సంజీవని

ఆ నొప్పికీ మందుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రజస్వల అయిన కొత్తలో కొంతమందికి చాలా రోజులపాటు లేక చాలా ఎక్కువగా లేక ఒక క్రమం లేకుండా ఎపుడుబడితే అపుడు రుతుస్రావం జరగవచ్చు. బహిష్టులు త్వరత్వరగా వచ్చేయొచ్చు. ఒక్కొక్కరికి రుతుస్రావం ద్రవ రూపంలో కాక గడ్డలు గడ్డలుగా అవొచ్చు. కాని ఒకటి రెండు సంవత్సరాలలో హైపోథాలమస్- పిట్యూటరీ - అండాశయం వరుసక్రమం పరిణతి చెంది రుతుస్రావం సాధారణంగా అవుతుంది. ఐతే ఒక్కొక్కసారి ప్రాణాపాయం కలిగేంత ఎక్కువగా అవుతుంది.
ఒత్తిడి, ఆందోళన లాంటి మానసిక స్థితులు, అండాశయం, గర్భాశయంలో ట్యూమర్లు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రక్రియలో తేడాలు, తీవ్రమైన రక్తహీనత, థైరాయిడ్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి సక్రమంగా పనిచెయ్యకపోతే, క్షయ వ్యాధి, గర్భాశయం నిర్మాణంలో తేడాలు, ఎండోమెట్రియోసిస్, గర్భాశయం, అండవాహిక, అండాశయం ఇన్‌ఫెక్షన్లు, పెల్విక్ ఇన్‌ఫెక్షన్లు మొదలైన కారణాలవలన అధిక రుతుస్రావం జరగొచ్చు.
బహిష్టులో నొప్పి లేక రుతుస్రావ నొప్పి
బహిష్టు సమయంలో పొత్తికడుపులో వుండే నులి నొప్పిని లేక మెలిపెడుతున్నట్లుగా ఉండడాన్ని రుతుస్రావ నొప్పి అంటారు. నొప్పి నిలకడగా, హెచ్చుతగ్గులు లేకుండా ఒకే మాదిరిగా ఉండొచ్చు లేక తగ్గుతూ, హెచ్చుతూ ఉండొచ్చు. నొప్పి పిరుదుల్లోకి, నడుము క్రింది భాగానికి, తొడల లోపలి వైపునకు పాకొచ్చు. నొప్పితోపాటు వికారం, వాంతులు, విరేచనాలు ఉండొచ్చు. శరీరమంతా సలుపుతున్నట్లుగా ఉండొచ్చు. నొప్పి తక్కువగా ఉన్నపుడు కూడా ఒకోసారి ఈ బాధలు రావచ్చు.
చికిత్స.. -ఇంటి దగ్గర, పాఠశాలలో, పనిచేసే ప్రతిచోటా ప్రతికూల వాతావరణం ఉంటే దానిని సరి చెయ్యాలి.
- పౌష్టికాహార లోపాల్ని సవరించి, సామాన్య ఆరోగ్యాల్ని మెరుగుపరచాలి.
- జీవనశైలిలో లోపాలు వుంటే వాటిని సరిదిద్దాలి.
- రుతుస్రావ సమయంలోనూ, మామూలు సమయంలోనూ క్రమబద్ధంగా వ్యాయామం చెయ్యాలి.
- చాలామందికి చిన్న, చిన్న సలహాలు, ధైర్యం చెప్పడం నొప్పిని తగ్గించేందుకు ఉపయోగపడతాయి.
- పొత్తికడుపు మీద మసాజ్ చేసుకోవడం, వేడినీటి కాపడం పెట్టుకోవడం, అల్లం టీ తాగడం లాంటి చిట్కాలు నొప్పిని తగ్గిస్తాయి.
- నొప్పిని తగ్గించే మందుల్ని వాడితే నొప్పి తగ్గే వీలుంది. అవసరమైతే హార్మోన్ మాత్రల్ని 3-6 నెలలపాటు వాడాలి. డి అండ్ సి అనే చిన్న ఆపరేషన్‌వల్ల కూడా నొప్పి తగ్గే వీలుంది.
- ఆక్యుప్రెషర్- చేతి బొటనవేలు, చూపుడు వేలి మధ్య ప్రదేశంలో రెండవ వేలి బొటనవేలు, చూపుడు వేలితో నొక్కితే నొప్పి తగ్గే అవకాశం వుంది.
రుతుస్రావ పరిశుభ్రత
మామూలు సమయంలో బాక్టీరియా లోపలి జననాంగాలకు చేరకుండా యోనిలోని ఆమ్ల వాతావరణం రక్షణ కల్పిస్తుంది. రుతుస్రావ సమయంలో యోని ద్వారా ద్వారా కారే రక్తం యోనిలోని ఆమ్ల వాతావరణాన్ని క్షారం వైపు మార్చడంవలన లోపలి జననాంగాలకు ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది. రక్షితనీరు, పరిశుభ్రతను పాటించడానికి అవసరమైన సౌకర్యాలు లేని వర్గాలలో బాలికలకు ఇన్‌ఫెక్షన్లు, ముఖ్యంగా జననాంగ ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువవుతుంది.
శుభ్రమైన దుస్తుల్ని వేసుకోవాలి. లోదుస్తుల్ని రెండు పూటలా మార్చుకోవాలి. జననేంద్రియాలకు ఇన్‌ఫెక్షన్లు సోకకుండా నివారించేందుకు ఎప్పుడూ ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండాలి.
- జననేంద్రియాల పరిశుభ్రతను నిత్యం పాటించాలి. స్నానం చేసేటపుడు, ప్రతిసారి మూత్ర విసర్జన, మల విసర్జన తరువాత జననేంద్రియాలను శుభ్రపరచుకోవాలి. యోని శీర్షాన్ని పైకి లాగి, అంతరధరాన్ని విడదీసి యోని శీర్షం క్రింద పేరుకుపోయే పాచి లాంటి స్మెగ్మాను, రుతుస్రావాన్ని కడుక్కోవాలి. జననాంగాల్ని శుభ్రపరచుకునేటపుడు మూత్రద్వారం వైపు నుండి వెనుకకు మలద్వారం వైపునకు కడుక్కోవాలి. మలద్వారం వైపు నుండి యోని, మూత్రద్వారం వైపునకు నీరు వెళ్లకుండా జాగ్రత్తపడాలి.
ఒకసారి వాడి పారేసే శానిటరీ నాప్‌కిన్స్ లేక మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవడానికి వీలుండే తడిని బాగా పీల్చగల శుభ్రమైన నూలు గుడ్డను రుతుస్రావాన్ని పీల్చడానికి ఉపయోగించాలి. నాప్‌కిన్ లేక గుడ్డను తరచుగా మార్చాలి. ఎక్కువసేపు మార్చకపోతే దుర్వాసన రావడం, రక్తం ఎండి గరుగ్గా అయి తొడలు కొట్టుకుపోవడం జరుగుతుంది. ఈ సూక్ష్మగాయాల ద్వారా రోగక్రిములు శరీరంలోకి చేరతాయి.
నాప్‌కిన్ లేక గుడ్డను మార్చుకునేముందు జననాంగాల దగ్గర అంటుకున్న రక్తాన్ని, రక్తం గడ్డలను తొలగించుకోవాలి. గుడ్డను ఉపయోగిస్తున్నపుడు సబ్బు నీటితో శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టి మళ్లీ ఉపయోగించాలి. తడిగా ఉన్న లేక అపరిశుభ్రమైన ప్రదేశంలో దాచిన గుడ్డల్ని ఉపయోగిస్తే జననాంగ ఇన్‌ఫెక్షన్లు వచ్చి అనేక బాధలకు, సమస్యలకు దారితీస్తాయి.
రుతుస్రావాన్ని పీల్చడానికి వాడిన గుడ్డల్ని ఎక్కడబడితే అక్కడ పారేయకూడదు. ఉతికి ఆరేసిన తరువాత కాల్చేయాలి. లేక పాత పేపర్ చుట్టి చెత్తబుట్టలో వేసి మిగతా చెత్తతోపాటు పారేసేలా జాగ్రత్త వహించాలి.
బాలికల ఆరోగ్యానికి రుతుస్రావ పరిశుభ్రత కీలకమైన అంశం.

