సంజీవని

రోగుల్లో ధైర్యం పెంచాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో రోగికి కేన్సర్ వస్తే అదేమిటో గుర్తించినా చెప్పేవారు కారు వైద్యులు. రోగి తాలూకు వాళ్ళు ఏమాత్రం రోగికి మేలు జరగాలన్నా రోగ నిర్థారణ ముఖ్యం. రోగి బంధువుల పాత్ర, వైద్యుడి పాత్ర ఇప్పుడు స్పష్టం. రోగిని పరిరక్షిస్తూ, సాధ్యమైనంత సుఖంగా ఉంచుతూ అవసరమైతే రోగిని మరణానికి మానసికంగా సిద్ధం చేయాల్సి వస్తుంది. రోగికి అస్వస్థత గురించి చెబితే కంగారు పడతాడనుకునేవారు. అది అర్థం లేని భయం. కొన్ని చికిత్సలు, రోగ నిర్థారణ పరీక్షలు చేసేప్పుడు రోగికి ఖచ్చితంగా తనకేమి అనారోగ్యమో తెలిసిపోతుంది, మనం ఎంత దాచినా. అందుకని కచ్చితమైన రోగ నిర్థారణ చేసి, చికిత్స చేస్తుండడం వల్ల రోగికి కొంచెమైనా ఉపశమనం కలుగుతుంది.
అధిక రక్తపోటు, ఎంజైనా లాంటి వాటి గురించి ఇప్పుడందరిలో మాధ్యమాలవల్ల అవగాహన పెరిగింది. కొన్ని సందర్భాలలో వాటికి దూరంగా ఉండడానికి జీవన విధానానే్న మార్చుకుంటున్నారు. అనారోగ్యం గురించి తెలీకపోతే ఈ జాగ్రత్తలు పడడం పట్ల ఆసక్తి చూపరు కదా. ఇప్పుడు కాన్సర్‌లంటి ప్రాణాంతకమైన వ్యాధులకూ చికిత్స ఉంది, ప్రారంభ దశలో కనుక్కుంటే. అందుకే రోగ నిర్థారణ చికిత్సల చర్చల్లో రోగినీ భాగస్వామిని చేస్తున్నారు. రోగిలో మానసిక స్థైర్యం పెరగాలి. అప్పుడే అతను లేక ఆమె తట్టుకోగలరు. కాబట్టి రోగికి, తన రోగ నిర్థారణ గురించి తెలియాలి. తెలియకపోవడంవల్ల ఓ విధంగా మోసబోతున్నారు. మీరు ఆలోచించండి- మీకు లేక మీ బంధువు తాలూకు రోగ నిర్థారణ గురించి మీ వైద్యుడు సరిగ్గా చెప్పకపోతే ఎలా స్పందిస్తారు? ఈ వైద్యుడు సరిగ్గా రోగనిర్థారణ చేయలేదని మరో వైద్యుడు దగ్గరకు వెళ్ళడానికి, రోగ నిర్థారణ కచ్చితంగా జరిగి, సరైన చికిత్స సకాలంలో అందాలి.