సంజీవని

చినుకులు తెచ్చే చింతలతో జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షం పడగానే గుంటలలో నీరు నిలువ వుండి, మురికినీరుగా మారిన తరువాత ఆ నీటిలో దోమలు నివాసాలు ఏర్పరచుకుని విపరీతంగా వృద్ధి చెందుతాయి.
దోమకాటువల్ల వచ్చే వ్యాధుల్లో తీవ్రమైనవి డెంగ్యూ, చికున్ గున్యా, మెదడువాపు, మలేరియా. ఈ వ్యాధులను సకాలంలో నయం చేయకపోతే మరణాలు కూడా సంభవిస్తాయి.
అలాగే వర్షాలు పడిన చోట నీరు కలుషితం కావడంతో అతిసార వ్యాధి సంభవిస్తుంది. ఇటువంటి వ్యాధులకు హోమియా బాగా ఉపయోగపడుతుంది.
మలేరియా
మలేరియా జ్వరం ప్రతి ఏటా ఎక్కువగా వర్షాలు పడిన తరువాత దోమల వల్ల వ్యాధి చెందుతుంది.
కారణాలు: మలేరియా ప్రొటోజోవా జీవి అయిన ప్లాస్మోడియం ద్వారా సోకుతుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు: జ్వరం తీవ్రంగా ఉండటంతోపాటు చలి ఎక్కువగా ఉంటుంది.
జాగ్రత్తలు: దోమలను నివారించడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు. దోమతెరలు వాడాలి. నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలి.
నివారణ: చైనా, చినూనమ్ ఆర్స్, మలేరియా, అఫిసినాలిస్, సల్ఫర్ అనే మందులు మలేరియా నివారణకు పనిచేస్తాయి.
అతిసార
వర్షాకాలంలో సాధారణంగా అతిసార కలుషిత నీరు ద్వారా ఎక్కువగా ప్రబలుతుంది. ఈ వ్యాధికి గురైన వారికి ఉన్నట్లుండి వాంతులు, విరేచనాలు అవుతాయి.
కొందరిలో జ్వరం రావడం, విపరీతమైన కడుపునొప్పి, నోరు ఎండిపోవడం, కాళ్లు లాగడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధిలో ప్రధానంగా వాంతులు విరేచనాలు త్వరగా తగ్గించడానికి మందులు వాడాల్సి వుంటుంది.
వ్యాధి లక్షణాలు
- విరేచనాలు, వాంతులు ఉన్నట్లుండి ఒకేసారి పెద్ద మొత్తంలో అవుతాయి.
- తద్వారా శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ స్థితి ఏర్పడుతుంది.
- ఇలాంటి స్థితిలో చర్మాన్ని పైకి లాగి వదిలితే అలాగే ఉండిపోతుంది.
- వృద్ధుల్లో చర్మం ముడతలు పడి ఉంటుంది.
- కళ్లు గుంటల్లాగా ఉండటంతోపాటు చాలా నీరసంగా ఉంటుంది.
- అతిసార వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నపుడు నాడి వేగంగా ఉంటుంది.
- కొన్ని సందర్భాల్లో నాడి తెలియకుండా ఉంటుంది.
- రక్తపోటు తగ్గిపోతుంది. రక్తపోటు నమోదు చేయలేని స్థితికి కూడా జారిపోతుంది.
- శరీరం చల్లబడి రోగి అపస్మారకస్థితిలో ఉండి, కోమాలోకి వెళ్లిపోయి మరణం సంభవిస్తుంది.
నివారణ
- అతిసార వ్యాధివల్ల శరీరం నీటిని, లవణాలను అత్యధికంగా కోల్పోతుంది. కనుక ఈ వ్యాధికి గురైన రోగికి వెంటనే ద్రవ పదార్థాలు ఇవ్వాలి.
- కొబ్బరి నీరు, మంచినీరు, మజ్జిగ మొదలైనవి ప్రారంభం నుంచి ఇవ్వాలి.
- డీహైడ్రేషన్ నివారణకు కాచి చల్లార్చిన ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల పంచదార, చిటికెడు ఉప్పు కలిపి ఇవ్వాలి. లేదా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇవ్వాలి.
