు.
- మీ కాలి పాదాలను పరిశుభ్రంగా వుంచుకునేందుకు తగు చర్యలు తీసుకోండి
- పాదాలను తాకలేని పరిస్థితి వుంటే వైద్యుల సహాయం తీసుకోండి
- గోళ్ల చివర్లు చర్మాన్ని చిట్లే పరిస్థితి తీసుకురావద్దు.
6. ఎల్లప్పుడూ సాక్సులు, షూ ధరించండి
ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఎల్లప్పుడు సాక్సులు, షూలు ధరించండి. ఇంట్లోనే కాకుండా బయటకు వెళ్లిన సమయంలోను పాదరక్షలు లేకుండా ప్రయాణించవద్దు. సాక్సులు, షూలు ధరించకపోవడంవల్ల గాయం తగిలినప్పటికీ తెలియని పరిస్థితి వుంటుంది కాబట్టి తగు చర్యలు తప్పనిసరి. నైలాన్‌తో తయారైన తేలికగా వుండే సాక్సులు వాడడంవల్ల పాదాలను రక్షించుకోగలం. చర్మపు మడత రూపంలో వుండే సాక్సులు ధరించడం మంచిది.
షూలను తొడుక్కునే సమయంలోనే వాటిని నిశితంగా గమనించండి. వాటి చివర్లు శుభ్రంగా వుండడమే కాకుండా ఎలాంటి దుమ్ము ధూళి లేకుండా జాగ్రత్త పడండి. అత్యంత సౌకర్యంగా వుండే షూలను మాత్రమే ఉపయోగించండి.

-డా నరేంద్ర మేడ.. కన్సల్టెంట్ వాస్క్యులర్ అండ్ ఎంథో వాస్క్యులర్ సర్జన్