సంజీవని

కాళ్ళూ, చేతులూ తిమ్మిర్లా? పిక్కలు పట్టేస్తున్నాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరమంతా నిర్విరామంగా రక్తప్రసరణ జరుగుతుంటుంది. రక్తం ద్వారానే శరీరంలోని అన్ని కణాలకు ఆహారం, ఆక్సిజన్ అందుతుంటాయి. వీటిలో కణాలకు ఏది అందకపోయినా ప్రమాదమే. అందుకే రక్తప్రసరణ అన్ని కణాలకు, గుండెకి ఎంత దూరంలో ఉన్నా నిర్విఘ్నంగా అందుతుండాలి. ఎక్కడ రక్తనాళాలలో అడ్డంకులు వచ్చినా ప్రమాదకరమే.
గుండెనుంచి రక్తనాళాలు శరీర భాగాలకు రక్తాన్ని చేర్చడానికి ప్రారంభమై - శాఖలు, ఉపశాఖలుగా చీలి, ఆఖరులో మరీ సన్నని నాళాలు కాపిలరీస్‌గా మారి కణాలకి రక్తాన్ని చేరుస్తుంటాయి. ఈ సన్నటి రక్తనాళాలు మూసుకునే ప్రమాదాలూ ఎక్కువ.
ఎక్కడ రక్తనాళాలు మూసుకుపోయి, ఆ తర్వాతి శరీర భాగాలకు రక్తమందదో, ఆ ప్రాంతాలకు రక్తం అందదో ఆ ప్రాంతాలు కుళ్ళిపోతాయి. దానినే ‘గాంగ్రీన్’ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. చుట్టుప్రక్కల కణాలకి సోకుతుంది. అందుకని ‘గాంగ్రీన్’ వచ్చిన అవయవాల్ని శరీరంనుంచి తొలగిస్తారు. ముఖ్యంగా ఈ స్థితి డయాబెటిస్‌ని అదుపులో ఉంచుకోలేని వాళ్ళలో కనిపిస్తుంది.
కొంతమందిలో ఆగి ఆగి పిక్కలు పట్టేస్తూంటాయి. అంటే వాళ్ళలో రక్తప్రసరణ సరిగ్గా జరగడంలేదన్నమాట! నడుస్తున్నపుడు నొప్పి వస్తుంటే నడక మానేయకండి. వైద్యుడి సలహాతో నడక వ్యాయామాన్ని కొనసాగించండి. కాలి క్రింది భాగానికి రక్తప్రసరణ క్రమంగా మెరుగవుతుంది.
కొన్ని అలవాట్లతో మనం కోరి కొనుక్కుంటున్నాం జబ్బుల్ని. ధూమపానం అలవాటుంటే వెంటనే మానేయండి. ధూమపానం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా సన్నటి రక్తనాళాలు! చిన్నప్పటినుంచి ఈ అలవాటు ఉండడంతో కాలు, పాదం పైభాగంలోని రక్తనాళాలు దెబ్బతిని ఆ ప్రాంతంలో కాలు సన్ననై, నున్నగా నూనె పూసినట్లుగా నల్లగా మారుతుంది. కాలి మీద వెంట్రుకలు రాలిపోతాయి. దీనిని ‘బర్జర్స్ డిసీజ్’ అంటారు. వెంటనే రక్తనాళాల వైద్య నిపుణుణ్ణి కలుసుకుని చికిత్స పొందాలి.
కొందరు ‘పెరిఫెరల్ వాస్క్యులోపతి’తో బాధపడుతున్నామంటారు. పెరిఫెరల్ అంటే చివర్లు.. వాస్క్యులోపతి అంటే రక్తనాళాలలో వచ్చే జబ్బు. అరిచేతులు, అరికాళ్ళకు రక్తప్రసరణ జరగక వచ్చే ఇబ్బందులు! అరిచేతులు, అరికాళ్ళు మొద్దుబారిపోతాయి, తిమ్మిర్లు.. ఈ లక్షణాలు కూడా సాధారణంగా డయబెటిస్ అదుపులో లేనివాళ్లలోనే కలుగుతుంటుంది. ప్రారంభంలోనే గుర్తించి, సరైన చికిత్సని సకాలంలో పొందడం అవసరం.
రక్తప్రసరణ సరిగ్గా లేక ముందు పుళ్లు పడతాయి. అవి త్వరగా మానవు. అటువంటి సందర్భంలో మీరు పాదాల చర్మం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీ వైద్యుడప్పుడు మిమ్మల్ని విశ్రాంతి తీసుకొమ్మని సలహా ఇస్తాడు. తలకన్నా పాదాల ఎత్తు తక్కువగా ఉంచాలి. అపుడు పాదాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. యాంటి బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్‌ని కూడా వైద్యుడి సూచన ప్రకారమే వాడాలి. పిక్కలు పట్టేయడం మరీ ఎక్కువైతే ఒక్కోసారి శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. దానిని వైద్యుడు నిర్ణయిస్తాడు.
ఏది ఏమైనా రక్తనాళాల ఇబ్బందులేమైనా వస్తున్నట్లనిపిస్తే నిర్లక్ష్యం చేయక వెంటనే వైద్యుణ్ణి కలవాలి. ఆయన సలహా మేరకు వైద్యం చేయించుకోవాలి.
గుండె, రక్తనాళాలకు సరాసరి సంబంధముందని గుర్తించాలి. ఒకసారి ఒకదాని ప్రభావం మరోదానిమీద పడుతుంది. అందుకే ఈ లక్షణాల్ని గుర్తించి జాగ్రత్తపడాలి.

డా.రవికుమార్ ఆలూరి చీఫ్ ఇంటర్‌వెన్షనల్, కార్డియాలజిస్ట్, (కిమ్స్) 98480 24638