చికిత్స
- రుతుస్రావం మరీ ఎక్కువగా అవుతున్నపుడు పడుకుని విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైతే తక్కువ మోతాదు నిద్ర మాత్ర వేసుకుంటే ఆందోళన తగ్గి, రుతుస్రావం తగ్గే అవకాశం వుంటుంది.
- రుతుస్రావం మరీ ఎక్కువగా లేనపుడు క్రమబద్ధంగా వ్యాయామం చెయ్యాలి. చన్నీటి స్నానం చెయ్యాలి.
- ఆహార లోపాల్ని, రక్తహీనతని సరిదిద్దాలి.
- కాల్షియం, విటమిన్ సి, విటమిన్ కెని తీసుకోవడం ద్వారా రక్తం గడ్డకట్టడంలోని లోపాలు కొన్ని సవరింపబడతాయి. రక్తాన్ని గడ్డకట్టించే మాత్రల్ని కూడా వేసుకోవచ్చు.
- వేరే వ్యాధులు, ఇతర సమస్యలు ఉంటే వాటికి చికిత్స చెయ్యాలి.
- హార్మోన్ సమస్యలు ఉన్నపుడు కొన్ని నెలలపాటు హార్మోన్ మాత్రల్ని వేసుకోవచ్చు.

డా.ఆలూరి విజయలక్ష్మి గైనకాలజిస్ట్.. 9849022441