సంజీవని

ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎందుకు జరుగుతున్నాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శక్తిని సమకూర్చడానికి, శరీరోష్ణాన్ని సక్రమంగా ఉంచడానికి కార్బోహైడ్రేట్లు, కొవ్వులు వంటివి శరీరంలో దహించబడుతుంటాయి. ఈ దహన ప్రక్రియని ‘ఆక్సిడేషన్’ అంటారు. ఇందుకు ‘ఆక్సిజన్’ కావాలి. శ్వాసించడం ద్వారా లోపలకు ప్రవేశించిన ఆక్సిజన్ అందుకు తోడ్పడుతుంది. దహన ఫలితంగా ఏర్పడే కార్బన్‌డయాక్సైడ్ నిశ్వాసలో బయటకు వెళ్లిపోతుంటుంది.
శ్వాస కార్యక్రమాల్ని ముక్కు, ఫారింక్స్ లేక గొంతు, శ్వాసపేటిక, శ్వాసనాళము (ట్రాకియా), శ్వాసనాళము (బ్రాంకై), ఊపిరితిత్తులు, కండరాలు నిర్వహిస్తాయి.
ముక్కు, కార్టిలేజ్ అనే మెత్తని ఎముకతో నిర్మితమవుతోంది. ఒక సెప్టెమ్‌లో రెండు భాగాలుగా అది విభజింపబడి వుంటుంది. దానికి రెండు ప్రక్కలా శంఖాల వంటి నిర్మితాలున్నాయి. వాటికవతల శల్య నిర్మితాలైన గుహలవంటి ఖాళీ ప్రదేశాలున్నాయి. వీటిని సైనస్‌లంటారు. ఇవి వేడి గాలితో నిండి వుంటాయి. వీటికి, నాసికా గహ్వరాలకి (నాస్ట్రిల్స్)కి సంబంధముండడంతో వీటిలో క్రిమిదోషాలు ఏర్పడుతుంటాయి. దీనినే ‘సైనుసైటిస్’ అంటారు. ముక్కులోపలి భాగంలో ‘మ్యూకస్’ పొర వుంటుంది. మ్యూకస్ పొరనుంచి తేమ, వేడిమి గాలిలోకి ప్రవేశిస్తాయి. శ్వాసాంగాల్ని పొడి, తడి గాలి నుంచి కాపాడడానికి ఇది చాలా అవసరం. ఈ సౌకర్యాలు లేని నోటితో గాలి పీల్చడంవల్ల జలుబు, రొమ్ము వ్యాధులకు తేలికగా గురవుతాం.
ముక్కులోంచి ప్రవేశించిన గాలి- గొంతు గుండా శ్వాసనాళాలలోకి ప్రవేశించి శ్వాసాంగాలలో శాఖోపశాఖలుగా చీలిపోయే శాఖల ద్వారా శ్వాసంగంలోకి చేరుతుంది.
ఊపిరితిత్తులు రెండు తిత్తులుగా వక్షస్థానంలో రెండు వైపులా ఉంటాయి. వాటిమధ్య గుండె ఉంటుంది. శ్వాసాంగాలు నునుపైన పొరలతో కప్పబడి వుంటాయి. ఈ పొరలను ‘ప్లూరా’లంటారు. ఊపిరితిత్తులు పెద్దవి, చిన్నవి అవుతున్నపుడు పరిసర భాగాలలో రాపిడి జరగకుండా ఉంటుంది రెండు పొరల ఫ్లూరా! ఇవి ఇన్‌ఫ్లేమ్ అయితే ‘ప్లూరసి’ అంటారు.
ఊపిరితిత్తుల లోబ్స్ అన్నింటిలో బ్రాంకస్ శాఖలు విస్తరించి ఉంటాయి. ఈ శాఖలు ఊపిరితిత్తులలోని బ్రాంకియోలనే చిన్న సంచీలలో అంతమవుతాయి. ప్రతీ సంచీ గోడా చిన్న చిన్న బుడగలుగా సాగి ఉంటుంది. ఈ బుడగల్ని ఆల్వియోలస్ అంటారు. ఇవే గాలి సంచులు. వీటి గోడలు చాలా పల్చగా వుంటాయి. వాటి చుట్టూ పల్చని గోడలున్న కేపలరీస్ రక్తనాళాలవల్ల ఉంటుంది. గాలి సంచులలో వున్న ఆక్సిజన్‌ని, కేపిలరీ రక్తనాళాలలో వున్న హిమోగ్లోబిన్‌లో పీల్చబడి, రక్తం ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు చేరుతుంటుంది. వీన్స్ ద్వారా శరీర భాగాలనుంచి వచ్చిన కార్బన్‌డయాక్సైడ్ గాలి సంచులనుంచి బయటకు వెళ్లిపోతుంది నిశ్వాసతో.
సాధారణంగా నిశ్వాస తరువాత శ్వాసాంగాలలో 3000 ఘన సెంటీమీటర్ల గాలి మిగిలి వుంటుంది. వ్యక్తి ఉచ్ఛ్వాసంలో 500 గాలిని ఒకసారి లోపలికి పీల్చుకుంటుంటుంది. అందులో 150 ఘ.సెం.మీ. గాలి ముక్కు, గొంతు, శ్వాసనాళము లాంటి భాగాలలో ఉండిపోతాయి. కేవలం 350 ఘ.సెం.మీ. గాలి సంచులలో ప్రవేశిస్తుంది. దీర్ఘమైన నిశ్వాసలో 1500 ఘ.సెం.మీ. గాలి బయటకు వెళ్లిపోతుంది. ఇలా ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్ లోపలికి, కార్బన్‌డయాక్సైడ్ బయటకు వెళ్తుంటుంది. శ్వాసనాళాలే కాదు, ఊపిరితిత్తులకూ రకరకాల అనారోగ్యాలు కలిగే అవకాశముంది. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస దెబ్బతినే అవకాశముంది. అందుకే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.