- అతిసార వ్యాధికి గురైన వ్యక్తి నోటితో ద్రవ పదార్థాలు తీసుకోగలిగినంతవరకూ సెలైన్ అవసరం రాదు.
- నోటితో ఏమీ తీసుకోలేని స్థితిలో ఇంట్రావీనస్ ద్వారా సెలైన్‌ను డాక్టర్ల సమక్షంలో ఇవ్వవలసి ఉంటుంది.
మందులు
హోమియో మందులను లక్షణాల ఆధారంగా వాడవలసి వుంటుంది. ముఖ్యంగా పోడోపైలం, ఆర్సినిక్ ఆల్బ్, కాంఫర్, వెరాట్రం ఆల్బం, చైనా, ఇపికాక్ వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడితే అతిసార వ్యాధి నివారణ అవుతుంది.

***
చిగున్ గున్యా....
చికున్‌గున్యా ప్రాణాంతక వ్యాధి కానప్పటికీ మనిషిని కదలలేని స్థితికి చేర్చి, శారీరకంగా, మానసికంగా కృంగిపోయేట్లు చేస్తుంది.
లక్షణాలు
వైరస్ సోకిన వెంటనే అధిక జ్వరం, తీవ్రమైన కీళ్లనొప్పులు ఉండి మనిషి కదలలేని స్థితి ఏర్పడుతుంది. తలనొప్పి, నిద్రలేమి బాధిస్తాయి. వ్యాధి తీవ్రత 5నుంచి 7 రోజులవరకూ వుంటుంది.
జాగ్రత్తలు
శరీరంలోని ద్రవాలు, లవణాలు అన్నీ తగ్గిపోతాయి. కనుక ఆహార పానీయాలు సక్రమంగా వుండేవిధంగా చూడాలి. లేకపోతే ప్రాణాపాయానికి దారితీస్తుంది.
దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలి. నీళ్లు నిలువ ఉండకుండా జాగ్రత్త వహించాలి.
నివారణ
వ్యాధి సోకకముందు యుఫటోరియం పర్ఫోరేటం అనే మందును వారానికి ఒకరోజు మూడు పూటలు తీసుకోవాలి. ఇలా వ్యాధి ప్రబలి ఉన్నంతకాలం తీసుకోవాలి. వ్యాధి సోకిన తరువాత ఆయా లక్షణాలను బట్టి రస్టాక్స్, బ్రయోనియా అనే మందులను రోజుకు మూడుసార్లు మూడు రోజులు వాడితే వ్యాధి తీవ్రత తగ్గుతుంది.
**
డెంగ్యూ..
లక్షణాలు:
జ్వరం, ఎముకల నొప్పులు, కళ్ళల్లోనుంచి నీరు కారడం, కళ్ళు కదలించడం కష్టంగా మారడం, ఆకలి తగ్గి వాంతి అయ్యేట్లు ఉండటం, శరీరంపై దద్దుర్లు, పొక్కులు రావడం, ముక్కలోంచి రక్తం పడటం, రక్తవిరేచనాలు, తలనొప్పి విపరీతంగా ఉండటం.
కారణం: డెంగ్యూ వైరస్, ఏడిస్ ఈజిప్ట్ దోమలు.
డెంగ్యూ సోకిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి చేర్చాలి. రోగికి తరచూ ద్రవ పదార్థాలు ఇవ్వాలి. అవసరమైతే రక్తమార్పిడి చేయాలి.
జాగ్రత్తలు
దోమలు నిలువ ఉండే ఆవాసాలైన నీళ్ల తొట్టెలు, టైర్లు, పాడైపోయిన కూలర్లలోని నీళ్లు నిలువ ఉండకుండా వాటిని తీసివేయాలి.
మందులు
డెంగ్యూ వ్యాధి నివారణకు జల్సీమియం అనే మందును వ్యాధి రాకముందు ఒకరోజు మూడు మోతాదులు తీసుకుంటే వ్యాధి సోకకుండా వుంటుంది. వ్యాధి సోకితే యుఫటోరియం పర్ఫోటం అనే మందును వాడటంవల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాధి నివారణ కూడా త్వరగా జరుగుతుంది.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646