సంజీవని

అవయవ దానంతో రోగులకు పునర్జన్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతర రంగాలలో అభివృద్ధి సాధించిన విధంగా వైద్య రంగంలోనూ ఎంతో అభివృద్ధిని సాధించాం. ఒక అవయవం పూర్తిగా దెబ్బతిన్నా మరణించకుండా ఆ అవయవ మార్పిడితో పునర్జన్మనిస్తున్నారు.
పాడైపోయిన అవయవాల స్థానంలోకి కొత్త అవయవాల్ని ఎక్కడనుంచి తేగలరు?
కృత్రిమ అవయవాల్ని అమర్చగలిగితే అది వేరే సంగతి. బ్రెయిన్ డెడ్ అయినవాళ్ళు కొన్ని గంటల్లో గుండె కొట్టుకోవడం, శ్వాస కూడా ఆగిపోయి పూర్తి మరణానికి లోనవుతారు.
అందుకని యాక్సిడెంట్లు తలకి దెబ్బతగిలినప్పుడు, బ్రెయిన్ హేమరేజ్‌లాంటివి జరిగినప్పుడు ‘బ్రెయిన్ డెత్’ని సకాలంలో గుర్తించగలగాలి.
రోగిని వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస కల్పిస్తూ టీమ్ ఆఫ్ డాక్టర్స్ పరీక్షించి ‘బ్రెయిన్ డెత్’ని డిక్లేర్ చేస్తారు. అదీ ఒకసారి కాదు, ఆరు గంటల వ్యవధిలో రెండుసార్లు.
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి తాలూకు వాళ్ళు అంగీకరిస్తేనే అవయవదానం లేకపోతే కుదరదు. అందుకని అవయవదానం మీద అందరికీ అవగాహన ఉండాలి.
రక్త సంబంధీకులు అంగీకరిస్తేనే ఓ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తినుంచి గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, లివర్, కళ్ళు, బోన్‌మారోల్లాంటి వాటిని సేకరించి- అవయవాలు ఫెయిలై ఆఖరి దశలో ఉన్నవాళ్ళకి అమర్చి ప్రాణదానం చేస్తారు.
అంటే బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి అవయవదానంవల్ల ఎనిమిది నుంచి పదిమంది మరణ కోరల్లోంచి బయటపడతారు. అంటే పదిమందిలో మరణించబోయే వ్యక్తి అవయవాలు సజీవంగా ఉంటాయి. లేకపోతే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి సంపూర్ణ మరణంతో ఆ అవయవాలు మట్టిలో కలవడమో, బూడిద కావడమో జరుగుతుంది. అలా వాటిని వ్యర్థం చేయడంకన్నా మరికొందరిలో జీవింపజేయడం గొప్ప మానవత్వం కదా?
అందుకని డాక్టర్లలో అవగాహన పెరగడంవల్ల బ్రెయిన్‌డెడ్ పేషెంట్‌లను సకాలంలో గుర్తించగలరు. అలాగే అవయవ మార్పిడి ఎవరికి అవసరమో కూడా గుర్తించగలరు. రోజూ ఎంతమంది యాక్సిడెంట్లలో బ్రెయిన్‌డెడ్ అయి మరణిస్తున్నారో, ఎన్ని అవయవదానాలవుతున్నాయో గమనించండి. కారణం అవగాహనా లోపమే!
ప్రజలలో అవగాహన బాగా ఉన్నప్పుడు అవయవదానాల సంఖ్య పెరుగుతుంది. అవయవదానాలు పెరిగితే అవయవాలు దెబ్బతిని మరణించేవారి సంఖ్య తగ్గుతుంది. అందరూ డోనర్స్‌గా ప్రకటించుకుంటే, అనుకోకుండా ఏదైనా ప్రమాదాలు జరిగితే ఎవరైనా దాతలు కావచ్చు. అందుకు ఆరోగ్యంగా ఉండడం కూడా ముఖ్యం.
ఇక్కడ మరో సున్నితమైన విషయం వుంది. అవయవదానం చేయాలనుకున్నవాళ్ళందరూ ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పాలి. ఆపత్సమయాల్లో నిర్ణయాలు తీసుకోవలసింది వాళ్ళేగా!
అవయవదానా వశ్యకతం, విధానం లేకపోతే అవయవాలనమ్మి- నమ్మి కాదు అమ్మి- సొమ్ము చేసుకునే వాళ్ళ చేతుల్లో తేలికగా మోసపోయే ప్రమాదముంది. అటువంటివాళ్ళని దూరంగా ఉంచడమేకాదు వాళ్ళ ఉనికి గురించి రక్షక భటులకు చెప్పాల్సిన అవసరం ఉంది.
సాధారణంగా ఈ వ్యాపారం కెడావరిక్ దానాలు.. బ్రెయిన్‌డెడ్ అయిన వాళ్ళు చేసే దానాలలో కాక బ్రతికున్న దాతలు ఇచ్చే అవయవదానాలతో జరుగుతోంది. మూత్రపిండం, లివర్‌లో కొంత భాగం దానం చేయడం లాంటి విషయాలలో ప్రభుత్వం అందుకు ఎన్నో నిబంధనలు విధించింది. లివింగ్ డోనార్ విషయంలో కానీ మనం వాటిని సద్వినియోగపరచుకోవాలిగా? అందుకే అవయవదానం పట్ల అవగాహన అవసరం.
బ్రెయిన్ డెడ్‌ని సకాలంలో గుర్తించలేకపోతే మరణించినవాళ్ళ కళ్ళు, శరీర దానాలు చేయవచ్చు. శరీర దానంలో లభించే శరీరాలను వైద్య విద్యార్థుల బోధనకు ఉపయోగిస్తారు. అవయవదానానికి, శరీర దానానికి మధ్య ఉన్న తేడాని గమనించాలి.

-వేదగిరి రాంబాబు