సంజీవని

పిల్లలకు స్కూలంటే భయమా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మళ్లీ పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. కొత్త డ్రెస్సులు, బూట్లు, పుస్తకాలతో పిల్లలు పాఠశాలలకు ఎంతో ఉత్సాహంతో పరిగెడుతుంటారు. మరికొందరు పిల్లలు స్కూలుకు వెళ్లమని మారాం చేస్తుంటారు. గత సంవత్సరం మావాడు బాగానే వెళ్లాడు కదా.. ఈ సంవత్సరం ఎందుకు వెళ్లడంలేదని తల్లిదండ్రులు అనుకుంటారు. పిల్లలను కోపంతో బెదిరించి ఎలాగోలాగా మళ్లీ స్కూలుకు పంపిస్తారు. కానీ, స్కూలుకు వెళ్లకపోవడానికి గల కారణాలను చాలామంది తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. పిల్లలు ఇలా ఇష్టం లేకుండా పాఠశాలకు పోవటం వలన మానసిక ఒత్తిడికి గురై చదువులో రాణించలేకపోతున్నారు. వీరికి పాఠశాల అంటేనే భయంతో వణికిపోతుంటారు. పాఠశాలను వీరు జైలులాగా భావిస్తుంటారు. ఇటువంటి స్కూలు ఫోబియా వున్న పిల్లల యెడల తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పిల్లలు పాఠశాలలను దేవాలయాలుగా భావించి చక్కగా విద్యాభ్యాసం కొనసాగించేలా చేయవచ్చు.
పిల్లలు బాగా ఉన్నత చదువులు చదువాలని మంచి ఉద్యోగం చేయాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ, పిల్లలకు చదువుతోపాటుగా సామాజిక సేవ, ఆధ్యాత్మికత, యోగ, ఆటలు కూడా నేర్పే ప్రయత్నం చేయాలి. దీనివల్ల పిల్లలకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

స్కూలు ఫోబియా కారణాలు
పాఠశాలలో మాస్టరు చదవమని దండించడం, పాఠశాలలో సదుపాయాలు సరిగా లేకపోవటం.
పాఠశాలలో ఆటలకు, సృజనాత్మకతకు సమయం కేటాయించక అస్తమానం చదవమని బెదిరించటం.
తోటి విద్యార్థులకంటే చదువులో వెనకబడటంతో టీచర్ నిత్యం మందలించటం.
కొత్తగా స్కూలుకు వెళ్ళే చిన్న పిల్లలు తల్లిదండ్రులను ప్రథమంగా వదిలి వెళ్లటం వలన భయంతో ఏడుస్తుంటారు.
పాఠశాలలో తోటి విద్యార్థులు దౌర్జన్యపూరితంగా నిత్యం వేధించటం.
పాఠశాలలో కఠినమైన నిబంధనలు ఉండటం.

భయం - లక్షణాలు
చెమటలు పట్టడం, కాళ్లు చేతులు వణుకుడు రావడం
ఆకలి తగ్గి ఆహారం సరిగా తీసుకోకపోవడం
ఆలోచనలతో నిద్ర పట్టకపోవడం.
మాటలు తడబడటం, ఎవరితో సరిగా మాట్లాడలేకపోవడం
చదువుమీద శ్రద్ధ లేకపోవడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం
వీరి ప్రవర్తన బాధ్యతారహితంగా ఉంటుంది.
ఏ పనిపై శ్రద్ధ పెట్టకపోవడం, పనులను వాయిదా వేయటం
ఏకాగ్రత లోపించడం, తలనొప్పి రావడం
తమలో తామే బాధపడటం వంటి లక్షణాలతో ఉంటారు.
ఏం చేయాలి?
పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే భయపడుతున్న కారణాలు తెలుసుకొని, వారిని నెమ్మదిగా నచ్చచెప్పాలి.
పాఠశాల యాజమాన్యంతో, పాఠశాలలో బోధించే టీచర్స్‌తో మాట్లాడి వివరణ తీసుకోవాలి.
పాఠశాలకు వెళ్లాలంటే భయపడుతున్నారని పాఠశాలకు పంపుట మానుకోవద్దు. అలా చేస్తే వారికి ఎప్పటికీ పాఠశాలంటే భయమే ఉంటుంది.
వారికి ఉన్న సందేహాలను, భయాలను తొలగించి నచ్చచెప్పి పాఠశాలకు దగ్గర ఉండి కొన్ని రోజులు తీసుకెళ్లాలి. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉండాలి.
వారికి పాఠశాలమీద శ్రద్ధ కలిగించే ఆదర్శవంతమైన మంచి మాటలు చెప్పి స్కూలుకు పంపే ప్రయత్నం చేయాలి.
చికిత్స
హోమియో వైద్య విధానంలో ప్రతి ఔషధం మానసిక లక్షణాలతో కూడి ముడిపడి వుంటుంది. కావున మానసిక రుగ్మతలకు హోమియో ఒక వరం. మందుల ఎంపికలో కూడా మానసిక శారీరక తత్వాన్ని ఆధారంగా చేసుకొని మందులను సూచించడం జరుగుంది కనుక సమూలంగా రుగ్మతలను నయం చేయడం సాధ్యం అవుతుంది.
మందులు
అర్జెంటం నైట్రికం: వీరు ఏ పని తలపెట్టాలన్నా గందరగోళం పడిపోతుంటారు. రేపు స్కూలుకు వెళ్లాలంటే ఈ రోజు రాత్రి వీరికి నిద్రపట్టదు. పాఠశాల సమయానికంటే ముందే స్కూలుకు వెళ్లాలనుకుంటారు. మానసిక స్థాయిలో ఈ రోగి పంచదార, తీపి అంటే ప్రాణం. వీరు లిఫ్ట్‌లో వెళ్లాలన్నా, రోడ్డుమీద నడవాలన్నా, వంతెన దాటాలన్నా భయాందోళనలకు గురౌతారు. ఇటువంటి లక్షణాలుండి స్కూలంటే భయపడేవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
ఎకోనైట్: స్కూలుకు వెళ్ళే ముందు ‘టెన్షన్’ పడేవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది. వీరికి మానసిక స్థాయిలో ఆందోళన, అస్తిమితం, ఉద్వేగపూరితమైన భయానికి లోనవుతారు. వీరికి నాడివేగంగా, బలంగా కొట్టుకుంటుంది. వీరికి జన సమూహం, చీకటి అన్నా ఎక్కువగా భయం. భయంతో వీరు నిద్రలేమితో బాధపడుతుంటారు. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చు.
జెల్సిమియం: విద్యార్థులు స్కూలంటేనే భయంతోపాటుగా తత్తరపడిపోతారు. తత్తరపాటుతో విరేచనాలు కావడం ఈ రోగి యొక్క ప్రత్యేక లక్షణం. పాఠశాలంటే వణుకు, దడ, తలనొప్పి మొదలవుతుంది. మూత్ర విసర్జన అనంతరం తలనొప్పి తగ్గిపోవుట ఈ రోగియొక్క మరొక విచిత్ర విశిష్ట లక్షణం. ఇలాంటి లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
ఈ మందులే కాకుండా కాల్కేరియా ఫాస్, జెన్సింగ్, సెఫియా, ఫాస్ఫరస్, బెల్లడోనా, కాల్కేరియాకార్బ్, సల్ఫర్, జింకంమెట్, ఆరంమెట్ వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి డాక్టర్ సలహా మేరకు వాడుకొని స్కూలు ఫోబియా (్భయం) నుండి విముక్తి పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646