సంజీవని

నిదానంగా తింటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఆహారాన్ని తీసుకునేప్పుడు గాలినీ లోపలికి తీసుకోవడంతో త్రేన్పులు వస్తుంటాయి. కాబట్టి తినేటప్పుడు, త్రాగేటప్పుడు ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు. ఎప్పుడూ చూయింగ్ గమ్‌లాంటివి నములుతుండడం, పొగ త్రాగడంలాంటి అలవాట్లవల్లా ఈ లక్షణాలూ పెరుగుతాయి. అందుకని వీటిని మానుకోవాలి.
మామూలుగా లోపలికి ప్రవేశించిన గాలి ఆహార నాళంలో ముందుకు కదలి, రెక్టల్ గాస్‌లా మలద్వారం నంచి బయటకు వెళ్లిపోవాలి. కానీ కడుపులోంచి గొంతు, నోటి ద్వారా బయటికి వస్తోంది. ఇలా వాయువు వెనుక్కి రావడానికి కారణమవుతున్న పరిస్థితులన్నింటినీ దూరంగా ఉంచాలి.
నోటి ద్వారా లోపలికి చేరిన గాలి కడుపు, ప్రేగులలో నిలువ ఉండడంతో కడుపు ఉబ్బరిచినట్లనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాలలో ఆహార నాళంలో ఆహారం జీర్ణమవడానికి కారణమయ్యే రసాయనిక చర్యలవల్లా లోపల, వాయువు పుడుతుంటుంది. ఇలా కడుపు ఉబ్బరించినట్లనిపిస్తుంటుంది. ఇలా లోపలి వాయువులుండడాన్ని ‘బోర్మోరిగ్మి’ అంటారు.
రెక్టల్ గాస్‌లో ప్రధానంగా అయిదు రకాల వాయువులుంటాయి. అవి నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్‌డయాక్సైడ్, మిథేన్. కొలాన్ ప్రాంతంలోని సూక్ష్మజీవులు జీర్ణంకాని పదార్థాల్ని పులియజేయడంవల్ల సాధారణంగా హైడ్రోజన్, కార్బన్‌డయాక్సైడ్, మిథేన్‌లాంటి వాయువులు ఆవిర్భవిస్తుంటాయి. ఈ వాయువులవల్ల ఒక విధమైన దుర్వాసన వస్తుంటుంది. అలాంటి వాయువులు నోట్లోంచి వెళ్తుంటే ‘పులితేన్పులు’ అంటుంటాం.
ఇలా వాయువులు ఉత్పత్తి కాకుండా చూసుకోవాలంటే ఆహారం తీసుకునేప్పుడు మాట్లాడకూడదు. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి మింగాలి. ప్రశాంతంగా ఆహారాన్ని తీసుకోవాలి. గబగబా నమలకుండా మింగకూడదు. గాలిని మింగకూడదు. ఒకేసారి ఎక్కువెక్కువ ఆహారాన్ని తీసుకోకూడదు. యాక్టివేటెడ్ చార్‌కోల్ ఇలా పేరుకుపోతున్న వాయువుల్ని పీల్చేస్తుంది. కాని ఇది మీరు తీసుకునే మిగతా మందులతో కలిసి కొన్ని సమస్యల్ని కలిగించవచ్చు. కాబట్టి వైద్యడి సలహా మీదే తీసుకోవాలి.
కడుపులో వాయుత్ప్తివల్ల గుండెల్లో మంటలా అనిపించవచ్చు, ఛాతీలో అసౌకర్యాన్ని కలిగిస్తూ. తగు మోతాదులో యాంటి యాసిడ్స్‌ని తీసుకుంటే ఆ ఛాతీలో మంట తగ్గుతుంది. మీకు సరిపడని ఆహారాన్ని, ద్రవ పదార్థాల్ని తీసుకోవడం మానేయండి. పడుకునేలోపు జీర్ణమయ్యే ఆహారానే్న తీసుకోండి. బోర్లాపడుకోకండి. దిండుని తలక్రింద పెట్టుకుంటుండండి.

-డా.గోవింద్ ఆర్.వర్మ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, పేస్ హాస్పిటల్స్, 8885095601