సంజీవని

మధుమేహంపై దృష్టి సారించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్కెర వ్యాధి అత్యంత క్లిష్టమైన, తీవ్రమైన జీవక్రియా సంబంధిత వ్యాధి. రక్తంలో అధికంగా గ్లూకోజ్ స్థాయిని ఇది కలిగి వుంటుంది. తొలినాళ్లలో కొద్ది పరిమాణంలో మార్పులు కలిగి ఉండే చక్కెర నిలువలు ఎలాంటి లక్షణాలనూ చూపవు. ఈ ఫలితంగానే, చాలామంది రోగులు తమకు చక్కెర వ్యాధి ఉందనే సంగతి కూడా గ్రహించలేకపోతుంటారు. చక్కెరవ్యాధి తమకు ఉందని తెలిసిన రోజులు సైతం కచ్చితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించినప్పటికీ నిర్లక్ష్యం చేస్తుంటారు.
మధుమేహం అనేది నిశ్శబ్దంగా చంపే వ్యాధి. నిరంతరం పెరిగే గ్లూకోజ్ స్థాయి దీర్ఘకాలంలో గుండె, కిడ్నీ, నరాలు, కళ్ల రుగ్మతలకు దారి తీయవచ్చు.
ప్రస్తుతం ప్రపంచ మధుమేహ దినోత్సవ నేపథ్యం ‘మధుమేహంపై దృష్టి సారించండి’ ద్వారా ముందుగానే టైప్ 2 మధుమేహం గుర్తించడానికి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటుగా చికిత్స తీసుకోవడం ద్వారా అది చూపే తీవ్ర ప్రభావాలను తగ్గించడం లక్ష్యంగా చేసుకుంది.
మధుమేహ సంబంధిత సమస్యలలో డయాబెటిక్ రెటినోపతి ఒకటి. దీనివల్ల చూపు కోల్పోవడంతోపాటు శాశ్వత అంధత్వానికీ దారి తీయవచ్చు. మధుమేహంతో బాధపడుతున్న ప్రతి ముగ్గురులో ఒకరు డయాబెటిక్ రెటినోపతితో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలోని మధుమేహ రోగులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం వుంది. డయాబెటిక్ రెటినోపతికి సంబంధించిన చికిత్సలో ప్రధానంగా కనిపించేది సమర్థవంతమైన నియంత్రణ. సమర్థవంతమైన ప్రాథమిక సంరక్షణ చర్యలు అద్భుత ఫలితాలను అందిస్తాయి.
అత్యాధునిక సంరక్షణ సదుపాయం అనేది అత్యంత సమర్థవంతమైన ఖర్చు నుంచి వేరుచేయాల్సిన అవసరం లేదనే వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్పెషాలిటీలలో ఒకటి ఆప్తమాలజీ. కమ్యూనిటీ ఆప్తమాలజీ తృతీయ స్థాయి సేవలను గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకువెళ్లాయి. దీని వెనుక స్వభావం మరియు సృజనాత్మక ఆప్తమాలజీ, సాంకేతిక, ఆవిష్కరణను కూడా అందించాయి. అత్యాధునిక ఆవిష్కరణలు ఉన్నప్పటికీ ప్రైమరీ కేర్ ఫిజీషియన్ డయాబెటిక్ కంటి రోగాలను నివారించడంలో అత్యంత కీలకం. పొగ తాగడాన్ని నిరోధించడానికి అవసరమైన కౌన్సిలింగ్ చేయడం, మధుమేహ నియంత్రణ, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవడం అనేవి డయాబెటిక్ రెటినోపతి నివారణకు అతి ముఖ్యమైన అంశాలు.
మారుమూల పల్లెలకు సాంకేతికత అనేది అందిన ఓ వరం. ఓ మొబైల్ యాప్ ద్వారా ఇప్పుడు రెటినోపతి, కాటరాక్ట్, గ్లూకోమాను కనుగొనవచ్చు. రీడింగ్, ఊహాజనిత చిత్రాలు వంటివి బ్యాక్ ఎండ్ ఆప్తమాలజీ సేవలైన ఈ తరహా యాప్‌లకు ఆధారం.
మధుమేహన్ని ప్రారంభంలోనే నివారించడానికి స్క్రీనింగ్ ప్రాముఖ్యతను తెలుపడంతోపాటుగా ఈ పరీక్షలను చేయించుకోవడానికి వారు ఆసక్తి చూపేలా చేయడం ద్వారా ఈ తీవ్రమైన రోగాన్ని నివారించడంలో మన వంతు పాత్ర పోషించాల్సి వుంది.

-డా శ్రీదేవి పాలడుగు