సంజీవని

ఆహారం ఎలా జీర్ణం అవుతుంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం తీసుకున్న ఆహారం నోటిలో బాగా నమిలిన తర్వాత గొంతులోకి వెళ్తుంది. అక్కడనుంచి మన ప్రయత్నంతో సంబంధం లేకుండా పెరియాలిస్టిక్ కదలికల ద్వారా ఆహార నాళంలో ముందుకు వెళ్తుంది. పెరియాలిస్టిక్ కదలికలంటే ఆహారం వెనుక కండరాలు ముడుచుకుని, దానంతటదే ముందుకు కదులుతుంటుంది. ఆహార నాళం గోడలు, ఓ సన్నటి, నున్నటి, మెత్తటి పొరతో కప్పి ఉంటుంది, లోపలి భాగంలో. ఈ పొర చిరిగితే లోపల పుళ్లు పడ్డట్లు.. అల్సర్స్ అన్నమట.
నోటిలోనే లాలాజలంలోని ఎంజైమ్స్‌తో కలిసి ఆహారం జీర్ణమవడం ప్రారంభిస్తుంది. కడుపులో ఆహారం, హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సిన్ లాంటి రసాయనాలతో కలిసి మెత్తగా మర్దన చేయబడుతుంది. మరి కొంత జీర్ణం- డుయోడినమ్, చిన్నప్రేగులలో జరుగుతుంది. అందుకు ఆ ప్రాంతాలలో కొన్ని జీర్ణ రసాలు కలుస్తాయి. అవి ఎక్కువగా ఉత్పత్తి అయి, జీర్ణాశయగోడల్ని దెబ్బతీస్తే అల్సర్ రావచ్చు.
చిన్నప్రేగులలో ఆహారం- ప్రొటీన్లు, సుగర్స్, కొవ్వులనే ప్రాథమిక మూలకలుగా విభజన చెంది, జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగుల గోడల ద్వారా రక్తంలోకి చేరి- రక్తకణాల ద్వారా శరీరమంతటికి ఆక్సిజన్‌తో బాటు చేరుతుంటుంది. జీర్ణంకాని పదార్థాలు, వ్యర్థాలు పెద్దప్రేగులు, యానస్ ద్వారా బయటకు విసర్జితమవుతాయి. నీరు శరీరంలోకి తిరిగి స్వీకరించబడుతుంటుంది.