సంజీవని

థైరాయిడ్ సమస్య.. హోమియోతో సరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థైరాయిడ్ గ్రంథి మానవ శరీరంలో అతి ప్రధానమైనది. థైరాయిడ్ గ్రంథి శరీరంలోని జీవక్రియలన్నింటిపై ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ గ్రంథి నాలుకకు మొదట్లో గొంతు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఈ గ్రంథి పిట్యూటరీ గ్రంథి ఆధీనంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి ముఖ్యంగా మూడు హార్మోన్లను విడుదల చేస్తుంది. అవి థైరాక్సిన్, ట్రైఐడో థైరోనిన్ మరియు కాల్సిటోనిన్. ఈ హార్మోన్లు శరీరంలోని జీవక్రియల సమతుల్యతను కాపాడుటలో ప్రధాన పాత్ర వహిస్తాయి. థైరాయిడ్ గ్రంథిలో ముఖ్యంగా రెండు తేడాలు చోటుచేసుకుంటాయి. ఒకటి టి3, టి4 తగ్గి, టి.ఎస్.హెచ్ పెరగడం, దీనినే ప్రైమరీ హైపోథైరాయిడిజమ్ అంటారు. అలాగే టి.ఎస్.హెచ్. తగ్గడం లేదా నార్మల్‌గా ఉండి టి3, టి4 తగ్గడం. దీనినే సెకండరీ హైపోథైరాయిడిజమ్ అంటారు. రెండవది టి3, టి4 పెరగడంవలన హైపర్ థైరాయిడిజమ్ వస్తుంది.
థైరాయిడ్ సమస్యల్ని గుర్తించనట్లయితే స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులు, మానసిక ఆందోళన, ఆత్రుత, వెంట్రుకలు ఊడటం, సెక్సువల్ డిస్‌ఫంక్షన్, సంతాన లేమి తదితర ఆరోగ్య సమస్యలు వచ్చిపడే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్స్‌వల్ల పిల్లల్లో గుండె, మెదడు పెరుగుదల మామూలుగా ఉంటుంది. సరియైన సమతుల్యత- శరీర పెరుగుదలకు థైరాయిడ్ గ్రంథి అవసరం చాలా ఉంటుంది. కొన్ని కారణాలవల్ల థైరాయిడ్ గ్రంథిలో వాపు, ఇన్‌ప్లమేషన్ హార్మోన్స్ ఎక్కువ కావడం లేదా తక్కువ కావడంవలన థైరాయిడ్ గ్రంథిలో మార్పులు చోటుచేసుకుంటాయి.
థైరాయిడ్ జీవక్రియలకు అవసరమైన ముఖ్యమైన గ్రంథి. ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథి పనిచేయదో అది శరీరంలోని ప్రతీ జీవక్రియపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా బరువు, మానసిక ఆందోళన, శక్తి స్థాయిలపై ప్రభావం చూపిస్తుంది.
హైపర్ థైరాయిడిజమ్.. థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ అయినపుడు దానిని హైపర్ థైరాయిడిజమ్ అంటారు.
లక్షణాలు.. -ఆకలి బాగా ఉంటుంది కానీ బరువు తగ్గుతారు. స్ర్తిలలో ఋతుక్రమం తప్పుట, వెంట్రుకలు రాలిపోవుట.
-నిద్ర లేకపోవడం, గుండెలో దడలాగా అనిపించటం.
-్థరాయిడ్ గ్రంథి భాగం వాచి నొప్పి ఉన్నప్పుడు థైరోటాక్సికోసిస్ అంటారు. దీనినే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. ఇది ముఖ్యంగా 30 సంవత్సరాలు పైబడిన స్ర్తిలలో ఎక్కువగా కనిపిస్తుంది.
- కోపం, చికాకు, నీరసం, అలసట, ఉద్రేకం, నాడీవేగం పెరగటం, కాళ్లు, చేతులు వణుకుట, ఎక్కువ వేడిని భరించలేకపోవుట, చెమటలు పట్టుట, నీటి విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
-ఆహారం మామూలుగా తీసుకున్నా, ఎక్కువగా తీసుకున్నా బరువు కోల్పోవడం అనేది హైపర్ థైరాయిడిజమ్‌కు సూచన.
హైపోథైరాయిడిజమ్
టి3, టి4 హార్మోన్ల ఉత్పత్తి కొన్ని కారణాలవల్ల తగ్గిపోతుంది. దీనిని హైపోథైరాయిడిజమ్ అంటారు.
లక్షణాలు.. - నీరసం, బద్ధకం, బరువు పెరగటం, ముఖం వాచినట్లుండటం, జుట్టు రాలడం, స్ర్తిలలో ఋతుక్రమం తప్పటం, చర్మం పొడిబారినట్లుండటం, మలబద్ధకం, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
-కొలెస్ట్రాల్ సాధారణ స్థాయికంటే ఎక్కువగా ఉండటం, ఆహారం తగ్గించినా, వ్యాయామం చేసినా, కొలెస్టరాల్ తగ్గించే మందులు ఉపయోగించినా కూడా సాధారణ స్థాయికి రాకపోవడం హైపోథైరాయిడిజమ్‌కి సూచనగా భావించవచ్చు.
- వెంట్రుకలు ఊడిపోవడం అనేది థైరాయిడ్ సమస్యలో కనిపించే ప్రధాన లక్షణం.
- చర్మము మందంగా, ఎండిపోయినట్లుగా అవుతుంది.
- కండరాలు, కీళ్ళనొప్పులు, చేతుల్లో నీరసం, చేతిలో కార్పల్ టనె్నల్, కాళ్లలో టనె్నల్ సిండ్రోమ్‌లు వచ్చే అవకాశం ఎక్కువ అవడం.
- మెడ వాచినట్లుగా అనిపించడం, టర్టిల్‌నెక్స్ లేక నెకెటిస్‌తో పాటు అసౌకర్యంగా, గొంతు బొంగురు పోవుట, థైరాయిడ్ గ్రంథి బయటకు కనిపించేవిధంగా పెద్దగా అవడం.
-మలబద్ధకం, విరేచనాలు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఎక్కువగా హైపర్ థైరాయిడిజమ్‌లో ఉంటాయి.
-తక్కువ కొవ్వు పదార్థాలున్న, క్యాలరీలున్న ఆహారం తీసుకోవడంతోపాటు తగిన శారీరక వ్యాయామం చేస్తున్నప్పటికీ బరువు కోల్పోకపోవడం లేక బరువు పెరగకపోవడం జరుగుతుంది.
నిర్థారణ.. రక్తపరీక్షలు చేయడం ద్వారా టి3, టి4, టిఎస్‌హెచ్ లెవెల్స్ తెలుసుకోవచ్చు. థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేయడం ద్వారా రోగ నిర్థారణ చేసుకోవచ్చు.
మందులు.. ముఖ్యంగా ఐయోడిన్, లైకోపోడియం, ఎడ్రినలిన్, థైరాయిడినమ్, కాల్కేరియా కార్బ్, ట్యుబర్కులినం, బ్రోమియం, కోనయం, కాల్కేరియా ఫ్లోర్, స్పాంజియా, లేపిస్, ఆల్బా, కార్బో అనిమాలిస్ మరియు సెపియా వంటి కొన్ని మందులను లక్షణ సముదాయాన్ని పరిగణనలోకి తీసుకొని వైద్యం చేసిన యెడల థైరాయిడ్ నుండి ఉపశమనం పొందవచ్చు.